పరుగో పరుగు
పరుగో పరుగు (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
కథ | మాలిక్ |
చిత్రానువాదం | రేలంగి నరసింహారావు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, శృతి బ్రహ్మానందం అనంత్ చలపతిరావు గిరిబాబు ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
సంభాషణలు | కాశీ విశ్బ్వనాథ్ |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | రవీంద్ర బాబు |
నిర్మాణ సంస్థ | సత్యదేవి మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
పరుగో పరుగు 1994 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, సత్యదేవ్ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ [1] లో సుధాకర్ నిర్మించాడు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రుతి నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[3] ఇది హిందీ చిత్రం జానే భీ దో యారో (1983) కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[4]
కథ
[మార్చు]రాంబాబు (రాజేంద్ర ప్రసాద్) ఓ చేతగాని ఫోటోగ్రాఫరు. సహాయకుడు కిట్టిగాడు (అనంత్) తో కలిసి ఒక ఫోటో స్టూడియోను తెరిచాడు. కొన్నాళ్ళ తరువాత, అతను ఒక అందమైన అమ్మాయి సరోజ (శ్రుతి) ప్రేమలో పడతాడు. ఆమె సాహచర్యంలో రాంబాబును పరిపూర్ణుడవుతాడు. సరోజ సన్నిహితురాలు నీలిమ (దీపిక) ఒకసారి ఆటోమేటిక్ కెమెరా గురించి తెలుసుకోవడానికి రాంబాబు స్టూడియోకు వెళ్తుంది. ఈ ప్రక్రియలో, దురదృష్టవశాత్తు, నీలిమ కుప్ప కూలిపోతుంది. రాంబాబు ఆమెను పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడు ఒక ఫోటో తీస్తారు.
నీలిమ భర్త రంగనాథరావు (చలపతి రావు) ఒక స్మగ్లరు. అతణ్ణి నేరాలను ఆపమని ఆమె ఎప్పుడూ హెచ్చరిస్తూంటుంది. కాబట్టి, రంగనాథ రావు అనుచరులైన వీరు (గిరి బాబు), జగ్గు (ప్రదీప్ శక్తి) లతో ఆమెను చంపేస్తాడు. దీన్ని అతడి మరో అనుచరుడు ఫోటో తీస్తాడు.
ప్రస్తుతం, రాంబాబు ఒక ఛాయాగ్రహణం పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం అతను చాలా ఫోటోలు తీస్తాడు. వాటిని ల్యాబులో డెవలప్ చేసేటపుడు వాటిలో ఒకదానిలో నీలిమ శవం కనిపిస్తుంది. వెంటనే, రాంబాబు పోలీసులకు సమాచారం ఇస్తాడు, కాని ఓ ఫోటో సాయంతో రంగనాథ రావు ఈ నేరాన్ని రాంబాబుపై మోపుతాడు. రాంబాబు వెంటనే పరారవుతాడు. నిజమైన హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.
రంగనాథ రావును అపరాధిగా గుర్తించి, కిట్టుగాడితో పాటు అతనిని అనుసరిస్తాడు. ఆ తరువాత, వారు ఫోటోను చూపించి రంగనాథ రావును అతని వ్యక్తులనూ జాకాల్ బ్లాక్ మెయిల్ చేయడం గమనిస్తారు. దాంతో వాళ్ళు అతన్ని చంపేస్తారు. చనిపోయే ముందు, జాకాల్ ఆ ఫోటో నెగటివులను మింగేస్తాడు. అతని కడుపులోని నెగటివులే రాంబాబు నిర్దోషిత్వానికి ఏకైక రుజువు, కాబట్టి, అతను మృతదేహాన్ని మోసుకుని పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఒక వైపు రంగనాథ రావు, మరో వైపు పోలీసులు వారి వెంట పడతారు. క్లైమాక్స్‌లో, వీరంతా మహాభారతం యొక్క స్పూఫ్ నాటకం ఆడే థియేటర్‌కు చేరుకుంటారు. చివరికి, జాకాల్ కడుపు నుండి నెగటివును బయటకు తీయడంతో నిజం తెలుస్తుంది. రాంబాబు, సరోజల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "మౌనమేల" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:37 |
2. | "బుగ్గా బుగ్గా" | మాల్గాడి శుభ | 3:52 |
3. | "కిందనుంచి పైకి" | మనో, ఎస్.పి. శైలజ | 4:00 |
4. | "అజంతా గుహలో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 3:57 |
5. | "హౌరే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 3:25 |
మొత్తం నిడివి: | 19:41 |
మూలాలు
[మార్చు]- ↑ "Parugo Parugu (Banner)". Bharat Movies. Archived from the original on 2018-10-01. Retrieved 2020-08-25.
- ↑ "Parugo Parugu (Direction)". Tollywood Movies.com. Archived from the original on 2016-09-13. Retrieved 2020-08-25.
- ↑ "Parugo Parugu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-08-08. Retrieved 2020-08-25.
- ↑ "Parugo Parugu (Review)". Telugu Cinema Profile.