Jump to content

నీ కోసం

వికీపీడియా నుండి
నీ కోసం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
తారాగణం రవితేజ,
మహేశ్వరి
సంగీతం ఆర్.పి.పట్నాయక్
భాష తెలుగు

నీ కోసం 1999లో విడుదలై విజయవంతమైన తెలుగు చిత్రం. దర్శకుడు శ్రీను వైట్లకు తెలుగులో దర్శకుడిగా ఇది మొదటి చిత్రం.

నేపధ్యము

[మార్చు]

శ్రీను వైట్ల దర్శకుడిగా ప్రయత్నిస్తున్నాడని ఇతడితో బాటు పనిచేసిన కెమేరామేన్ ఇతడి గురించి కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న బాల్రెడ్డి మిత్రబృందానికి చెప్పడంతో వాళ్ళే ఇతడి దగ్గరికి సినిమా తీద్దామని రావడం, నీకోసం మొదలు పెట్టడం జరిగింది. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ సినిమా మొదలైతే ఐంది కానీ ఆది నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రోజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ ఐపోవడం.. మళ్ళా ఇతడే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం.అలా అష్ట కష్టాలూ పడి సినిమాని పూర్తిచేశాడు. 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్డున గారు ఇతడికి దర్శకుడిగా అవకాశం ఇస్తానన్నారు. అలానే ఆ సినిమా చూసిన రామోజీ రావు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలుచేసి విడుదల చేశారు. 1999 డిసెంబరు 3న రిలీజైంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా కోటిరూపాయలు వసూలు చేసి కమ్మర్షియల్గా సక్సెస్ అవడమే కాకుండా డైరెక్టర్గా ఇతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది. ఉత్తమ కొత్త దర్శకుడిగా ఇతడికి, ఉత్తమ స్కీన్ప్లే కీ, ద్వితీయ ఉత్తమ చిత్రంగా సినిమాకీ కూడా నంది పురస్కారాలు వచ్చాయి. ఆ విధంగా ఇతడి దర్శకత్వంలో విడులైన మొదటి సినిమా 'నీకోసం'. ఆ సినిమా విజయంతో ఇతడి మీద నమ్మకంతో రామోజీ రావు ఇతడికి ఆనందం సినిమాకి అవకాశం ఇచ్చారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

చిత్రానికి సంగీతాన్ని ఆర్. పి. పట్నాయక్ అందించారు.

Untitled

ఆర్. పి. పట్నాయక్.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నీ కోసం"  రాజేష్, కౌసల్య (గాయని)  
2. "మాయో ఏమి మాయో"  మణి నాగరాజ్, కౌసల్య (గాయని)  
3. "ఐ టూ లవ్ యు అంటూ"  మణి నాగరాజ్, నిహాల్  
4. "నీ కోసం"  ఆర్. పి. పట్నాయక్, కౌసల్య (గాయని)  
5. "మామ మామ"  ఆర్. పి. పట్నాయక్, కౌసల్య (గాయని) , నిహాల్  
6. "కొంటె బాపు"  మనో, కె. ఎస్. చిత్ర  

మూలాలు

[మార్చు]
  1. వైట్ల, శ్రీను. "మొదటి సినిమా-శ్రీను వైట్ల" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved సెప్టెంబరు 1, 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=నీ_కోసం&oldid=4357119" నుండి వెలికితీశారు