అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా)
స్వరూపం
అమర్ అక్బర్ ఆంటోని | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
స్క్రీన్ ప్లే | శ్రీను వైట్ల |
కథ | శ్రీను వైట్ల వంశి రాజేశ్ కొండవీటి |
నిర్మాత | నవీన్ యెర్నెని |
తారాగణం | రవితేజ ఇలియానా విక్రమ్ జీత్ అభిమన్యు సింగ్ |
Narrated by | శ్రీను వైట్ల |
ఛాయాగ్రహణం | వెంకట్ సి దిలీప్ |
కూర్పు | యం.ఆర్ వర్మ |
సంగీతం | ఎస్.ఎస్.థమన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | యురోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 16 నవంబరు 2018 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | 9.87 కోట్లు |
అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. రవితేజ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.[1][2][3][4] ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది.[5][6] మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[7][8][9] ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను తర్వాత వచ్చిన నాలుగవ చిత్రం.[10][11]
నటీనటులు
[మార్చు]- రవితేజ (అమర్/ అక్బర్/ ఆంటోని)
- ఇలియానా (ఐశ్వర్య / పూజ / తెరీసా)
- విక్రమ్ జేత్(విక్రమ్ తల్వార్)
- అభిమన్యు సింగ్ (ఎఫ్ బీ ఐ ఆఫీసర్ బల్వన్త్ ఖర్గే)
- సునీల్ (బాబీ)
- తరుణ్ అరోరా (కరణ్ అరోరా)
- సాయాజీ షిండే (జలాల్ అక్బర్)
- ఆదిత్య (సబూ మీనన్)
- శుభలేఖ సుధాకర్ (డా. మార్క్ ఆంటోని)
- అభిరామి (అమర్ తల్లి)
- ఛంద్రహాస్
- గాయత్రి గుప్తా
- శ్లోక
- సిజాయ్ వర్ఘీస్
- లయ
- రఘు బాబు
- శ్రీనివాస రెడ్డి
- వెన్నెల కిశోర్
- జయప్రకాష్ రెడ్డి
- భరత్ రెడ్డి
- రవి ప్రకాష్
- తనికెళ్ళ భరణి
- వెంకట గిరిధర్
- రాజ్వీర్ అంకుర్
- సత్య
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించగా ఈ పాటలని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కలలా కధలా" | రామజోగయ్య శాస్త్రి | హారిని ఇవ్వటూరి | 4:41 |
2. | "డాన్ బోస్కో" | విశ్వ | శ్రీ క్రిష్ణ, జస్ప్రీత్ జాస్జ్, హరితేజ, మనీషా ఈరబత్తిని, రమ్య బెహరా | 4:39 |
3. | "ఖుల్లమ్ ఖుల్లా చిల్ల" | బాలాజి | నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా | 3:34 |
4. | "గుప్పెట" | బాలాజి | రంజిత్, కాల భైరవ, శ్రీ క్రిష్ణ, సాకేత్, హేమచంద్ర, ఎల్.వి. రేవంత్ | 4:16 |
మొత్తం నిడివి: | 17:10 |
మూలాలు
[మార్చు]- ↑ "What Is Srinu Vaitla Doing In US?"
- ↑ "Ravi Teja’s triple role"
- ↑ "Ravi Teja to sport three different looks in ‘Amar Akbar Anthony’"
- ↑ "Ravi Teja turns NRI"
- ↑ "Ileana D’Cruz to stage a comeback!"
- ↑ "Ileana replaces Anu Emmanuel in Ravi Teja’s next!"
- ↑ "‘I am financially disciplined’"
- ↑ "Ravi Teja-Srinu Vaitla film's release date sealed"
- ↑ "Amar Akbar Anthony movie review: This Ravi Teja, Ileana D'Cruz starrer is an action-comedy sans any thrills- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-11-17.
- ↑ "Srinu Vaitla and Ravi Teja to reunite?"
- ↑ "Interesting title for Ravi Teja & Vaitla movie"
వర్గాలు:
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2018 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 2018 తెలుగు సినిమాలు
- రవితేజ నటించిన సినిమాలు
- శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఇలియానా నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు