సంతోష్ శ్రీనివాస్
Jump to navigation
Jump to search
సంతోష్ శ్రీనివాస్ | |
---|---|
జననం | 18 జూలై, 1980 |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్ |
సంతోష్ శ్రీనివాస్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్. కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ పనిచేసిన సంతోష్ శ్రీనివాస్, రామ్ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]సంతోష్, విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నంలోనే పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తిచేశాడు.[2]
సినిమారంగం
[మార్చు]2006లో వచ్చిన ఖతర్నాక్ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన సంతోష్ శ్రీనివాస్, తరువాత టక్కరి, రెయిన్‌బో వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.[3] దర్శకుడిగా తొలిచిత్రం 2011లో కందిరీగ సినిమా. ఇందులో రామ్ పోతినేని, హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.రామారావు, సమంత ప్రధాన పాత్రలలో రభస సినిమా తీశాడు.[4]
మూలాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | విభాగం | మూలాలు |
---|---|---|---|
2006 | ఖతర్నాక్ | సినిమాటోగ్రఫీ | |
2007 | టక్కరి | సినిమాటోగ్రఫీ | |
2008 | రెయిన్ బో | సినిమాటోగ్రఫీ | |
2011 | కందిరీగ | దర్శకత్వం | |
2014 | రభస | దర్శకత్వం | |
2016 | హైపర్ | దర్శకత్వం | |
2021 | అల్లుడు అదుర్స్ | దర్శకత్వం, రచన |
మూలాలు
[మార్చు]- ↑ "Movie review - Kandireega". www.idlebrain.com. Retrieved 20 April 2021.
- ↑ "Exclusive Interview with Kandireega Director". www.myfirstshow.com. Archived from the original on 27 నవంబరు 2015. Retrieved 20 April 2021.
- ↑ "Santosh Srinivas interview". www.idlebrain.com. Retrieved 20 April 2021.
- ↑ "NTR – Santosh Srinivas film launch". www.idlebrain.com. Retrieved 20 April 2021.