చంద్రమోహన్

వికీపీడియా నుండి
(చంద్ర మోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చంద్రమోహన్
ChandraMohanActor.jpg
సుప్రసిద్ద తెలుగు నటుడు చంద్రమోహన్
జన్మ నామంమల్లంపల్లి చంద్రశేఖర రావు
జననం (1945-05-23) 1945 మే 23 (వయస్సు: 74  సంవత్సరాలు)
పమిడిముక్కల, కృష్ణా జిల్లా, భారత్
భార్య/భర్త జలంధర
పిల్లలు ఇద్దరు కుమార్తెలు

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

జీవిత సంగ్రహం[మార్చు]

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. వీరు వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.

ఈయన భార్య పేరు జలంధర. ఈమె మంచి రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించడం జరిగింది.

పురస్కారములు[మార్చు]

నటించిన కొన్ని చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]