ఛాయాగ్రాహకుడు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఛాయాగ్రాహకుడిని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా ధనం సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు. వార్తాపత్రికలకు వార్తలను చేరవేసే విలేకరులు తమ వృతిలో భాగంగా కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు.ఈరోజుల్లో ఫోటోగ్రాఫర్ కి ఒక ముఖ్య స్థానం ఉంది. పుట్టినరోజు పండుగ కార్యక్రమాలకు, పెళ్ళి వేడుకలకు, వార్షికోత్సవాలకు ఇతని పాత్ర సాధారణమైనది.
ఓర్పు
[మార్చు]ఫోటోగ్రాఫర్ కి చాలా ఓర్పు ఉండాలి. ఒకే చిత్రాన్ని పలుమార్లు తీయవలసి ఉంటుంది. చిత్రం తీయవలసిన సమయం వచ్చే వరకు ఓపికగా కనిపెట్టుకొనవలసి ఉంటుంది.
నేర్పు
[మార్చు]ఫోటో గ్రాఫర్ కి ఓర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.
భారతీయ ఫోటోగ్రాఫర్లు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]చిత్ర మాలిక
[మార్చు]-
2012 IAAF ప్రపంచ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లలో ఫోటోగ్రాఫర్స్ సమూహం
-
ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ఛాయాచిత్రకారులు