Jump to content

ప్రియాంక చోప్రా

వికీపీడియా నుండి
ప్రియాంక చోప్రా

Chopra at the launch of the ఫిల్మ్ ఫేర్ పత్రిక .
జననం (1982-07-18) 1982 జూలై 18 (వయసు 42)
జంషడ్ పూర్, ఝార్ఖండ్, భారత దేశం
క్రియాశీలక సంవత్సరాలు 2001–ప్రస్తుతం

ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[1] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పనిచేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత ప్రసిద్ధికెక్కింది.

తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది. తదుపరి సంవత్సరం, అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారం లభించింది. 2004వ సంవత్సరంలో అబ్బాస్- మస్తాన్‌ల‌ దర్శకత్వంలో వచ్చిన ఐత్రాజ్ (2004) చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకొనేలా ప్రదర్శించిన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం అందుకున్న రెండవ మహిళ అయ్యింది, తరువాత చోప్రా ముజ్సే షాది కరోగి (2004) చిత్రం, ఇప్పటివరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం (2006), డాన్ - ది చేస్ బిగిన్స్ ఎగైన్ (2006) లాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది, ఈ విధంగా మంచి నటిగా స్థిరపడింది.[2]

ప్రాథమిక జీవితం

[మార్చు]

అశోక్ చోప్రా, మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ లో చోప్రా జన్మించింది.[3] చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో, అయొవా లోని సీడర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది.[4] ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు, ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది. ఆమెకు ఆమె కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు.[5]

చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు చోప్రా బరేలిలోని సెయింట్ మరియా గోరెట్టి పాఠశాలలో, లక్నోలోని లా మార్టినీయర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. భారత సైన్యంలో తన తండ్రి వైద్యుడు అయినందున వారు తరచుగా ప్రాంతాలను మారేవారు. పిమ్మట ఆమె యు.ఎస్.కు తరలి వెళ్ళి అక్కడ మస్సాచుసెట్స్ రాష్ట్రం, న్యూటన్ నగరానికి చెందిన న్యూటన్ సౌత్ ఉన్నత పాఠశాలలో, అయోవా లోని సీడర్ రాపిడ్స్ ప్రాంతంలోగల జాన్ ఎఫ్. కెన్నెడీ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించింది. తరువాత ఆమె భారత దేశానికి తిరిగివచ్చి బరేలీలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్య కొనసాగించింది. ముంబైలోని జై హింద్ కళాశాలలో తన కళాశాల విద్య ప్రారంభించింది కానీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకున్న తరువాత విరమించుకుంది.

ప్రపంచ సుందరి

[మార్చు]

మొదటగా భారత ప్రపంచ సుందరిగా ఎన్నిక అయిన చోప్రా తరువాత 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది.[6] అదే సంవత్సరంలో లారా దత్తా, దియా మిర్జా విశ్వ సుందరి, ఆసియా పసిఫిక్ సుందరి కిరీటాలను కైవసం చేసుకున్నారు. ఇది ఒకే దేశానికి అరుదైన త్రిపుట విజయం.

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా, ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

నటనా ప్రవృత్తి

[మార్చు]

ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత చోప్రా నటి అయ్యింది. బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించకముందు 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది, ఈ చిత్రంలో ఆమె ఒక పాటను కూడా పాడారు. 2003వ సంవత్సరంలో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై విడుదలై మంచి సమీక్షలు అందుకుంది.[7] ఆ చిత్రాన్ని తక్కువగా అంచనా వేసినప్పటికీ ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం అయ్యింది.[8]

అక్షయ్ కుమార్ సరసన నటించిన ఆమె తర్వాత చిత్రం అందాజ్ విజయవంతంగా ప్రదర్శింపబడింది,[9] ఈ చిత్రంలో మంచి నటనకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి ప్రతిపాదించబడింది. ఆమె తదుపరి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనాయి.[10]

2004వ సంవత్సరంలో ఆమె చిత్రం ముజ్సే షాది కరోగి చిత్రం విడుదలై ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది.[11] ఆమె తదుపరి హిందీ చిత్రం ఐత్రాజ్, డెమి మూర్ యొక్క డిస్‌క్లోజర్ అనే ఆంగ్ల చిత్ర పునర్నిర్మాణము. అది ఆమెకు మొట్టమొదటి ప్రతినాయిక పాత్ర. ఆమె నటన విమర్శకుల పొగడ్తలను సైతం పొంది ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం తెచ్చిపెట్టింది. ఆమె ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి రెండో స్థానంలో ప్రతిపాదించబడింది. అదే సంవత్సరంలో, ఆమె, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రాణి ముఖర్జీ, ప్రీతి జింటా, అర్జున్ రాంపాల్‌లతో కలిసి టెంప్టేషన్స్ 2004 అనే ప్రపంచ పర్యటనలో పాల్గొంది.

