వినాయకుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినాయకుడు
(2008 తెలుగు సినిమా)
Vinayakudu (2008 film poster).jpg
నిర్మాణం సరితా పాట్ర
చిత్రానువాదం అడవి సాయికిరణ్
తారాగణం కృష్ణుడు,
సోనియా,
సూర్యతేజ,
జ్యోతి,
సామ్రాట్‌,
మరళీకృష్ణ director = అడవి సాయికిరణ్
సంగీతం శామ్ ప్రసన్
నృత్యాలు పి.జి.వింద
గీతరచన వనమాలి
కళ సత్య శ్రీనివాస్
భాష తెలుగు

వినాయకుడు సినిమా 2008, నవంబరు 22 న వడుదలైన తెలుగు సినిమా. హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమయ్యిన సోనియా దీప్తి ఈ చిత్ర కథానాయిక. కృష్ణుడు ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఒక మోడరన్ అమ్మాయి, ఒక లావుపాటి అబ్బాయి ల మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. సమకాలీన అంశాలతో చిత్రాన్ని రూపొందించడం వలన ఈ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ, ఒక సాధారణ ప్రేమ కథకి "వినాయకుడి" పేరు వాడుకున్నందుకు గానూ భజరంగ్ దళ్ ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద నిరసన నిర్వహించారు.

ప్రేం మూవీస్ బ్యానర్ పై సరిత పాత్ర నిర్మించిన ఈ సినిమాకు అడవి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. కృష్ణుడు, సోనియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సామ్‌ ప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]

కథ[మార్చు]

ఊబకాయం ఉన్న వ్యక్తి కార్తీక్ (కృష్ణుడు) యాడ్ డిజైనింగ్ కంపెనీలో చేరాడు. అతని విచిత్రమైన వ్యక్తిత్వం కారణంగా బాలికలు అతన్ని వారి నుండి దూరంగా ఉంచుతారు. అతను ఆ సంస్థలో కల్పనా (సోనియా) అనే అమ్మాయిని ఆసక్తికరంగా చూస్తాడు. ఆమె కూడా మొదట్లో అతన్ని దూరం చేస్తుంది. అతని శారీరక స్వరూపంపై చాలా జోకులు వేస్తుంది. కానీ మృదువైన మనస్వత్వం కల కార్తీక్ తన వైఖరితో అహంకార కల్పన హృదయాన్ని గెలుచుకుంటాడు. చివరగా, అహంభావమైన కల్పన తెలియకుండానే కార్తీక్‌తో ప్రేమలో పడుతుంది. మరోవైపు, సంధ్య (పూనమ్), అల్తాఫ్ (సూర్య తేజ్) ల లవ్ ట్రాక్ విడిగా నడుస్తుంది. షాలిని (అంకిత) కార్తీక్ పాత్రను పెంచడానికి ఉత్ప్రేరకంగా ఉపయోగించే పాత్ర.

మూలాలు[మార్చు]

  1. "Vinayakudu (2008)". Indiancine.ma. Retrieved 2020-09-27.