Jump to content

అదితిరావు హైదరీ

వికీపీడియా నుండి
అదితి రావు హైదరి
2017లో హైదరి
జననం (1986-10-28) 1986 అక్టోబరు 28 (వయసు 38)
హైదరాబాదు
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసత్యదీప్ మిశ్రా (2009–2013)
సిద్ధార్థ్ (2024-)

అదితి రావు హైదరి, ఒక భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాం గవర్నరుగా పనిచేసిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ, హైదరాబాద్కు చెందిన జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది. వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించిన ఆమెకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.

2011లో సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించిన యే సాలీ జిందగీ సినిమాతో ఆమె మరింత ప్రజాదరణ సంపాదించింది. ఈ సినిమాలోని ఆమె నటనకు స్ర్కీన్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఆమె నటించిన రాక్ స్టార్ (2011), మర్డర్ 3 (2013), ఖూబ్ సూరత్ (2014), వాజిర్ (2016), ఫితూర్ (2016) వంటి సినిమాలు విజయవంతయయ్యాయి. ఆమె లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకుంది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

28 అక్టోబర్ న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి ఎహ్‌సాన్ హైదరీ, హైదరాబాదు రాజ్యానికి దివానుగా పనిచేసిన అక్బర్ హైదరీ, అస్సాం గవర్నరుగా పనిచేసిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీల రాజ కుటుంబంలో జన్మించాడు. ఆమె తల్లి విద్యారావు, వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె.[1] అదితి, అక్బర్ హైదరీ మునిమనుమరాలు. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ సోదరుడు ఇక్బాల్ మహమ్మద్ అక్బర్ హైదరీ మనవరాలు. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితికి కజిన్ అవుతుంది.[2] వనపర్తి సంస్థానాధీశుడు రాజా జె.రామేశ్వరరావు, శాంతా రామేశ్వరరావులు అదితికి తాతయ్య, అమ్మమ్మలు అవుతారు. రామేశ్వరరావు ఓరియంట్ బ్లాక్ స్వాన్ అనే ప్రచురణ సంస్థకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది.[3] ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.

వివాహం

[మార్చు]

అదితీరావు 2002లో సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకొని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె నటుడు సిద్ధార్థ్‌ ని 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకుంది.[4][5]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2006 ప్రజాపతి సావిత్రి మలయాళం
2007 శృంగారం మధుర/వర్షిణి తమిళం
2009 ఢిల్లీ 6 రామ హిందీ
2010 ధోబీ ఘాట్ ఆర్ట్ గ్యాలరీకి అతిథి
2011 యే సాలి జిందగీ శాంతి
రాక్‌స్టార్ షీనా
2012 లండన్, పారిస్, న్యూయార్క్ లలితా కృష్ణన్
2013 మర్డర్ 3 రోష్ని
బాస్ అంకిత ఠాకూర్
2014 ఖూబ్సూరత్ కియారా ప్రత్యేక ప్రదర్శన
రామా మాధవ్ ఆమెనే మరాఠీ "లూట్ లియో మోహే శ్యామ్" పాటలో
2015 గుడ్డు రంగీలా బేబీ హిందీ
2016 వజీర్ రుహానా అలీ
ఫితూర్ యువ బేగం హజ్రత్ ప్రత్యేక ప్రదర్శన
ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా వర్షాలీ శుక్లా
2017 కాట్రు వెలియిడై లీలా అబ్రహం తమిళం తెలుగులో చెలియా
భూమి భూమి సచ్దేవ హిందీ
2018 పద్మావత్ మెహ్రునిసా
దాస్ దేవ్ చాందిని
సమ్మోహనం సమీర తెలుగు
చెక్క చివంత వానం పార్వతి తమిళం
అంతరిక్షం రియా తెలుగు
2020 సైకో దాగిని తమిళం
సూఫియుం సుజాతయుమ్ సుజాత మలయాళం [6][7]
వి సాహెబా తెలుగు [8]
2021 ది గర్ల్ ఆన్ ది ట్రైన్ నుస్రత్ జాన్ హిందీ [9]
అజీబ్ దాస్తాన్స్ ప్రియా శర్మ
సర్దార్ కా గ్రాండ్ సన్ యంగ్ స్వాన్మీత్ "సర్దార్" కౌర్ ప్రత్యేక ప్రదర్శన [10]
మహా సముద్రం మహాలక్ష్మి తెలుగు [11]
2022 హే సినామికా మౌన యాజాన్ తమిళం [12][13]
TBA గాంధీ టాక్స్ గాయత్రి నిశ్శబ్దం ఆలస్యమైంది [14]
TBA సింహరాశి మెహక్ ఇంగ్లీష్ చిత్రీకరణ [15]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ భాష మూ
2023 తాజ్: డివైడెడ్ బై బ్లడ్ అనార్కలి జీ5 హిందీ [16]
జూబ్లీ సుమిత్ర కుమారి అమెజాన్ ప్రైమ్ వీడియో [17]
2024–ప్రస్తుతం హీరమండి బిబ్బోజాన్ నెట్‌ఫ్లిక్స్ [16]

