Jump to content

పెళ్లిసందD

వికీపీడియా నుండి
పెళ్లిసందD
దర్శకత్వంగౌరి రోనంకి
నిర్మాతమాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
తారాగణంరోషన్‌, శ్రీలీల
ఛాయాగ్రహణంసునీల్ కుమార్ నామ
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
ఆర్కా మీడియా & ఆర్.కె అసోసియేట్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

పెళ్లిసందD తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఆర్కా మీడియా. ఆర్.కె అసోసియేట్స్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోనంకి దర్శకత్వం వహించింది. రోషన్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.[1][2]

వశిష్ట (రోషన్‌) బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌, తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతను ఒక పెళ్ళిలో ఫ్యాష‌న్ డిజైనర్ అయిన సహస్ర (శ్రీలీలా)ను చూసి ప్రేమలో పడతాడు. సహస్ర కూడా వశిష్టను ప్రేమిస్తుంది. తన అక్క (వితిక శేరు) జీవితం కోసం తండ్రి (ప్రకాష్ రాజ్)కి సహస్ర ఓ మాట ఇస్తుంది. స‌హ‌స్ర త‌న తండ్రికి ఏమని మాట ఇస్తుంది? చివరకు వశిష్ట తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ప్రేమంటే ఏంటి , రచన: చంద్రబోస్ గానం.హరిచరన్ , శ్వేతా పండిట్
  • బుజ్జులు బుజ్జులు , రచన: చంద్రబోస్, గానం.బాబాసెహగల్ , మంగ్లీ
  • పెళ్లి సందడి , రచన: చంద్రబోస్ , గానం.హేమచంద్ర, దీపు, రమ్య బెహరా
  • మధురానగరిలో , రచన: చంద్రబోస్, గానం.శ్రీనిధి , నారాయణ నాయర్ , కాలభైరవ
  • గంధర్వ లోకాల , రచన: చంద్రబోస్, గానం.హేమచంద్ర , రమ్య బెహరా
  • హాయం వశిష్ఠ , రచన: శివశక్తి దత్త, గానం.కాలభైరవ, లిప్సిక.

సాంకేతికవర్గం

[మార్చు]
  • ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘవేంద్రరావు (బి.ఎ)
  • ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి
  • నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
  • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
  • పాటలు: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
  • సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ
  • ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
  • ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,
  • మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌
  • ఫైట్స్‌: వెంక‌ట్
  • కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సాయిబాబా కోవెల‌మూడి
  • ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు
  • స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

లిరికల్ సాంగ్స్

[మార్చు]

పెళ్లిసందD లోని మొదటి లిరికల్ పాట 'ప్రేమంటే ఏంటి' ని 2021 ఏప్రిల్ 28న విడుదల కాగా రెండ‌వ‌పాట ‘బుజ్జులు బుజ్జులు...’ పాటను 23 మే 2021న విడుదల చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిచరణ్, శ్వేతా పండిట్ పాడారు. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Disha daily (దిశ) (12 January 2021). "'పెళ్లి సందడి'ని రెట్టింపు చేసే 'పెళ్లిసందD'". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  2. Eenadu (27 April 2021). "'పెళ్లిసందD' మొదలైంది - premanteenti the first lyrical song announcement from pellisandad". m.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  3. TV9 Telugu (15 October 2021). "పాత పెళ్లి సంద‌డిని గుర్తుచేసిన... పెళ్లి సంద‌D". Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (10 July 2021). "హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!". Namasthe Telangana. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  5. The Times of India (29 April 2021). "Preamante Enti song from Roshan and Sri Leela starrer Pelli SandaD released - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  6. Sakshi (23 May 2021). "Pelli SandaD: ఆకట్టుకుంటున్న 'బుజ్జులు బుజ్జులు..' సాంగ్‌". Sakshi. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.