వీరభద్ర (సినిమా)
వీరభద్ర (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.యస్.రవికుమార్ చౌదరి |
---|---|
తారాగణం | బాలకృష్ణ, తనుశ్రీ, సదా, అజయ్ (నటుడు), బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, రమాప్రభ |
నిర్మాణ సంస్థ | కనక మహలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 29 ఏప్రిల్ 2005 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 82 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో అంబికా సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అంబికా కృష్ణ, అంబికా రామంజనేయులు నిర్మించిన యాక్షన్ చిత్రం వీరభద్ర . ఇందులో నందిమూరి బాలకృష్ణ, తనూశ్రీ దత్తా, సదా ప్రధాన పాత్రల్లో నటించారు, మణి శర్మ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2005 ఏప్రిల్ 29 న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[1][2][3]
కథ
[మార్చు]మురళి ( బాలకృష్ణ ) ని పెద్దిరాజు ( సయాజీ షిండే ) సోదరులు వెంబడిస్తూంటారు. పెద్దిరాజు జైలులో ఉంటాడు. వారు అతనిని ఎందుకు వెంబడిస్తున్నారో చెప్పారు. మురళి ఒక వికలాంగ మహిళకు సోదరుడు, ప్రతిరోజూ ఆమెను కళాశాలకు తీసుకువెళతాడు. వాస్తవానికి, అతను అష్ట లక్ష్మి ( సదా ) తో సరదాగా ఆడుకుంటూంటాడు కూడా. నెమ్మదిగా కథ మురళి గతంలోకి, వెళ్తుంది. అతనికీ విలన్‌కూ మధ్య ఏమి జరిగిందో. దీనికి పెద్దరాజు సోదరి మాలతి ( తనూశ్రీ దత్తా ) కి సంబంధమేంటో మిగతా కథలో తెలుస్తుంది
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "జనం కోసం" | భాషాశ్రీ | శంకర్ మహదేవన్ | 5:05 |
2. | "అబ్బబ్బా" | భాస్కరభట్ల | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:52 |
3. | "అ ఏడుకొండలు" | భాస్కరభట్ల | టిప్పు, లెనినా చౌదరి | 4:59 |
4. | "జుజూబీలల్లో" | చిన్ని చరణ్ | కెకె, మహాలక్ష్మి అయ్యర్ | 4:49 |
5. | "సిరిమల్లి" | సాయి హర్ష | మల్లికార్జున్, శ్రీవర్ధిని | 4:58 |
6. | "బొప్పాయి బొప్పాయి" | చిన్ని చరణ్ | కార్తిక్, సుజాత | 4:39 |
మొత్తం నిడివి: | 29:22 |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". IMDb.
- ↑ "Heading-2". Indiaglitz.
- ↑ "Heading-3". fullhyd.