పి.జి. వింద
పి.జి.వింద | |
---|---|
![]() పి.జి. విందా | |
జననం | 10
సంవత్సరాలు)బిజినపల్లి,మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం[1] | 1976 మే
వృత్తి | ఛాయాగ్రాహకుడు, దర్శకుడు & నిర్మాత |
పదవి | భారతీయ ఛాయాగ్రాహకుడు |
పి.జి.వింద తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. 2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇతను అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు మొదలగు సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసాడు. ఇతను ఛాయగ్రాహకుడిగా పనిచేసిన గ్రహణం సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.
స్వస్థలం[మార్చు]
పి.జి. వింద స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా లోని బిజినపల్లి మండలం.
విద్యాభ్యాసం[మార్చు]
ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. ఎనిమిది నుండి పదవ తరగతి వరకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని బీచుపల్లిలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో చదివాడు. జీవశాస్త్రాలు ప్రధాన విషయాలుగా ఇంటర్మీడియట్ బిజినపల్లి మండలంలోని పాలెంలో చేశాడు. వైద్య విద్య అభ్యసించడానికి ప్రవేశ పరీక్ష రాశాడు. కానీ, సీటు రాకపోవడం చేత కర్నూలు లోని సిల్వర్ జూబ్లి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సినిమాటోగ్రఫీ పూర్తి చేశాడు[2].
చిత్రరంగంలో తొలి అడుగులు[మార్చు]
జె.ఎన్.టి.యూ.లో సినిమాటోగ్రఫీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే ఛాయాగ్రాహకుడు మధు అంబటి వద్ద అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్‌గా అవకాశం వచ్చింది. అతనితో లజ్జ హిందీ సినిమాకు పనిచేశాడు. తన మిత్రుడు అల్తాఫ్ ద్వారా ఇంద్రగంటి మోహన కృష్ణ పరిచయం కావడం వలన తొలిసారి ఛాయాగ్రాహకుడిగా గ్రహణం సినిమాకు పని చేసే అవకాశం వచ్చింది.
దర్శకుడిగా[మార్చు]
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ప్రధాన పాత్రలో లోటస్ పాండ్ చిత్రాన్ని రూపొందించాడు.
ఛాయాగ్రహణం[మార్చు]
Year | Movie | Notes |
---|---|---|
2004 | గ్రహణం (2004 సినిమా) | International Film Festival of India |
2005 | నందనవనం 120కిమీ | |
2006 | అనుమానాస్పదం | |
2008 | అష్టా చమ్మా | |
2008 | వినాయకుడు (సినిమా) | |
2009 | స్నేహ గీతం (2010 సినిమా) | |
2010 | అది నువ్వే (2010) | |
2010 | కీ (సినిమా) | |
2011 | ఇట్స్ మై లవ్ స్టోరీ | |
2010 | ది లోటస్ పాండ్ (2010) | 14th International Children's Film Festival India (ICFFI) |
2013 | D/O వర్మ | |
2013 | అంతకు ముందు ఆ తరువాత | |
2013 | ఆ అయిదుగురు (2013) | |
2014 | రోమియో | |
2014 | నిన్నదల | కన్నడ చలనచిత్రం |
2014 | నాలా దమయంతి (2013) | |
2014 | బందిపోటు | |
2015 | జ్యోతి లక్ష్మి | |
2015 | లోఫర్ |
మూలాలు[మార్చు]
- ↑ http://www.idlebrain.com/celeb/interview/pgvinda.html
- ↑ పోట్టేల దెబ్బకు కెవ్వుకేక, హ్యాపీడేస్,(నిర్వహణ:గొరుసు జగదీశ్వర్‌రెడ్డి),ఆదివారం ఆంధ్రజ్యోతి, తేది:01-07-2012,పుట-6