ఇస్మార్ట్ శంకర్
ఇస్మార్ట్ శంకర్ | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ |
స్క్రీన్ ప్లే | పూరీ జగన్నాథ్ |
నిర్మాత | పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ |
తారాగణం | రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్ |
ఛాయాగ్రహణం | రాజ్ తోట |
కూర్పు | జునైద్ సిద్దిఖీ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థలు | పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ |
విడుదల తేదీ | 18 జూలై 2019 |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹25 కోట్లు[1] (ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల కలెక్షన్లు) |
ఇస్మార్ట్ శంకర్ 2019, జూలై 18న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[3]
కథ
[మార్చు]హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ (రామ్) డబ్బు కోసం మాజీ ముఖ్యమంత్రి కాశీవిశ్వనాథ్‌ను చంపేస్తాడు. ఈ నేరం నుండి తప్పించుకునే క్రమంలో శంకర్ ప్రియురాలైన చాందిని (నభానటేష్) చనిపోతుంది. ప్లాన్ ప్రకారం తనతో ఈ హత్య చేయించి నేరస్తుడిగా ముద్రవేశారనే విషయం తెలుసుకున్న శంకర్, అసలు హంతకులను పట్టుకోవడం కోసం జైలు నుంచి పారిపోతాడు. మరోవైపు ఈ హత్యకేసును పరిశోధిస్తున్న నిజాయితీపరుడైన సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఈ కేసును చేధించే క్రమంలో చనిపోతాడు. దాంతో అతడి ప్రియురాలు న్యూరో సైంటిస్ట్ సారా (నిధి అగర్వాల్) సహాయంతో అరుణ్ మెదడులో నిక్షిప్తమైన రహస్యాల్ని శంకర్ బ్రెయిన్‌లోకి పంపిస్తుంది. అరుణ్ మెమోరీ సహాయంతో అసలు హంతకుల్ని శంకర్ ఎలా పట్టుకునడనేది మిగతా కథ.[4]
నటవర్గం
[మార్చు]- రామ్ పోతినేని (ఇస్మార్ట్ శంకర్)
- నిధి అగర్వాల్ (సారా)
- నభా నటేష్ (చాందిని)
- సత్యదేవ్ కంచరాన (అరుణ్)
- పునీత్ ఇస్సార్
- దీపక్ శెట్టి
- ఆశిష్ విద్యార్థి
- సాయాజీ షిండే
- గెటప్ శ్రీను (శంకర్ స్నేహితుడు)
- తులసి
- గంగవ్వ
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
- నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: రాజ్ తోట
- కూర్పు: జునైద్ సిద్దిఖీ
- నిర్మాణ సంస్థ: పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
నిర్మాణం
[మార్చు]చిత్రీకరణలో హైదరాబాదు షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తయింది.[5] మార్చిలో గోవాలో చిత్రీకరణ పూర్తయింది.[6] ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను ఏప్రిల్‌లో వారణాసిలో చిత్రీకరించారు.[7] మే నెలలో మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయింది.[8]
విడుదల
[మార్చు]ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మే 15న హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేయబడింది.[3][9]
బాక్సాఫీస్
[మార్చు]మూడు రోజుల్లో రూ. 36 కోట్లు వసూలు చేసింది.[10] ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.[11] 9 రోజుల్లో 63 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.[12]
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "దిమాక్ ఖరాబ్ (రచన: కాసర్ల శ్యామ్)" | కాసర్ల శ్యామ్ | కీర్తన శర్మ, సాకేత్ కో | 4:40 |
2. | "జిందాబాద్ జిందాబాద్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | శరత్ సంతోష్, రమ్య బెహర | 4:40 |
3. | "ఇస్మార్ట్ థీమ్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | రచన: భాస్కరభట్ల రవికుమార్ | అనురాగ్ కులకర్ణి, (ఎన్. సి. కారుణ్య, హేమచంద్ర, సాయిచరణ్, శ్రీకృష్ణ, ధనుంజయ్, సాహితి చాగంటి, లిప్సిక) | 4:12 |
4. | "ఉండిపో (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర | 5:09 |
5. | "బోనాలు (రచన: కాసర్ల శ్యామ్)" | రచన: కాసర్ల శ్యామ్ | రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు | 5:51 |
మొత్తం నిడివి: | 21:09 |
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు
[మార్చు]2019 సైమా అవార్డులు
- ఉత్తమ నేపథ్య గాయకుడు (అనురాగ్ కులకర్ణి - ఇస్మార్ట్ థీమ్)
మూలాలు
[మార్చు]- ↑ iSmart Shankar box office collection: Ram Pothineni film earns Rs 25 crore in 2 days - Movies News - https://www.indiatoday.in/movies/regional-cinema/story/ismart-shankar-box-office-collection-ram-pothineni-film-earns-rs-25-crore-in-2-days-1571568-2019-07-20
- ↑ "Ram Pothineni's iSmart Shankar release date finally out". The Live Mirror. Archived from the original on 2019-05-31. Retrieved 2019-07-20.
- ↑ 3.0 3.1 "Ismart Shankar teaser out. Ram Pothineni gives fans action-packed return gift on his birthday". India Today. 20 July 2019.
- ↑ సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్ శంకర్' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
- ↑ "ISMART SHANKAR' DONE WITH HYD SCHEDULE, TO GO TO GOA". India Glitz. 28 February 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
- ↑ Neeshita Nyayapati (23 March 2019). "Puri Jagannadh and Ram Pothineni's 'iSmart Shankar' wraps up Goa schedule". Times of India. Retrieved 21 July 2019.
- ↑ "'iSmart Shankar' moves to Varanasi". Telugu Cinema. 30 April 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
- ↑ "'ISMART SHANKAR' WRAPS UP TALKIE PART, LOCKS TEASER DATE". India Glitz. 12 May 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
- ↑ Kumar R, Manoj (15 May 2019). "iSmart Shankar movie teaser: Ram Pothineni transforms into Puri Jagannadh's hero". Indian Express. Retrieved 21 July 2019.
- ↑ ప్రజాశక్తి, తాజావార్తలు (21 July 2019). "మూడు రోజుల్లో రూ. 36 కోట్లు... సేఫ్ జోన్ 'ఇస్మార్ట్ శంకర్'!". Archived from the original on 21 July 2019. Retrieved 21 July 2019.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (24 July 2019). "ఆరు రోజుల్లో 56 కోట్లు కొల్లగొట్టిన ఇస్మార్ట్ శంకర్". www.ntnews.com. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (27 July 2019). "మొదటిసారి సక్సెస్ కోసం తపించా". www.andhrajyothy.com. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.