Jump to content

క్షణక్షణం

వికీపీడియా నుండి
(క్షణ క్షణం నుండి దారిమార్పు చెందింది)
క్షణక్షణం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
కథ రామ్ గోపాల్ వర్మ
తారాగణం వెంకటేష్ (చందు) ,
శ్రీదేవి (సత్య),
పరేష్ రావల్ (నాయర్ / మస్తాన్) ,
రామిరెడ్డి (ఇనస్పెక్టర్ యాదవ్) ,
బ్రహ్మానందం (బట్టలషాపు యజమాని) ,
నర్సింగ్ యాదవ్ (నర్సింగ్)
సంగీతం ఎం. ఎం. కీరవాణి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్
విడుదల తేదీ 9 అక్టోబర్ 1991
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

చిత్రకథ

[మార్చు]

ఒక అమ్మాయి సత్య (శ్రీదేవి) హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంటుంది. చందు (వెంకటేష్) ఒక దొంగ. పోలీసు ఇనస్పెక్టరుగా నాటకమాడి సూట్ కేసు కొట్టేస్తాడు. ఫొటో స్టూడియోలో శ్రీదేవి బాగు లోనికి క్లోక్ రూమ్ రసీదు వస్తుంది. ఆ రిసీటు కోసం పరేష్ రావల్, మరో బృందం శ్రీదేవిని వెంటాడుతారు. వెంకటేష్, శ్రీదేవితో అడవిలోకి తప్పించుకుంటాడు. అడవిలో,శత్రువులనుండి తప్పించుకుని మళ్ళీ నగరానికి వస్త్తారు. అక్కడి నుండి, క్లోక్ రూమ్ రసీదుతో కోటి రూపాయలున్న బ్యాగు తీసుకుంటారు. చెప్పుకొనేంత పెద్ద కథ లేకుండా.... కధనం లో వైవిధ్యం తో ఆకట్టుకుంటుంది.సహజత్వం తో తీసిన సినిమా గా తర్వాత మళ్లీ మళ్లీ జనం ఆదరించి వర్మ ఐడియా లకు, సినిమా తీసే విధానానికి అలవాటు పడ్డ చందంగా మారింది. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లన్నీ ఇపుడు ఏదో ఒక కొత్త వివాదం తలెత్తుతూ....ఆ వార్త హల్చల్ చేస్తోంది.తీసే సినిమాలో కూడా ఖచ్చితంగా మొదట్లో ఉన్నంత ప్రతిభ లేదు.క్షణ క్షణం,అంతం, కిల్లింగ్ వీరప్పన్, సత్య(జేడీ చక్రవర్తి) లాంటి వి చాలా అరుదుగా మాత్రమే చూడగలరు. ఇతర సినిమాల్లో అక్కడక్కడా మెరుపులు తప్పించి తన ధోరణిలో తాను కోరుకుంటున్నట్లు తీసిన సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి తప్పు హిట్ కావడం లేదు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • జామురాతిరి జాబిలమ్మా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం :ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. మనో, కె ఎస్ చిత్ర
  • అమ్మాయి ముద్దు ఇవ్వందే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • రాజైన మహారాజైన మనీ ఉన్న మనముందు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , శ్రీదేవి
  • అందనత్తా ఎత్తా.... తారాతీరం సంగతెందో చూద్దాం రా....., రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

విశేషాలు

[మార్చు]

శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారు. ఈ సినిమా తొలివిడత విడుదలైన సమయంలో సరిగా ఆడలేదు. మలివిడత విడుదలైన తర్వాతే విజయం సాధించి ఇప్పటికీ ఎంతో మంది చూస్తున్నారు.

శ్రీదేవికి నటనా చాతుర్యం, ఆహార్యం, వయస్సు దాటినా వన్నె తరగని అందంతో అభిమానులను అలరించింది. వెంకటేష్ సరసన తొలిసారిగా,మలిసారిగా ఈ సినిమాలోనే నటించింది. ఆ తరం లో బాలయ్య బాబు తో తప్ప అందరితో జత కట్టిన ఘనత శ్రీదేవికి దక్కింది.

‘క్షణ క్షణం’ చిత్రాన్ని చూసినపుడు శ్రీదేవి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఆమె నటనలో పరిపక్వం చెందింది. ఈ సినిమాలో సహజత్వంతో కూడుకొన్న ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్నిచోట్ల ఆమె ముఖంలో పలికించే హావభావాలు బాగుంటాయి. అందుకేనేమో వర్మ ఈ చిత్రాన్ని ‘శ్రీదేవికి నేను రాసిన ప్రేమలేఖ’ అంటాడు. ఈ సినిమాలో హీరో వెంకటేష్‌ అయినా, శ్రీదేవే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడవిలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో వెంకటేష్‌ కాలు జారిన తరువాత ఆమె నవ్వుతూనే ఉండే సన్నివేశం ఉంది. అక్కడ ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. వెంకటేష్‌ కల్పిత కథ పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి చెపుతుంటే, ‘ఈ సినిమా నేను చూసానంటూ’ శ్రీదేవి ఓ సన్నివేశంలో నవ్వులు పూయిస్తుంది. రౌడీలు అల్లరి (టీజ్‌) చేస్తున్నపుడు, కొండ చిలువ ముందు పడిపోయినప్పుడు, వర్మ ఆమె ముఖాన్ని క్లోజ్‌ షాట్‌లో చూపించి, ఆమె నటన ముఖంలో ఎలా పండుతుందో చూపారు. శ్రీదేవి అప్పటికే ఎన్నో సినిమాలు చేసినా కూడా, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత సంతరించుకొంది. పాటల్లో అయితే శ్రీదేవి చిలిపితనం మరింత స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పటికీ ఆ సినిమా ఒక దృశ్య కావ్యమే! ఆమె నటన కోసం మరలా చూడాలనిపిస్తుంది... శ్రీదేవి నిజంగా పరిపూర్ణత పొందిన నటి.

అవార్డులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]