2005వ సంవత్సరంలో ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏవీ సరిగ్గా జనాదరణ పొందలేదు.[12]

2006వ సంవత్సరంలో క్రిష్, డాన్ - ది చేజ్ బిగిన్స్ ఎగైన్‌ లాంటి అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె నాయికగా నటించింది.[13]

నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన బహు తారల చిత్రం సలామ్-ఎ-ఇష్క్ : ఎ ట్రిబ్యూట్ టూ లవ్ 2007వ సంవత్సరంలో చోప్రా మొదటి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[14] చోప్రా మరుసటి చిత్రం బిగ్ బ్రదర్ కూడా విఫలమైంది.

2008వ సంవత్సరంలో ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదలైనాయి. మొదటి నాలుగు చిత్రాలు లవ్ స్టోరీ 2050, గాడ్ తుస్సి గ్రేట్ హో, చమ్కు, ద్రోణ విఫలమైనాయి.[15] అయినప్పటికీ ఆమె తదుపరి చిత్రాలు ఫ్యాషన్, దోస్తానా బాక్సాఫీస్ వద్ద 26,68,00,000, 44,42,00,000 రూపాయాలను వసూళ్లు చేశాయి [15], మునుపటి చిత్రంలో ఆమె ప్రదర్శనకు ఇతర పురస్కారాల నడుమ ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం లభించింది.

2009వ సంవత్సరంలో ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలోని కమీనే చిత్రంలో, అశుతోష్ గోవారికర్ యొక్క వాట్స్ యువర్ రాశీ? చిత్రంలో, జుగల్ హన్స్‌రాజ్ యొక్క ప్యార్ ఇంపాజిబుల్‌లో కన్పించనుంది.[16]

విమర్శలు

[మార్చు]

2008వ సంవత్సరంలో హిందూస్తాన్ యూనీలీవర్ చోప్రాను పాండ్స్‌కు అధికార రాయబారిగా నియమించింది.[17] తరువాత ఆమె సైఫ్ అలీ ఖాన్, నేహా ధూపియాలతో పాటు చర్మ సౌందర్య ఉత్పత్తుల టెలివిజన్ వ్యాపార ప్రకటనలలో కనిపించింది, ఈ ప్రకటనలు జాతి వివక్ష భావనను లేవనెత్తినందుకు విస్తారంగా విమర్శింపబడ్డాయి.[18]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతరాలు
2002 తమిళన్ ప్రియ తమిళ చలన చిత్రం
2003 ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై షాహీన్ జకారియా
అందాజ్ జియా విజేత, ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కార ప్రతిపాదన
2004 ప్లాన్ రాణి
కిస్మత్ సప్న
అసంభవ్ ఆలీషా
ముజ్సే షాదీ కరోగి రాణి సింగ్
ఐత్రాజ్ శ్రీమతి సోనియా రాయ్ విజేత, ఫిలింఫేర్ ఉత్తమ ప్రతి నాయిక పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కార ప్రతిపాదన
2005 బ్లాక్‌మెయిల్ శ్రీమతి రాథోడ్
కరమ్ షాలిని
వక్త్:ది రేస్ ఎగైనెస్ట్ టైం పూజ
యకీన్ సిమర్
బర్సాత్ కాజల్
బ్లఫ్‌మాస్టర్ సిమ్మి అహుజా
2006) టాక్సీ నంబర్ 9211 ప్రత్యేక పాత్ర
36 చైనా టౌన్ షౌన్ మహరాజ్ ప్రత్యేక పాత్ర
అలగ్ సబ్సే అలగ్ పాటలో ప్రత్యేకంగా కనిపించింది
క్ర్రిష్ ప్రియ
ఆప్ కి ఖాతిర్ అను
డాన్ - ది చేజ్ బిగిన్స్ ఎగైన్ రోమా
2007 సలాం -ఇ -ఇష్క్ : అ ట్రిబ్యూట్ టూ లవ్ కామిని
బిగ్ బ్రదర్ ఆర్తీ శర్మ
ఓం శాంతి ఓం ఆమె లాగే దీవాంగీ దీవాంగీ పాటలో ప్రత్యేకంగా కనపడుతుంది
2008 మై నేమ్ ఇజ్ ఆంథోనీ గొంసాల్వెస్ ఆమె లాగే ప్రత్యేక పాత్ర
లవ్ స్టోరీ 2050 సన/జెయిషా ద్విపాత్రాభినయం
గాడ్ తుస్సి గ్రేట్ హో ఆలియా కపూర్
చంకు శుభి
ద్రోణ సోనియా
ఫ్యాషన్ మేఘన మాథుర్ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
దోస్తానా నేహా మేల్వాని
(2009). బిల్లూ ఆమె లాగే యు గెట్ మీ రాకిన్ & రీలింగ్ అనే పాటలో ప్రత్యేకంగా కనపడుతుంది
కమీనే స్వీటీ ఆగస్టు 14వ తేది 2009న విడుదల
వాట్స్ యువర్ రాశీ? విడుదల 2009 సెప్టెంబరు 25
ప్యార్ ఇంపాజిబుల్ ఆలీషా నిర్మాణంలో ఉంది
2010 ఆలీబాబా ఔర్ 41 చోర్ మర్జినా వాయిస్
2011
2012 బర్ఫీ జిల్‌మిల్‌ చటర్జీ ఉత్తమ నటిగా జీ సినీ అవార్డు
2021 ది వైట్ టైగర్‌ పింకీ