వాయిస్ యాక్టర్‌గా

[మార్చు]
సంవత్సరం సినిమా కోసం డబ్బింగ్ భాష గమనికలు మూ
2022 పొన్నియిన్ సెల్వన్: ఐ త్రిష హిందీ కుందవాయి పాత్రకు డబ్బింగ్ చెప్పారు [18]
2023 పొన్నియిన్ సెల్వన్: II

మూడిస్కోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం ఆల్బమ్ పాట సంగీత దర్శకుడు భాష మూ
2021 జైల్ "కాతోడు కథనెన్" (సహ గాయకుడు ధనుష్ ) జివి ప్రకాష్ కుమార్ తమిళం [19]
2024 కోక్ స్టూడియో తమిళం "దయచేసి పూరింజుకో" (సహ-గాయకుడు సీన్ రోల్డాన్ ) సీన్ రోల్డాన్

ప్రశంసలు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం మూ
2010 ఢిల్లీ-6 స్క్రీన్ అవార్డులు ఉత్తమ సమిష్టి తారాగణం నామినేట్ చేయబడింది [20]
2013 యే సాలి జిందగీ ఉత్తమ సహాయ నటి గెలిచింది [21]
జీ సినీ అవార్డులు సహాయ పాత్రలో ఉత్తమ నటుడు - స్త్రీ నామినేట్ చేయబడింది [22]
స్టార్‌డస్ట్ అవార్డులు ఉత్తమ నటి నామినేట్ చేయబడింది [23]
లండన్, పారిస్, న్యూయార్క్ నామినేట్ చేయబడింది [24]
రాక్‌స్టార్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ సహాయ పాత్రలో ఉత్తమ నటి నామినేట్ చేయబడింది [25]
2014 మర్డర్ 3 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు థ్రిల్లర్ చలనచిత్రంలో అత్యంత వినోదాత్మక నటి - స్త్రీ నామినేట్ చేయబడింది
2018 కాట్రు వెలియిడై ఆసియావిజన్ అవార్డులు ఉత్తమ నటి - తమిళం గెలిచింది [26]
ఎడిసన్ అవార్డులు ఫేస్ ఆఫ్ ది ఇయర్ గెలిచింది
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం - తమిళం గెలిచింది [27]
2019 సమ్మోహనం జీ సినీ అవార్డ్స్ తెలుగు ఉత్తమ డెబ్యూ యాక్టర్ - ఫిమేల్ గెలిచింది [28]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తెలుగు నామినేట్ చేయబడింది [29]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - తెలుగు నామినేట్ చేయబడింది [30]
పద్మావత్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ఉత్తమ సహాయ నటి గెలిచింది [31]
2023 జూబ్లీ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి - పాపులర్ (OTT) గెలిచింది [32]

ఇతర గుర్తింపులు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం ఫలితం మూ
2023 విశిష్ట అంతర్జాతీయ అరబ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వినోద పరిశ్రమకు అత్యుత్తమ సహకారం గెలిచింది [33]
2024 బాలీవుడ్ హంగామా మోస్ట్ స్టైలిష్ క్లాసిక్ బ్యూటీ ఆఫ్ ది ఇయర్ గెలిచింది [34]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2023 తాజ్: డివైడెడ్ బై బ్లడ్ అనార్కలి 2 సీజన్లు
జూబ్లీ సుమిత్ర కుమారి
2024 హీరామండి బిబ్బోజాన్

