కత్రినా కైఫ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కoత్రి
Katrina-Kaif.jpg
జన్మ నామం కత్రినా టర్కోట్
జననం (1984-07-16) 16 జూలై 1984 (వయస్సు: 32  సంవత్సరాలు)
హాంగ్‌కాంగ్
క్రియాశీలక సంవత్సరాలు 2002 – ప్రస్తుతం

కత్రినా కైఫ్ (హిందీ: कत्रिना कैफ़) ( కత్రినా టర్కోట్ [1] 16 జూలై 1984లో జన్మించిన) హాంగ్ కాంగ్ లో జన్మించిన ఒక బ్రిటిష్-భారతీయ నటి మరియు మోడల్ , ఈమె భారతదేశంలో హిందీ, తెలుగు మరియు మలయాళం చిత్రాలలో నటించారు. 2007 నుండి ఆమె వ్యాపారపరంగా విజయవంతమైన అనేక చిత్రాలలో నటించారు, ఇది ఆమెను ప్రస్తుతం బాలీవుడ్ లో విజయవంతమైన నటీమణులలో ఒకరిగా నిల్పింది.

ప్రారంభ జీవితం[మార్చు]

కత్రినా, హాంగ్ కాంగ్[2] లో కష్మీరి ముస్లిం తండ్రి, మహమ్మద్ కైఫ్, మరియు బ్రిటిష్ క్రైస్తవ తల్లి , సుజేన్ టర్కోట్‌కు జన్మించారు. ఆమె తల్లి హార్వర్డ్ నుండి పట్టాపొంది, న్యాయవాదిగా పనిచేసారు కానీ ఆ తరువాత సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కైఫ్ చిన్నతనంలోనే ఆమె తల్లితండ్రులు విడిపోయారు. కైఫ్ కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. ఆమె మొదట హవాయిలో పెరిగింది. ఆ తరువాత తన తల్లి యొక్క మాతృదేశమైన ఇంగ్లాండుకు నివాసం మార్చారు.

వృత్తి[మార్చు]

పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె వద్దకు ఒక ఏజెంట్ మోడలింగ్ చెయ్యమని అడగటం కొరకు వచ్చారు; ఆమె లభించిన మొదటి పని ఒక నగల ప్రచారం. ఆమె మోడల్స్ 1 ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొని లండన్లో మోడలింగ్ కొనసాగించారు. అక్కడ పనిచేసిన కాలంలో లా సేన్జా మరియు అర్కాడియస్ వంటి సంస్థలకు ప్రచారం చేసారు మరియు లండన్ ఫ్యాషన్ వీక్‌లో కూడా పాల్గొన్నారు.[2]

కైఫ్ లండన్లో మోడలింగ్ చేస్తుండగా బాలీవుడ్ నిర్మాత కైజాద్ గుస్తాద్ దృష్టికి వచ్చింది. ఆయన తన చిత్రం బూమ్ (2003)లో ఒక పాత్ర ఇచ్చారు. ఈ విధంగా ముంబైకి వచ్చిన కత్రినాకు అనేక మోడలింగ్ కార్యక్రమాలు అందించబడ్డాయి. అయితే, ఆమె హిందీ మాట్లాడలేక పోవడం వలన ప్రారంభంలో నిర్మాతలు ఆమెకు అవకాశం ఇవ్వడానికి వెనుకాడారు.[3]

కైఫ్ 2005లో విడుదలైన సర్కార్ తో విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆమె ఒక చిన్నపాత్రలో అభిషేక్ బచ్చన్ ప్రియురాలిగా నటించారు. ఆమె తరువాత చిత్రం, మైనే ప్యార్ క్యోం కియా (2005) లో సల్మాన్ ఖాన్ సరసన నటించారు, ఇది ఆమెకు స్టార్ డస్ట్ బ్రేక్ త్రూ పెర్ఫార్మన్స్ అవార్డు సంపాదించి పెట్టింది.

2007 లో కత్రినా విజయవంతమైన చిత్రం నమస్తే లండన్ లో నటించారు, ఇందులో ఆమె అక్షయ్ కుమార్ సరసన బ్రిటిష్ సంతతికి చెందిన భారతీయ యువతిగా నటించారు ఇది బాక్స్ ఆఫీసులో దెబ్బతిన్న హమ్‌కో దీవానా కర్ గయే (2006) తరువాత వారి రెండవ చిత్రం. అప్పటినుండి ఆమె వరుసగా బాక్స్ ఆఫీసులో విజయవంతమైన అప్నే , పార్ట్నర్ మరియు వెల్ కమ్ వంటి సినిమాలలో నటించారు.[4]

2008లో ఆమె మొదటిసారి ప్రతినాయకి పాత్రను అబ్బాస్-మస్తాన్ చిత్రం రేస్ లో పోషించారు. దీనిలో ఆమె సైఫ్ అలీ ఖాన్ సెక్రటరీ పాత్రను పోషించారు, అతని శత్రువైన సవతి సోదరుని ఆమె రహస్యంగా ప్రేమిస్తూ ఉంటుంది ఈ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. తరువాత ఆమె అక్షయ్ కుమార్ సరసన నాల్గవసారి అనీస్ బాజ్మీ యొక్క బాక్స్ ఆఫీసు వద్ద అత్యధిక విజయాన్ని సాధించిన సింగ్ ఈజ్ కింగ్ లో నటించారు. ఆ సంవత్సరంలో కైఫ్ ఆఖరిచిత్రం సుభాష్ ఘాయ్ యొక్క యువ్ రాజ్ విమర్శనాత్మకంగా మరియు అంచనాలకు భిన్నంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వాణిజ్య పరంగా అపజయాన్ని పొందింది.[5]

