టక్కరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టక్కరి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం అమ్మ రాజశేఖర్
తారాగణం నితిన్, సదా, ఆలీ (నటుడు), చంద్రమోహన్, రఘుబాబు, సుధ, వేణు మాధవ్, సాయాజీ షిండే
ఛాయాగ్రహణం సంతోష్ శ్రీనివాస్
విడుదల తేదీ 23 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

టక్కరి 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, సదా, ఆలీ (నటుడు), సుధ, వేణు మాధవ్, సాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.

కథ[మార్చు]

తిరుపతి ఇష్టం వచ్చినట్టు తిరిగే యువకుడు. ఈయన తిరుగుళ్లు భరించలేక ఆయన తల్లిదండ్రులు(చంద్రమోహన్, సుధ) ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తిరు(షార్ట్ నేమ్) లో మార్పు రాకపోవడంతో కోపం వచ్చిన ఆయన తండ్రి ఇల్లు విడిచివెళ్లిపొమ్మంటాడు. ఇల్లువదిలిన తిరు ఆ రాత్రి దేవాలయంలో పడుకుంటాడు. పొద్దున లేవగానే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. పేరు ప్రియ(సదా). యధాప్రకారమే మన హీరో ప్రేమలో పడతాడు. ప్రియ పేరుగాంచిన వ్యాపారి గురు (షాయాజీ షిండే) చెల్లెలు. తిరు తన ప్రేమను నేరుగా చెప్పకుండా కొత్తదనం కోసం అన్నట్టుగా కొత్త రూట్లో వెళతాడు. ప్రియ అన్న గురును కలిసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. తనతో చెప్పకుండా నేరుగా పెద్దలతో చెప్పడం నచ్చి ప్రియ కూడా ప్రేమలో పడుతుంది. గురు ఒప్పుకున్నాడా, వారి ప్రేమ ఫలించిందా, తిరు తిరిగి ఇంటికి చేరుకున్నాడా అన్నది మిగిలిన కథ.

నితిన్

నటవర్గం[మార్చు]

 1. నితిన్
 2. సదా
 3. ఆలీ (నటుడు)
 4. చంద్రమోహన్
 5. రఘుబాబు
 6. సుధ
 7. వేణు మాధవ్
 8. సాయాజీ షిండే

సాంకేతికవర్గం : పాటలు[మార్చు]

 • దర్శకుడు: అమ్మ రాజశేఖర్
 • నిర్మాత: పరుచూరి శ్రీవరం ప్రసాద్
 • సంగీత దర్శకుడు: చక్రి
 • అమ్మి అమ్మి , చక్రి, సాయి శివాని
 • కొబ్బరి కొబ్బరి, చక్రి, కౌసల్య
 • ఏలే ఏలే , జుబీన్ గార్గ్ , రేవతి
 • ఏలే ఏలే 2, చక్రి, రేవతి
 • నాచో నాచొ, రవివర్మ
 • ఆ ఆ ఆ , నవీన్ మాధవ్, కౌసల్య.


బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=టక్కరి&oldid=3997137" నుండి వెలికితీశారు