కింగ్ ఫిషర్ క్యాలెండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2006 లో కింగ్ ఫిషర్ క్యాలండర్ గర్ల్ గా దీపికా పడుకోణె

కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కింగ్ ఫిషర్ బికిని క్యాలెండర్ అని కూడా అంటారు. 2003వ సంవత్సరం నుండి భారతదేశానికి సంబంధించిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వారు ఈ క్యాలెండరును ప్రచురిస్తున్నారు. ఈ క్యాలెండర్ లో ఈత దుస్తులు ధరించిన మోడల్స్ ఫోటోలు ఉంటాయి. పిరెల్లి క్యాలెండర్ ప్రేరణతో ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఏర్పడింది. భారతదేశం నిస్సందేహంగా చాలా ప్రతిష్ఠాత్మక మోడలింగ్ నిర్వహిస్తున్నదని రీడిఫ్ వర్ణించింది. మంచి కెరీర్ ఉన్న మోడల్స్, నటీమణులు పాల్గొనడం వలన ఈ క్యాలెండర్ ఘనత కలిసి ఉంది. కత్రినా కైఫ్, దీపికా పడుకొనే, యానా గుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, బృన అబ్దుల్లా, లిసా హేడోన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, నటీమణులు ఈ క్యాలెండర్ ఎంపికలో ఉన్నారు. ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బీకర్ కు ఈ క్యాలెండర్ తో అనుబంధముంది. కాస్బీకర్ విజయ్ మాల్యాలు కలిసి ఘనత వహించిన ఈ వార్షిక కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను సృష్టించారు.