యానా గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యానా గుప్తా
2016లో యానా గుప్తా
జననం
జన సింకోవా

(1979-04-23) 1979 ఏప్రిల్ 23 (వయసు 45)
బ్ర్నో, సౌత్ మొరావియన్ రీజియన్, చెక్ సోషలిస్ట్ రిపబ్లిక్, చెకోస్లోవాక్ సోషలిస్ట్ రిపబ్లిక్ (ఇప్పుడు చెక్ రిపబ్లిక్)
జాతీయతచెక్ (Czech)
వృత్తిమోడల్, నటి, రచయిత
జీవిత భాగస్వామి
సత్యకం గుప్తా
(m. 2001; div. 2005)

యానా గుప్తా (జననం జానా సింకోవా; 1979 ఏప్రిల్ 23) ఆమె భారతదేశంలో నివసిస్తున్న చెక్(Czech) మోడల్, నటి.[1][2]

బాల్యం

[మార్చు]

ఆమె 1979 ఏప్రిల్ 23న బ్ర్నో(Brno), చెక్ రిపబ్లిక్లో జానా సింకోవాగా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆమె ఒంటరి తల్లి పెంపకంలో ఆమె సోదరి వద్ద పెరిగింది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 16 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. పార్క్ ఆర్కిటెక్చర్ అండ్ గార్డెనింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నాక, ఆమె తన మోడలింగ్ వృత్తిని జపాన్‌లో కొనసాగించడానికి వెళ్లింది. ఆ తరువాత అక్కడనుంచి ఆమె భారతదేశం వచ్చి, పూణేలోని రజనీష్ ఆశ్రమంలో కొంతకాలం ఉంది. ఆ సమయంలో ఆమె కళాకారుడు సత్యకం గుప్తాను వివాహం చేసుకుంది, తన ఇంటిపేరును గుప్తాగా మార్చుకుంది.[4]

2001లో, ఆమె భారతీయ మోడలింగ్ పరిశ్రమలోకి ప్రవేశించి, అతిపెద్ద భారతీయ కాస్మెటిక్ బ్రాండ్ లక్మేకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది.[5] 2002లో, ఆమె బాలీవుడ్‌లో దమ్ (2003 )చిత్రంలో "బాబూజీ జర ధీరే చలో" పాటతో అరంగేట్రం చేసింది. దగ్గుబాటి వెంకటేష్ నటించిన ఘర్షణ (2004) సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌తో తెలుగుతెరపై కనిపించింది.[6] 2007లో, శంకర్‌దాదా జిందాబాద్లో చిరంజీవితో కలసి ఆకలేస్తే అన్నం పెడతా.. ఐటమ్ సాంగ్ చేసింది.

2009లో, ఆమె ఆరోగ్యంపై హౌ టు లవ్ యువర్ బాడీ అండ్ గెట్ ది బాడీ యూ లవ్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది.[7] ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది.[8] 2011లో మళ్లీ మర్డర్ 2 సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది.[9]

రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 6 ఫైనల్లో ఆమె ప్రదర్శన ఇచ్చింది.[10] ఆమె ఝలక్ దిఖ్లా జా ఫైనల్‌కు చేరుకుంది కానీ మెయియాంగ్ చాంగ్(Meiyang Chang) చేతిలో ఓడిపోయింది. వివిధ టీవీ షోలలో పాల్గొన్న తర్వాత, ఆమె మళ్లీ హిందీ చిత్రం దసరా (2018)లో జోగనియా ఐటమ్ సాంగ్‌లో మెరిసింది.[11]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2001లో సత్యకం గుప్త అనే కళాకారుడిని వివాహం చేసుకుంది, అయితే వారు 2005లో విడాకులు తీసుకున్నారు.[12]

మూలాలు

[మార్చు]
  1. Administrator, System. "Foreign actors try their hand at Bollywood". Emirates 247 (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 21 March 2016.
  2. "Czech-mate time." The Hindu. Monday 19 January 2004. Retrieved 17 February 2009.
  3. "Moneycontrol.com >> Lic >> Dream House >> You Are Like Mona Lisa, Isn't It?". moneycontrol.com. Retrieved 27 March 2019.
  4. Sharma, Mandvi (3 October 2007). "I'm in love with myself: Yana Gupta". The Times of India. Retrieved 20 May 2020.
  5. Agarwal, Ekta. "Yana Gupta: The 'Bijli' Of Bollywood". focusnews.com. Focus News. Archived from the original on 26 జూన్ 2015. Retrieved 1 July 2015.
  6. "Pic Talk: Bijli Girl Sizzles In Black". Gulte.com. Gulte.com. 10 June 2015. Retrieved 1 July 2015.
  7. "Yana Gupta turns writer, pens book on health". CNN-IBN. 8 December 2011. Archived from the original on 11 January 2012. Retrieved 7 February 2012.
  8. "I'm the panty-less girl: Yana Gupta". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 1 July 2015.
  9. "Yana Gupta Hot Item Song in Murder 2". Vantage Point (in అమెరికన్ ఇంగ్లీష్). 14 November 2013. Retrieved 27 March 2019.
  10. "YANA GUPTA WILL ENTER THE HOUSE IN A CAGE AND WILL LATER PERFORM INSIDE THE HOUSE". movies.ndtv.com. NDTV Convergence Limited. Retrieved 1 July 2015.
  11. "Yana Gupta: I am glad Jhalak Dikhhla Jaa is over". Rediff.com. Retrieved 1 July 2015.
  12. Sharma, Mandvi (3 October 2007). "I'm in love with myself: Yana Gupta". The Times of India. Retrieved 20 May 2020.