2009లో కైఫ్ మొదటి చిత్రం న్యూ యార్క్ , జాన్ అబ్రహాంతో నటించిన ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది.[6] కైఫ్ నటనని విమర్శకుడు తరణ్ ఆదర్శ్ కొనియాడుతూ, "కత్రినా మీకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తారు అని చెప్పారు. ఆకర్షక పాత్రలకు పేరుపొందిన ఆమె, దర్శకుడు మరియు రచయితలు పట్టున్న పాత్రలు ఇస్తే తాను చేయగలనని నిరూపించుకున్నారు. ఆమె ఒక అద్భుతం. నిజానికి, ప్రజలు ఈసారి ఒక కొత్త, విభిన్నమైన కత్రినాను చూస్తారు."[7]

మీడియాలో[మార్చు]

2008లో కైఫ్ ఆసియా యొక్క సెక్సీయెస్ట్ వుమన్ గా ఎన్నుకోబడ్డారు మరియు గూగుల్లో ఎక్కువ వెదకబడిన ప్రజాదరణ పొందిన వ్యక్తి ఆమే.[8] న్యూ యార్క్ చిత్ర ప్రోత్సాహానికి ఆమె నీల్ నితిన్ ముఖేష్ తో రియాల్టీ షో 10 కా దమ్లో పాల్గొన్నారు.[9] కైఫ్ సంగీత ప్రతిభా ప్రదర్శన స రే గ మా పా లో సల్మాన్ ఖాన్ తో తన చిత్రం యువ్ రాజ్ ప్రోత్సహించడానికి పాల్గొన్నారు.[10] సెప్టెంబర్ 2009 లో విడుదల కానున్న మాటల్ యొక్క బాలివుడ్ బార్బీకి కైఫ్ మోడల్‌గా పనిచేశారు.[11]

పురస్కారాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

Year Film Role Notes
2003 బూమ్ రీనా కైఫ్/పోప్ది చించ్పోక్లి
2004 మల్లీశ్వరి యువరాణీ మల్లీశ్వరి తెలుగు చలన చిత్రం
2005 సర్కార్ పూజ
మైనే ప్యార్ క్యోం కియా సోనియా
అల్లరి పిడుగు శ్వేత తెలుగు చలన చిత్రం
2006 హమ్ కో దీవానా కర్ గయే జియా ఎ.యశ్‌వర్ధన్
బలరామ్ vs. తారాదాస్ సుప్రియ మలయాళం చలన చిత్రం
2007 నమస్తే లండన్ జస్మీత్ మల్హోత్రా (జాజ్)
అప్నే నందిని
పార్ట్నర్ ప్రియా జైసింగ్
వెల్కమ్ సంజనా శెట్టి
2008 రేస్ సోఫియా మొదటి ప్రతినాయకి పాత్ర
సింగ్ ఈజ్ కింగ్ సోనియా
హలో కథకురాలు/దేవత ప్రత్యేక పాత్ర
యువ్‌రాజ్ అనుష్కా బంటన్
2009 న్యూ యార్క్ మాయ
బ్లూ నిక్కీ అక్టోబర్ 16, 2009న విడుదల
అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ జెన్నిఫర్ (జెన్నీ) నవంబర్ 06, 2009న విడుదల
దే దనా దన్ నవంబర్ 27, 2009న విడుదల
2010 రాజనీతి చిత్రీకరణ

మూలాలు[మార్చు]

 1. "Actors who changed their names". Hindustan Times. Retrieved 2009-09-05. 
 2. 2.0 2.1 Pathiyan, Priya. "'I'm not involved with Salman Khan'". Times of India. Retrieved 2003-03-16. 
 3. Krishna, Kaavya. "Katrina Kaif Profile - Sify.com". Sify. Retrieved 07-07-09.  Check date values in: |accessdate= (help)
 4. "Box Office 2007". BoxOffice India.com. Archived from the original on 2012-07-30. 
 5. "Box Office 2008". BoxOfficeIndia.com. Archived from the original on 2012-07-22. 
 6. Tuteja, Joginder. ""New York's super-success has surprised me" - Kabir Khan". Bollywood Hungama. Retrieved 2009-07-01. 
 7. Adarsh, Taran. "Bollywood Hungama Review: New York". Bollywood Hungama. Retrieved 2009-06-26. 
 8. Bollywood Hungama News Network. "Katrina voted Sexiest Asian Woman; also most searched person on Google". Bollywood Hungama. Retrieved 2008-12-11. 
 9. Bollywood Hungama News Network. "Katrina Kaif and Neil Nitin Mukesh on 10 Ka Dum". Bollywood Hungama. Retrieved 2009-06-16. 
 10. Bollywood Hungama News Network. "Salman & Katrina burn the dance floor at Sa Re Ga Ma Pa Challenge 2009". Bollywood Hungama. Retrieved 2008-11-06. 
 11. Van Deven, Mandy. "Bollywood Barbie". Bitch Magazine. Retrieved 2009-05-05. 
 12. "Shahid Kapoor, Katrina Kaif among Rajiv Gandhi Awards winners". New Kerala. Retrieved 2009-08-19. 

lkjhgtfrdefghjkl.;/'

బయటి లింకులు[మార్చు]