జెంటిల్ మేన్(2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెంటిల్ మేన్
దర్శకత్వంఇంద్రగంటి_మోహన_కృష్ణ
రచనఆర్. డేవిడ్ నాదన్
ఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతశివలెంక కృష్ణప్రసాద్
తారాగణంనానీ
సురభి
నివేదా థామస్
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుగాత్రి మేడియా
(విదేశాలలో)[1]
విడుదల తేదీ
2016 జూన్ 17 (2016-06-17)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్15 కోట్లు[2]
బాక్సాఫీసు32.6 కోట్లు[3]

జెంటిల్ మేన్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, నివేదా థామస్, సురభి లో నటించిన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం జూన్ 17 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కథ[మార్చు]

ఐశ్వర్య, ఒక సంపన్న వ్యాపారవేత్త కుమార్తె, అమెరికా నుండి హైదరాబాద్ కు తిరిగి వెళ్లే విమానం ఎక్కుతుంది. కేథరీన్, ఒక విజువల్ ఎఫెక్ట్స్ డిజైనర్. ఒక నెలరోజుల వర్క్‌షాప్ పూర్తిచేసి లండన్లో అదే విమానం ఎక్కుతుంది. కాలక్షేపానికి వారు వాళ్ళ ప్రేమ కథలు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. కాథరీన్ ఒక సాహస క్లబ్ ను కలిగి ఉన్న గౌతమ్ తో ప్రేమలో ఉన్నానని వివరిస్తుంది, ఐశ్వర్య తన కాబోయే భర్త జయరాం "జై" ముళ్ళపూడి తన తండ్రి సంస్థ జైగౌరి ఫైనాన్స్ నిర్వహించే ఒక అవార్డు గెలుచుకున్న వ్యవస్థాపకుడని చెబుతుంది.

ఐశ్వర్య, కాథరీన్ హైదరాబాద్ చేరుకున్నప్పుడు, వారు జై, ఐశ్వర్య బంధువు వంశీని కలుస్తారు. జై అచ్చం గౌతంలా ఉండటం చూసి కాథరీన్ ఆశ్చర్యానికి గురవుతుంది. పది రోజుల ముందు ప్రమాదంలో గౌతమ్ మరణించాడని అతని తల్లి యశోద ద్వారా తెలుసుకున్న తరువాత, ఆమె తన ఇంటిని దుఃఖంతో వదిలి వెళ్తుంది. ఒక పరిశోధక పాత్రికేయరాలైన నిత్య ఆమెని కలసి గౌతమ్ హత్య చేయబడ్డాడని ఆమెకు అనుమానంగా ఉందని చెబుతుంది. వారు మొదట కేథరీన్ మామయ్య అయిన డేవిడ్ ను అనుమానిస్తారు, కానీ అతను మాదకద్రవ్యాలు అధిక మోతాదులో సేవించి ఆసుపత్రిలో చేరి ఉంటాడు.

కాథరీన్ ఆసుపత్రికి వెళ్తుంది, జై అపస్మారక స్థితిలో ఉన్న డేవిడ్ ను కిడ్నాప్ చేసాడని తెలుసుకుంటుంది. జైగౌరి ఫైనాన్స్ లో జరిగిన అకౌంటింగ్ కుంభకోణం గురించి సమాచారం నిత్య బయటపెట్టింది, జై బాబాయ్ మోహన్ ఆత్మహత్య, గౌతం ప్రమాదం అదే రోజున జరిగిందని తెలుసుకుంటుంది. కాథరీన్, నిత్య జై మీద గూఢచర్యం చేయాలని నిర్ణయించుకుంటారు. ఐశ్వర్య కాథరీన్ కి జై సంస్థలో ఉద్యోగం కోసం సిఫారసు చేస్తుంది, దానికి అతను అయిష్టంగా అంగీకరిస్తాడు. సంస్థలో కేథరీన్ ఉనికి జైకి అసౌకర్యం కలిగిస్తుంది. ఆమె అతనిపై గూఢచర్యం చేస్తుందని తెలుసుకుంటాడు. కానీ అతను మౌనంగా ఉంటాడు. గౌతం హత్యలో జై హస్తముందని పత్రికలకి బహిర్గతం చేస్తానని వంశీ జై ని బెదిరించటం కాథరీన్ వింటుంది. ఆమె తన జట్టు నాయకుడు సుదర్శన్ ని అదుపు చేసుకొని సంస్థ యొక్క భద్రతా ఏర్పాట్ల గురించి తరువాత సమాచారాన్ని పొందుతుంది. జై యొక్క కాబిన్ మాస్టర్ కీని నిత్య కాథరీన్‌కి అందిస్తుంది.

