ప్రాణం ఖరీదు
| ప్రాణం ఖరీదు (1978 తెలుగు సినిమా) | |
| దస్త్రం:Pranam-kareedu-poster.jpg | |
|---|---|
| దర్శకత్వం | కె.వాసు |
| కథ | సి.ఎస్.రావు |
| తారాగణం | చంద్రమోహన్ , మాధవి, చిరంజీవి, కోట శ్రీనివాసరావు |
| సంగీతం | కె.చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి |
| సంభాషణలు | సి.ఎస్.రావు |
| ఛాయాగ్రహణం | బి. ఎస్. లోకనాథ్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్ |
| భాష | తెలుగు |
ప్రాణం ఖరీదు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ప్రముఖ దర్శకుడు, నటుడు చిత్తజల్లు శ్రీనివాస్ రావు రచించిన నాటకం ఆధారంగా నిర్మించబడింది.[1] ఇది గుణచిత్ర నటుడు కోట శ్రీనివాసరావుకు తొలి చిత్రం. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రావు గోపాలరావు, జయసుధ, మాధవి, చిరంజీవి (విడుదలైన తొలి చిత్రం), రేష్మా రాయ్, నూతన్ ప్రసాద్, చలం ముఖ్య పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు. .
కథ
[మార్చు]భూస్వామి కనకయ్య (రావు గోపాలరావు) తన కుమార్తె సమవయస్కురాలైన సీత (జయసుధ) ని కరణం (నూతన్ ప్రసాద్) సహకారంతో వివాహం చేస్కొంటాడు. సీతని బాగా కట్టడి చేస్తాడు. పట్నం నుండి వచ్చిన సీత తమ్ముడు బంగారం (చలం), కనకయ్య ఇంటి పనివాడు, బధిరుడైన దేవుడి (చంద్ర మోహన్) చెల్లెలు బంగారి (రేష్మా రాయ్) పైన కన్నేస్తాడు. కనకయ్య ఇంట్లో మరో పనివాడైన నరసింహ (చిరంజీవి) ని బంగారి ప్రేమిస్తూ ఉంటుంది. బంగారం బంగారిని బలాత్కరిస్తాడు. కనకయ్య సీత, దేవుళ్ళని అనుమానిస్తాడు. అగ్రహోద్రుడైన కనకయ్య ఒక నాడు వారిద్దరినీ హత్య చేస్తాడు. కోపోద్రిక్తులైన ఆ గ్రామ ప్రజలు కనకయ్య పై ఎదురు తిరిగి అతడిని మట్టు బెడతారు
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- రావు గోపాలరావు - కనకయ్య
- జయసుధ - సీత, కనకయ్య భార్య
- నూతన్ ప్రసాద్ - మునసబు బుల్లబ్బాయి
- చలం - బంగారం, సీత తమ్ముడు
- చంద్రమోహన్ - దేవుడు
- చిరంజీవి - నరసింహ
- కైకాల సత్యనారాయణ
- రేష్మా రాయ్ - బంగారి
- మాధవి - వెంకటలక్ష్మి, కనకయ్య కూతురు
- రమాప్రభ - చాకలి సుబ్బి
- కోట శ్రీనివాసరావు
- ఆర్. నారాయణమూర్తి
- కోటేశ్వరరావు
- ఎన్.డి.లక్ష్మి
- జిత్ మోహన్ మిత్రా
- మాస్టర్ అలీ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె.వాసు
కధ, మాటలు: చిత్రజల్లు శ్రీనివాసరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
గీత రచయిత: జాలాది రాజారావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, ఎల్ ఆర్ ఈశ్వరి, జి. ఆనంద్, చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ: శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజస్
విడుదల:22:09:1978.
పాటలు
[మార్చు]- బండమీదుంది గుండోడి దెబ్బ (గానం: ఎల్.ఆర్.ఈశ్వరి)
- ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా (గానం: చంద్రశేఖర్, జి.ఆనంద్, ఎస్.పి.శైలజ
- యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. (గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)రచన.జాలాది
- నోమల్లో మామిళ్ళ తోటకాడ (గానం: ఎల్.ఆర్.ఈశ్వరి)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-25. Retrieved 2011-10-14.