Jump to content

తమ్మా శ్రీనివాసరెడ్డి

వికీపీడియా నుండి
తమ్మా శ్రీనివాసరెడ్డి
జననంతమ్మా శ్రీనివాసరెడ్డి
1968 మే 15
తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఇతర పేర్లుటి.ఎస్.రెడ్డి
వృత్తిఫోటో జర్నలిస్టు
Board member ofవ్యవస్థాపక చైర్మన్: ఫోటోగ్రఫీ అకాడెమీ ఆఫ్ ఇండియా
వెబ్‌సైటు
https://tsreddy.in/

తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రపంచ స్థాయి అత్యున్నత గుర్తింపు రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ (లండన్) ఫెలోషిప్ (FRPS) పొందిన భారతీయ ఫొటోగ్రాఫర్.[1]

శ్రీనివాసరెడ్డి 1968 మే 15న గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించాడు.[2] ఇతను ఇండియా టుడేకు ఫొటో జర్నలిస్టుగా పనిచేశాడు.[3] గత 32 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొని 183 బంగారు పతకాలు, 494 అవార్డులు, 890 ప్రశంసా పత్రాలతో పాటు ఈయన తీసిన 5847 ఛాయాచిత్రాలు ఎంపికై వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడ్డాయి.[2] గడచిన 20 సంవత్సరాలుగా ప్రపంచస్థాయిలో తొలి పదిమందిలో ఒకరుగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

కోవిడ్-19 మహమ్మారి బారినపడిన సామాన్యులను రక్షించడానికి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పడిన పాట్లను కళ్ళకు కట్టినట్లుగా శ్రీనివాసరెడ్డి చిత్రీకరించాడు.[1] ఐసియు వార్డుల్లో, వీధులలో, స్మశానవాటికల్లో వివిధ మారుమూల ప్రదేశాల్లో ఆవిష్కృతమైన హృదయ విదారక సన్నివేశాలను, అక్కడ సేవలందిస్తున్న కోవిడ్ వారియర్సను ఆయన తన ఛాయాచిత్రాలలో ప్రపంచం ముందుంచాడు.

ఫోటోగ్రఫీ రంగంలో కృషి

[మార్చు]
  • పుస్తకాలు: ఫోటోగ్రఫీ గురించి అనేక పుస్తకాల ప్రచురణ
  • వ్యవస్థాపక చైర్మన్, జనరల్ సెక్రెటరీ: ఫోటోగ్రఫీ అకాడెమీ ఆఫ్ ఇండియా
  • చైర్మన్: IIPC డిజిటల్ ఫోటోగ్రఫీ, ఫోటోజర్నలిజం డివిజన్
  • వ్యవస్థాపకుడు: ఫోటో ఇండియా స్టూడియో, విజయవాడ

అవార్డులు, సత్కారాలు

[మార్చు]
  • 2002 లో మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ ఫొటో జర్నలిస్ట్ అవార్డ్
  • 2007 లో రామ్ నాథ్ గోయంకా మెమోరియల్ అవార్డు[1]
  • 2012 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫొటోజర్నలిజంలో జీవితసాఫల్య పురస్కారం
  • 2012 లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లలిత కళా అకాడెమి పురస్కారం
  • 2013 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
  • 2015 లో అమెరికాలోని ప్రముఖ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సంస్థ అయిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఒకే ఏడాది 7 అంతర్జాతీయ పురస్కారాలు సాధించినందులకు గాను గ్రాండ్ మాస్టర్ అవార్డు[4]
  • 2016 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హంస/కళారత్న పురస్కారం[1]
  • 2016 లో డా. పిన్నమనేని- సీతాదేవి ఫౌండేషన్ నేషనల్ ఆవార్డ్
  • 2017 లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం లలిత కళా అకాడెమి పురస్కారం
  • 2021 లో ప్రపంచ స్థాయి అత్యున్నత గుర్తింపు రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ (లండన్) ఫెలోషిప్ (FRPS).[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Meet Tamma Srinivasa Reddy, the Indian photographer who has been recognised as the Fellow of The Royal Photographic Society this year". The Hindu (in ఇంగ్లీష్). 18 November 2021.
  2. 2.0 2.1 "Journey of Tamma Srinivasa Reddy". tsreddy.in (in ఇంగ్లీష్).
  3. "Of People and Places - Tamma Srinivasa Reddy". Smart Photography (in ఇంగ్లీష్). 25 October 2014.
  4. "ఐసీఎస్‌ ఫొటోగ్రఫీ ఐకాన్‌గా శ్రీనివాసరెడ్డి". Eenadu. 9 January 2023.