కాథరీన్ డేవిడ్, గౌతం యొక్క విడుదల పత్రాలు, ఐశ్వర్య సంస్థ నుండి 500 కోట్లు బదిలీ నిర్ధారిస్తూ ఒక పత్రం తీసుకుంటుంది. తరువాత ఆమె డేవిడ్ చికిత్స పొందుతున్న ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి అతను చనిపోయి ఉండటం చూస్తుంది. కేథరీన్, నిత్య స్పాట్ కి వెళ్ళగానే జై అనాథ నుండి దూరంగా పారిపోవటం చూస్తారు, వారి అనుమానాలు బలమవుతాయి.

పార్టీలో జైని రెచ్చగొట్టడానికి కేథరీన్ వంశీతో చనువుగా ఉంటుంది. అది చూసి జై బాధపడతాడు. కొంత ధైర్యం కూడగట్టుకొని జై వంశీని చంపి అది ఒక రోడ్డు ప్రమాదంలా సృష్టిస్తాడు. వంశీ అతనిని బెదిరించటానికి వాడుతున్న అన్ని పత్రాలను అతను నాశనం చేస్తాడు. ఆ తరువాత రోజు ఐశ్వర్య జై బట్టలు, చిత్రాన్ని కేథరీన్ అలమరాలో చూసి వారి మధ్య అక్రమ సంబంధం ఉందేమోనని భావించి వారి నిశ్చితార్థాన్ని రద్దు చేస్తుంది. కేథరీన్ జైని ఎదుర్కొని అతను ఒక హంతకుడు, మోసగాడు అని ఒప్పుకోమని చెబుతుంది. ముందు ఎలాగోలా తట్టుకుని తరువాత భావోద్వేగానికి లోనై అతను జై కాదు గౌతమ్‌ అని ఆమెకు చెబుతాడు. వారి తిరిగి కలిసి పోతారు అతను జరిగిన నిజాన్ని చెబుతాడు.

జై విజయాలతో వంశీ అసూయ చెంది అతన్ని హతమార్చడానికి తన పాత స్నేహితుడైన డేవిడ్‌ని కోరతాడు. జైని అతని ప్రత్యర్థి అయిన గౌతమ్‌ అనుకొని అతను ఒప్పుకుంటాడు. ఇంతలో, గౌతమ్ తన క్లబ్ కోసం ప్రాయోజకులు కనుగొనే ప్రయత్నంలో జై యొక్క చిత్రాన్ని చూస్తాడు. అతను జైలాగా మారి మోహన్‌ని కలుస్తాడు. చనిపోయే ముందు మోహన్ వంశీ అతన్ని గుర్రప్పందాలు కట్టడానికి ప్రేరేపించాడని, అందువల్ల అతనికి 500 కోట్లు నష్టం కలిగిందని ఆ డబ్బు ఐశ్వర్య తండ్రి రామ్‌ ప్రకాష్ అతనికి తిరిగి ఇస్తానని చెప్పాడని చెబుతాడు. ఇంతలో డేవిడ్ ఒక గిడ్డంగిలో జైని కత్తితో పొడుస్తాడు. అది రహస్యంగా వంశీ చిత్రీకరిస్తాడు. గౌతమ్‌ అక్కడికి చేరుకొని జై సంస్థని వంశీ, ఇతరుల నుండి కాపాడతానని అతనికి ప్రమాణం చేస్తాడు.

