మామా అల్లుళ్ళ సవాల్
మామా అల్లుళ్ళ సవాల్ (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
తారాగణం | కృష్ణ, జమున , కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, సారధి, రమాప్రభ, రంగనాథ్, చంద్రమోహన్ , శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఇది 1980 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
చిత్ర కథ
[మార్చు]రామాంజనేయయుద్ధం, కృష్ణార్జున యుద్ధం ఇతివృత్తాలని సమకాలీన కథగా మార్ఛి రూపొందించిన చిత్రం. చిత్ర కథను ఎమ్.డి.సుందర్ తయారు చేసారు. సత్యనారాయణ ఒక పోలీసు అధికారి,అతని భార్య జమున, వారి కూతురు శ్రీదేవి. జమున సోదరుడు కృష్ణ .వృత్తిరీత్యా లాయరు. అక్కకూతురును పెళ్ళాడాడు. ఒక కేసులో సత్యనారాయణ చంద్రమోహన్ నూ అరెస్టు చేసి దోషిగా నిలబెడతాడు. కృష్ణ చంద్రమోహన్ వైపు వాదించటానికి పూనుకుంటాడు. కృష్ణ చంద్రమోహన్ ను నమ్మడానికి కారణం - అతడు తన ప్రాణ స్నేహితుని (రంగనాథ్) సోదరుడు కావడం. ఎంత దరిద్రంలో ఉన్నా చనిపోయిన అన్నకు ఇస్టమైన బంగారు గొలుసును అమ్మకపోవడం ( ఆ గొలుసును గతంలో కృష్ణ, రంగనాథ్ కు బహూకరిస్తాడు). సత్యనారాయణ, (మామ) కృష్ణ (అల్లుడు) సంఘర్షణ చిత్ర కథ . చిత్రంలో సమాంతరంగా సాగే హాస్య కథ ఉంది. అల్లు ధనవంతుడైనా పాత వృత్తి పాత పేపర్లు,చిత్తు కాగితాల సేకరణ మానుకోడు. అతని కూతురు రమాప్రభకు కృష్ణుడంటే ఇష్టం. సారథి వాల్ పోస్టర్లు అంతించేవాడు. అల్లు అతని పొస్టర్లు దొంగిలించడం. సారథి,రమాప్రభ ప్రేమించుకోవడం ఆకథ. వారిద్దరి మధ్య ఒక డ్యూయెట్టు కూడా ఉంది.