అర్జన్ బజ్వా
అర్జన్ బజ్వా | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1998–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
అర్జన్ బజ్వా (జననం: 1979 సెప్టెంబరు 3) ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా బాలీవుడ్,, తెలుగు సినిమాల్లో నటించాడు. సంపంగి, అరుంధతి, భద్ర ఇతను నటించిన కొన్ని తెలుగు సినిమాలు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అర్జన్ బజ్వా ఢిల్లీలో జన్మించాడు. తండ్రి స్విందర్ సింగ్ బజ్వా బిజెపి పార్టీ తరపున ఢిల్లీకి ఉప మేయరుగా పనిచేశాడు.[1] అర్జన్ ఢిల్లీలో ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేశాడు. తైక్వాండో లో బ్లాక్ బెల్టు సాధించాడు.[1][2]
సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు అర్జన్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఏర్పాటు చేసిన అనేక ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నాడు.[3] లక్స్, వీట్, ఫియట్ పేలియో, గోద్రెజ్ ఏసీ లాంటి ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖ నటీమణులైన ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, ప్రీతి జింటా లాంటి వారి సరసన కనిపించడంతో ప్రముఖ మోడల్ గా పేరు సంపాదించాడు.
కెరీర్
[మార్చు]అర్జన్ మొదటగా తెలుగు సినిమాల్లో నటించాడు. సంపంగి, నీ తోడు కావాలి, ప్రేమలో పావని కల్యాణ్, భద్ర లాంటి 8 సినిమాల్లో హీరోగా నటిస్తే అందులో 5 సినిమాలు విజయవంతం అయ్యాయి. తరువాత మణిరత్నం దర్శకత్వంలో ధీరూబాయ్ అంబానీ జీవితం స్ఫూర్తిగా వచ్చిన గురు సినిమాలో ప్రతినాయక పాత్రతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా సరసన హీరోగా నటించాడు. ఈ సినిమాలో నటనకు గాను అతని స్టార్ డస్ట్ పురస్కారం లభించింది. కింగ్ సినిమాలో నాగార్జున, త్రిష పక్కన, అరుంధతి సినిమాలో అనుష్క సరసన నటించాడు. అజయ్ దేవగణ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాలో సోనాక్షి సిన్హా సరసన నటించాడు.
నటనలోనే కాకుండా 2007లో జరిగిన దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2010,, 2014లో గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. జలంధర్లో ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో కూడా వ్యాఖ్యానం చేశాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2001 | సంపంగి | అభిషేక్ | తెలుగు | |
2002 | నీతోడు కావాలి | వాసు | తెలుగు | |
కనులు మూసినా నీవాయె | సాగర్ | తెలుగు | ||
2003 | ప్రేమలో పావని కళ్యాణ్ | కల్యాణ్ | తెలుగు | |
వో తేరా నాం థా | అఖ్తర్ | హిందీ | ||
2005 | భద్ర | రాజా | తెలుగు | [4] |
2007 | గురు | అర్జాన్ కాంట్రాక్టర్ | హిందీ | [5] |
సమ్మర్ 2007 | ఖతీల్ | హిందీ | ||
2008 | ఫ్యాషన్ | మానవ్ భాసిన్ | హిందీ | |
అరుంధతి | రాహుల్ | తెలుగు | ||
కింగ్ | అజయ్ | తెలుగు | ||
2009 | మిత్రుడు | మధు | తెలుహు | |
2010 | హైడ అండ్ సీక్ | జైదీప్ మహాజన్ | Hindi | |
క్రూక్ | సమర్థ్ | హిందీ | ||
2011 | టెల్ మి ఓ ఖుడా | జే | హిందీ | |
లంక | చోటే | హిందీ | ||
2012 | సన్ ఆఫ్ సర్దార్ | బాబీ | హిందీ | |
2013 | అంగుళిక | తెలుగు | ||
రంభ ఊర్వశి మేనక | తమిళం తెలుగు |
|||
హిమ్మత్ సింగ్[6] | పంజాబీ | |||
2014 | బాబీ జసూస్ | లాలా/ఆలీ | హిందీ | |
2016 | రుస్తుం | విక్రమ్ మఖీజా | హిందీ | |
2017 | చిత్రాంగద | తెలుగు | [7] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 గరిమ, శర్మ. "Arjan Bajwa: A father is the hero in every man's life". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 13 November 2016.
- ↑ Soumitra Das, (2 Jan 2012). "Ajay Devgan's a big prankster: Arjan Bajwa". Times of India.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link) - ↑ "Arjan Bajwa walks the ramp". Mid Day. 22 Aug 2011.
- ↑ "Ravi Teja Movies List". Chitramala (in Indian English). 2016-06-03. Retrieved 2016-10-14.
- ↑ "Rustom actor Arjan Bajwa says Bollywood is biased - watch EXCLUSIVE interview" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-10-14.
- ↑ Punjab, Cine. "Arjan Bajwa in Baljit Singh Deo's Next - Cine Punjab". cinepunjab.com. Archived from the original on 2016-08-25. Retrieved 2016-11-13.
- ↑ 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)