శ్రీరాజ్ బళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాజ్ బళ్ళ
Sriraj Balla.png
జననంజూన్ 4
వృత్తితెలుగు సినిమా, టివి నటుడు, దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిమాధవి
పిల్లలుఇద్దరు కుమారులు

శ్రీరాజ్ బళ్ళ తెలుగు సినిమా, టివి నటుడు, దర్శకుడు, రచయిత.[1][2] 2015లో వచ్చిన ఎఫైర్, 2017లో వచ్చిన అవంతిక సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3][4]

జీవిత విషయాలు[మార్చు]

శ్రీరాజ్, జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

నటన, గానం, డ్యాన్స్ విభాగాల్లో ఆసక్తివున్న శ్రీరాజ్, హైదరాబాదు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించాడు. కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్, కో-డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఆ తరువాత ఆషాడం పెళ్ళికొడుకు సినిమాలో తొలిసారిగా నటించాడు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కుడా పనిచేశాడు. 2012లో దర్శకుడిగా పదును అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ తరువాత అనగనగా, ఎఫైర్, అవంతిక సినిమాకు దర్శకత్వం వహించాడు. 2017లో పూర్ణ హీరోయిన్ గా వచ్చిన అవంతిక సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

దర్శకత్వం చేసిన సినిమాలు[మార్చు]

టివిరంగం[మార్చు]

కలసి సీరియల్ లో తొలిసారిగా నటించాడు. అందులో విలన్ పాత్ర పోషించాడు. ఆ తరువాత ఈటీవి వచ్చిన మమతల కోవెల, చంద్రముఖి, ప్రియాంక వంటి సీరియళ్ళలో నటించాడు. నీ కొంగు బంగారం కానూ, సి రియల్ స్టార్స్, భలే ఛాన్స్ లే వంటి టివి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నర్తనశాల డ్యాన్స్ ప్రోగ్రాం టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

మూలాలు[మార్చు]

  1. "All you want to know about #SriRajBalla". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
  2. "Sri Raj Balla - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-06-04.
  3. "Avantika (2017)". Indiancine.ma. Retrieved 2021-06-04.
  4. "Sriraj Balla: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-06-04.
  5. "Sriraj Balla : Director Bio, Filmography". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Anchor Prasanthi unveiled her new look in the film Affair in TFI - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.

బయటి లింకులు[మార్చు]