గౌతమ్ తన కారులో జై యొక్క శరీరంతో పాటు తన దుస్తులను, పర్సును ఒక సరస్సులోకి నెట్టివేస్తాడు, ఇది ఒక ప్రమాదంలా అనిపించేలా చేస్తాడు. గౌతమ్‌ తల్లి యశోద కూడా జరిగిన సంఘటనలు అర్థం చేసుకుని అతనికి సహాయపడుతుంది. గౌతమ్ తన కొత్త జీవితం జైగా ప్రారంభిస్తాడు. అయితే, అన్ని కార్యక్రమాలను చిత్రీకరించిన వంశీ, విజువల్స్ను సవరిస్తాడు, గౌతమ్ను డబ్బు కోసం బెదిరిస్తాడు. వంశీతో సమస్య రాకూడదనే కేథరీన్ తన పైన గూఢచర్యం చేస్తున్నా అతను మౌనంగా ఉన్నానని చెబుతాడు. వీరి సంభాషణని ఐశ్వర్య వింటుంది. వారి కుటుంబాలు జై మరణానికి భాదపడతారు. ఒక సంవత్సరం తరువాత జై, ఐశ్వర్య కుటుంబాలు ఒక బహుమతి ప్రధానోత్సవానికి హాజరవుతారు. అందులో ఐశ్వర్యని ఉత్తమ పారిశ్రామిక వేత్తగా ఎన్నుకొంటారు. ఆమె ఆ పురస్కారాన్ని జైకి అంకితమివ్వగా గౌతమ్‌, కేథరీన్ కన్నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు.

తారాగణం[మార్చు]

సంగీతం[మార్చు]

మణి శర్మ నాలుగు పాటలు ఉన్న సౌండ్ట్రాక్, జెంటిల్మాన్ స్కోర్ను స్వరపరిచాడు. పాటల జాబితా[4][5]

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "చలి గాలి చూడు"  సిరివెన్నెల సీతారామశాస్త్రిహరిచరణ్, పద్మలత , మాళవిక(యు.ఎస్.) 04:27
2. "గుస గుస లాడే"  రామజోగయ్య శాస్త్రికార్తీక్, ప్రణవి 03:57
3. "డింటక డింటక"  కృష్ణ కాంత్రాహుల్,ఉమా నేహా 03:44
4. "సాటర్డే నైట్ ఫీవర్"  కృష్ణ కాంత్నరేంద్ర,మనీషా 04:11
5. "గుస గుస లాడే (సంస్కరణ 2)"  రామజోగయ్య శాస్త్రిశ్రీ కృష్ణ, సుజాత మోహన్ 03:58
20:17

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు[మార్చు]

2016 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (నివేతా థామస్)

మూలాలు[మార్చు]

  1. "Gentleman which stars Nani to release in 127 screens in the US". Hindustan Times. Indo-Asian News Service. 13 June 2016. Archived from the original on 22 June 2016. Retrieved 22 June 2016.
  2. Jayadeva, Rentala (15 March 2016). "వేచవి చూద్దాం!" [Awaiting this summer!]. Sakshi (in Telugu). Archived from the original on 16 March 2016. Retrieved 19 June 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. H. Hooli, Shekhar (28 December 2016). "Best of Tollywood 2016: Top 25 highest-grossing Telugu movies of the year". International Business Times India. Archived from the original on 31 December 2016. Retrieved 31 December 2016.
  4. "Gentleman Full Songs Jukebox -- Nani, Surbhi, Nivetha Thamas, Mani Sharmaa". Aditya Music. 22 May 2016 – via YouTube.
  5. Sharma, Mani (22 May 2016). "Gentleman (2016)". Saavn. Archived from the original on 21 June 2016. Retrieved 21 June 2016.

బాహ్య లింకులు[మార్చు]