విద్యారావు
విద్యారావు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | గాయని |
పిల్లలు | అదితిరావు హైదరీ |
వెబ్‌సైటు | www.vidyaraosinger.com |
విద్యారావు, తెలంగాణకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయని, రచయిత్రి. తుమ్రి, దాద్రా శైలీలలో ప్రసిద్ధి పొందింది.[1] దివంగత నైనా దేవి గురించి హార్ట్ టు హార్ట్: రిమెంబరింగ్ నైనాజీ అనే పుస్తకాన్ని రాసింది. విద్యారావు కుమార్తె అదితిరావు హైదరీ సినిమా నటి.
తొలి జీవితం
[మార్చు]విద్యారావు, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగారు. ఆమె మద్రాసు నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, తరువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సోషియాలజీలో ఏంఏ చదివింది.[2]
వృత్తిరంగం
[మార్చు]సంగీతరంగంలోకి రావడానికిముందు సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్‌తో కలిసి ఐదు సంవత్సరాలు పరిశోధకురాలిగా పనిచేసింది.[3] అమీర్ ఖుస్రో, కబీర్ మొదలైన ఆధ్యాత్మికవేత్తల కవిత్వాన్ని అందించింది.[4] మణిరత్నం దర్శకత్వం వహించిన రావణన్ (2010) సినిమాలో ఐశ్వర్య రాయ్ తల్లిపాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది. అయితే, ఆమె నటించిన సన్నివేశాలు సినిమా నుండి కత్తిరించబడ్డాయి.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]విద్యారావుకు ఎహసాన్ హైదరీతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, అదితిరావు హైదరీ బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ Kuldeep Kumar. "On a delicate note". The Hindu. Retrieved 8 January 2022.[permanent dead link]
- ↑ Kumar, Kuldeep (8 December 2011). "Glimpses of Naina". The Hindu. Retrieved 8 January 2022.
- ↑ Kumar, Kuldeep (8 December 2011). "Glimpses of Naina". The Hindu. Retrieved 8 January 2022.
- ↑ Jyoti Nair Belliappa. "Cascade of thumris". The Hindu.
- ↑ "Aditi Rao shines as Delhi 6 sinks - Bollywood Movies - Zimbio". 4 November 2009. Archived from the original on 4 November 2009.