మూలాలు

[మార్చు]
  1. "I can speak good hyderabadi hindi: Aditi Rao Hydari". The Times of India. 21 January 2012. Archived from the original on 10 జూలై 2013. Retrieved 29 March 2012.
  2. Drama Queen Filmfare 2 July 2013
  3. "Delhi girl's Chennai tryst". Chennai, India: The Hindu. 6 August 2005. Archived from the original on 25 February 2009. Retrieved 11 March 2009.
  4. Chitrajyothy (28 March 2024). "ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  5. Sakshi (27 March 2024). "సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్‌". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  6. "Vijay Babu announces post-production of Sufiyum Sujathayum". The Times of India. 14 May 2020. Archived from the original on 11 October 2020. Retrieved 15 May 2020.
  7. "With 'Sufiyum Sujathayum' releasing on Amazon Prime, Malayalam cinema is in for a change of scene". The Hindu. 15 May 2020. Archived from the original on 11 October 2020. Retrieved 3 July 2020.
  8. "Nani starrer V to release on Amazon Prime Video". The Indian Express. 20 August 2020. Archived from the original on 11 October 2020. Retrieved 20 August 2020.
  9. "'The Girl On The Train': Parineeti Chopra shares gripping teaser as film gears up for digital release". The Times of India. 13 January 2021. Archived from the original on 13 January 2021. Retrieved 13 January 2021.
  10. "John Abraham and Aditi Rao Hydari to play Arjun Kapoor's grandparents". The Indian Express. 26 August 2020. Archived from the original on 12 May 2021. Retrieved 10 May 2021.
  11. "Aditi Rao Hydari on board for 'Maha Samudram'". The Hindu. 12 October 2020. Archived from the original on 19 October 2020. Retrieved 25 October 2020.
  12. "Choreographer Brindha turns director, casts Dulquer Salmaan, Kajal Aggarwal and Aditi Rao Hydari". The Hindu. Archived from the original on 11 October 2020. Retrieved 12 March 2020.
  13. "Aditi Rao Hydari, Kajal Aggarwal, Dulquer team up for first time for 'Hey Sinamika'". Deccan Chronicle. Archived from the original on 11 October 2020. Retrieved 12 March 2020.
  14. "Kishor Pandurang Belekar's directorial 'Gandhi Talks' starring Vijay Sethupathi, Arvind Swamy & Aditi Rao Hydari went on floors". The Times of India. 5 May 2022. Archived from the original on 18 April 2023. Retrieved 7 May 2022.
  15. Ramachandran, Naman (23 May 2023). "'Emmerdale' Actor Paige Sandhu, 'Jubilee' Star Aditi Rao Hydari to Lead U.K.-India Co-Production 'Lioness'". Variety. Archived from the original on 23 May 2023. Retrieved 23 May 2023.
  16. 16.0 16.1 "Fardeen Khan cast opposite Aditi Rao Hydari in Sanjay Leela Bhansali's Heera Mandi - Exclusive". The Times of India. 23 July 2022.
  17. "Aditi Rao Hyadri, Aparshakti Khurana to star in Vikramaditya Motwane's series Jubilee". News Nine. 28 April 2022. Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
  18. "Ponniyin Selvan 2: Know who dubbed for Vikram, Trisha, Karthi in Hindi for Mani Ratnam film". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-30.
  19. "Aditi Rao Hydari croons for GV Prakash". 7 December 2018. Archived from the original on 11 October 2020. Retrieved 19 January 2020.
  20. "Nominations for Nokia 16th Annual Star Screen Awards 2009". Bollywood Hungama. 31 December 2009. Retrieved 15 April 2020.
  21. "Winners of 18th Annual Colors Screen Awards 2012". Bollywood Hungama. 16 January 2012. Archived from the original on 26 April 2016. Retrieved 24 April 2016.
  22. "Nominations for Zee Cine Awards 2012". Bollywood Hungama. 19 January 2012. Retrieved 18 July 2020.
  23. "Nominations of Stardust Awards 2012". Bollywood Hungama. 6 February 2012. Retrieved 18 July 2020.
  24. "Stardust Awards 2013: list of winners - NDTV Movies". 27 January 2013.
  25. Bollywood Hungama News Network (25 January 2012). "Nominations for 7th Chevrolet Apsara Film and Television Producers Guild Awards 2012". Bollywood Hungama. Archived from the original on 24 February 2012. Retrieved 30 March 2012.
  26. Pattikonda, Gautham (24 November 2017). "Aditi Rao Hydari to be awarded the Best Actress (Tamil) Award 2017 – Pinkvilla". Pinkvilla. Archived from the original on 11 October 2020. Retrieved 4 February 2018.
  27. "SIIMA Awards 2018 nominations: Vijay's Mersal leads with nine nods, followed by Vikram Vedha". Firstpost. August 16, 2019. Retrieved 2020-09-28.
  28. "Zee Cine Awards Telugu 2018 glitters with the best of Tollywood". Exchange4media.com. Archived from the original on 11 October 2020. Retrieved 17 February 2019.
  29. "Aditi Rao Hydari- Best Telugu Actor in Leading Role Female Nominee". Filmfare. Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.
  30. "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today (in ఇంగ్లీష్). 16 August 2019. Archived from the original on 16 August 2019. Retrieved 28 September 2020.
  31. "IIFA 2019: Ranveer Singh Named Best Actor, Alia Bhatt Wins Best Actress Award". News18. 19 September 2019. Archived from the original on 19 June 2020. Retrieved 18 June 2020.
  32. "ITA Awards 2023: Tejasswi Prakash, Harshad Chopda win big; Hrithik Roshan dances to 'Kaho Naa Pyaar Hai'". The Indian Express. 11 December 2023. Retrieved 14 December 2023.
  33. "Aditi Rao Hydari and Jacqueliene Fernandez honored at DIAFA 2023, clicks with Turkish star Burak Deniz". Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 November 2023.
  34. "Complete list of winners of Bollywood Hungama Style Icon Awards". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 29 April 2024.