Jump to content

ఇసాబెల్లె కైఫ్

వికీపీడియా నుండి
ఇసాబెల్లె కైఫ్
2018లో ఇసాబెల్లె కైఫ్
జననం (1986-03-22) 1986 మార్చి 22 (వయసు 38)
విక్టోరియా, హాంకాంగ్, బ్రిటీష్ హాంకాంగ్
(ప్రస్తుతం హాంకాంగ్)
జాతీయతబ్రిటిష్, భారతీయురాలు
పౌరసత్వంయునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా
విద్యాసంస్థఅలియంట్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, శాన్ ఫ్రాన్సిస్కో
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • మహ్మద్ కైఫ్ (తండ్రి)
  • సుసన్నే కైఫ్ (తల్లి)
బంధువులుకత్రినా కైఫ్ (సోదరి)

ఇసాబెల్లె కైఫ్ (జననం 1986 మార్చి 22) బ్రిటీష్ భారతీయ మోడల్, నటి.[1] ఆమె 14 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ చేయడం ప్రారంభించింది.[2] 2013లో, ఆమె అమెరికా-మెక్సికో కో-ప్రొడక్షన్ మామ్‌లో రోసిలీన్ పాత్ర పోషించింది. 2014లో, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మాణంలో, కెనడియన్ దర్శకుడు జీన్-ఫ్రాంకోయిస్ పౌలియోట్ డా. క్యాబ్బీలో ఆమె సిమోన్ పాత్రను పోషించింది.[3][4] ఆమె 2019లో బాల్‌రూమ్ లాటిన్ డ్యాన్సర్ పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1986 మార్చి 22న హాంకాంగ్‌లో కాశ్మీరీ తండ్రి మొహమ్మద్ కైఫ్, బ్రిటీష్ తల్లి సుజానే టర్కోట్‌లకు జన్మించింది. ఆమెకు ఆరుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆమె బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కి సోదరి.[5] ఇసాబెల్లె కైఫ్ 14 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ వృత్తిలో చేపట్టింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నాలుగేళ్ల పాటు నటన, దర్శకత్వం, డ్యాన్స్‌లను అభ్యసించింది. ఆమె అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని అలయంట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది.

మూలాలు

[మార్చు]
  1. "Katrina Kaif’s hot sister Isabella to debut in Salman Khan's film". daily.bhaskar.com.
  2. "Katrina Kaif’s sister steps into acting with Salman Khan’s help". The Indian Express. 25 May 2013.
  3. "Isabel Kaif, Kunal Nayyar groove together!". dna. 20 February 2014
  4. "Dr. Cabbie of Salman Khan marks the debut of Isabelle Kaif!" మూస:ওয়েব আর্কাইভ. Total Filmy. 20 February 2014
  5. "Isabelle Kaif: హాట్ ఫోటో షూట్స్‌తో మతులు పోగొడుతున్న కత్రినా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్.. – News18 తెలుగు". web.archive.org. 2024-05-01. Archived from the original on 2024-05-01. Retrieved 2024-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)