శివలెంక కృష్ణప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలెంక కృష్ణప్రసాద్
జననం1956 అక్టోబరు 24
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నిర్మాత, పంపిణీదారుడు
క్రియాశీల సంవత్సరాలు1984 - ప్రస్తుతం
పిల్లలు2
బంధువులుచంద్రమోహన్ (మేనమామ)

శివలెంక కృష్ణప్రసాద్ (జననం 1956 అక్టోబరు 24) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. మూడు దశాబ్దాలకు పైగా సినిమా పంపిణీదారుడు కూడా. సమంత ప్రధాన పాత్రధారిగా 2022లో యశోద చిత్రం నిర్మించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రూపోందించారు.[1]

విద్యాభ్యాసం[మార్చు]

శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు ప్రసిద్ధ నటుడు చంద్రమోహన్ మేనల్లుడు. అతను ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.

కెరీర్[మార్చు]

ఆయన కన్నడ సినిమా జిడ్డిని రాకాసి నాగు (1984)గా తెలుగులోకి డబ్బింగ్ చేసి తన వృత్తిని ప్రారంభించాడు. శ్రీదేవి మూవీస్, వైష్ణవి సినిమా, శ్రీదేవి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి సంస్థలు స్థాపించి మరెన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో జీవితకాల సభ్యుడు. 2006 నుండి ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(SIFCC), తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో కూడా సభ్యుడు కావడం విశేషం.

సీరియల్ నిర్మాతగా[మార్చు]

2012లో శ్రీదేవి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌లో ఈటీవీ నెట్‌వర్క్ అయిన ఈటీవీ ఛానెల్ తెలుగులో ముత్యమంత పసుపు అనే టీవీ సీరియల్‌ని నిర్మించి 250 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేశాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

నిర్మాతగా[మార్చు]

Year Film Actors Director Music Director Notes
1988 చిన్నోడు పెద్దోడు రాజేంద్రప్రసాద్, చంద్ర మోహన్, కుష్బూ రేలంగి నరసింహారావు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1991 ఆదిత్య 369[2] నందమూరి బాలకృష్ణ, మోహిని సింగీతం శ్రీనివాసరావు ఇళయరాజా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నంది అవార్డు

ఉత్తమ కళా దర్శకుడిగా నంది అవార్డు

1996 వంశానికొక్కడు నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, ఆమని శరత్ పోలవరపు కోటి
1998 ఊయల శ్రీకాంత్, రమ్యకృష్ణ, నాజర్, సుహాసిని మణిరత్నం ఎస్వీ కృష్ణా రెడ్డి ఎస్వీ కృష్ణా రెడ్డి
1999 అనగనగా ఒక అమ్మాయి శ్రీకాంత్, సౌందర్య, అబ్బాస్ రమేష్ సారంగన్ మణి శర్మ
2001 భలేవాడివి బాసు నందమూరి బాలకృష్ణ, అంజలా జవేరి, శిల్పా శెట్టి పి. ఎ. అరుణ్ ప్రసాద్ మణి శర్మ
2009 మిత్రుడు[3] నందమూరి బాలకృష్ణ, ప్రియమణి, అర్జన్ బజ్వా, ప్రదీప్ రావత్ మహాదేవ్ మణి శర్మ
2016 జెంటిల్‌మన్[4] నాని, సురభి, నివేదా థామస్ ఇంద్రగంటి మోహన కృష్ణ మణి శర్మ
2018 సమ్మోహనం సుధీర్ బాబు, అదితి రావు హైదరీ ఇంద్రగంటి మోహన కృష్ణ వివేక్ సాగర్
2022 యశోద సమంత రుతు ప్రభు, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్ హరి శంకర్ - హరీష్ నారాయణ్ మణి శర్మ

డబ్బింగ్ సినిమాలు[మార్చు]

1985 ఎదురుదాడి (రక్త తిలక)
1992 అభిమన్యు (అభిమన్యు)
1992 యోద్ధ (యోద్ధ)
1992 అశోకన్ (యోద్ధ)
1992 ధర్మ యోద్ధ (యోద్ధ)
1993 గంధర్వం (గంధర్వం)
1994 ప్రిన్స్ (ప్రిన్స్)
1996 నాన్ ఉంగ వీటు పిళ్లై (వంశానికొక్కడు)
2000 VIP - తెలుగు VIP
2005 మన్మధ (మన్మధన్)

అసోసియేట్ ప్రొడ్యూసర్ గా[మార్చు]

1994 గుణ (తెలుగు వెర్షన్)
1995 శుభ సంకల్పం
1996 హలో బ్రదర్ (తమిళ వెర్షన్)
1997 భామనే సత్యభామనే (అవ్వై షణ్ముఖి తెలుగు వెర్షన్)
2000 తెనాలి
2005 మజ్హై
2018 బ్లఫ్ మాస్టర్ (2018 చిత్రం)
2020 ఎంత మంచివాడవురా

లైన్ ప్రొడ్యూసర్ గా[మార్చు]

2003 ఉన్నై చరనదైందేన్
2006 చెన్నై 600028
2009 కుంగుమ పూవుం కొంజుం పూరవుం

డిస్ట్రిబ్యూటర్‌గా[మార్చు]

  • రాకాసి నాగు
  • తులసీ దళం
  • రక్షకుడు
  • పోలీస్ స్టోరీ : ఫస్ట్ స్ట్రైక్
  • మిస్టర్ నైస్ గై (1997 చిత్రం)
  • హుం యామ్ ఐ?
  • ది యాక్సిడెంటల్ స్పై

మూలాలు[మార్చు]

  1. "Yashoda: ప్రేక్షకుడు కోరుకునేది కథే". web.archive.org. 2022-11-14. Archived from the original on 2022-11-14. Retrieved 2022-11-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Sivalenka Krishna Prasad ( Aditya 369 Movie 25 Years )". maastars.com.
  3. "Sivalenka Krishna Prasad again with Balakrishna". indiaglitz.com.
  4. "A comeback after eight years for Sivalenka Krishna Prasad". deccanchronical.com.