వీటిని కూడా చూడండి

[మార్చు]

నమూనాలు

[మార్చు]
  1. liveindia.com ప్రొఫైల్. జనవరి 14, 2006న తిరిగి పొందబడింది
  2. "Powerlist: Top Bollywood Actresses". Priyanka ranks #2 on Rediff's Top Bollywood Actresses. Archived from the original on 1 సెప్టెంబరు 2006. Retrieved 25 August 2006.
  3. Indianuncle.com ప్రొఫైల్. జనవరి 14, 2006న తిరిగి పొందబడింది
  4. priyankachopra.org ప్రొఫైల్ Archived 2011-10-11 at the Wayback Machine. నవంబరు 19, 2008న తిరిగి పొందబడింది
  5. "Priyanka's precious gift for her brother". Siddharth: Priyanka's younger brother. Retrieved 17 March 2007.
  6. "Priyanka Chopra is Miss World 2000". rediff.com. 2000-12-01. Archived from the original on 2006-07-09. Retrieved 2006-08-02.
  7. "Movie Review: The Hero". Priyanka wins good review for her debut performance in The Hero. Retrieved 11 April 2003.
  8. "Box Office 2003". The Hero becomes one of the highest grossing films of 2003. Archived from the original on 20 మే 2004. Retrieved 26 అక్టోబరు 2009.
  9. "Box Office 2003". Andaaz becomes a hit at the bos office. Archived from the original on 20 మే 2004. Retrieved 26 అక్టోబరు 2009.
  10. "Priyanka Chopra Filmography". Priyanka's films fail to do well at the box office. Archived from the original on 16 ఫిబ్రవరి 2007. Retrieved 26 అక్టోబరు 2009.
  11. "Box Office 2004". MSK becomes the third highest grossing film of 2004. Archived from the original on 15 డిసెంబరు 2004. Retrieved 26 అక్టోబరు 2009.
  12. "Priyanka Chopra Filmography". Priyanka's releases in 2005 fail to do well at the box office. Archived from the original on 16 ఫిబ్రవరి 2007. Retrieved 26 అక్టోబరు 2009.
  13. "Box Office 2006". Krrish & Don become one of the most successful films of 2006. Archived from the original on 4 జూలై 2006. Retrieved 26 అక్టోబరు 2009.
  14. "Box Office 2007". Salaam-e-Ishq flops at the box office. Archived from the original on 15 జూన్ 2007. Retrieved 26 అక్టోబరు 2009.
  15. 15.0 15.1 "Box Office 2008". BoxOffice India.com. Archived from the original on 2012-05-25. Retrieved 2009-10-26.
  16. "Pyaar Impossible". Yash Raj Films.
  17. పాండ్స్ యొక్క నూతన ముఖం ప్రియాంక చోప్రా Archived 2010-05-26 at the Wayback Machine, థాండియన్ న్యూస్, మే 6వ తేదీ 2008వ సంవత్సరంలో ప్రచురించబడింది.
  18. చర్మ తెల్లగా చేసుకొనే ధోరణిపై భారత దేశంలో విమర్శలు, డైలీ టెలిగ్రాఫ్, 10వ తేదీ జూలై 2008వ సంవత్సరంలో ప్రచురితమయ్యింది.

బాహ్య లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Awards
ఫిలింఫేర్ పురస్కారాలు
అంతకు ముందువారు
ఇషా డియోల్
కోయీ మేరే దిల్ సే పూఛే
కొరకు
ఉత్తమనటి (ప్రారంభ చిత్రం)
అందాజ్కొరకు
లారా దత్తాతో కలిసి అందాజ్ కొరకు

2004
తరువాత వారు
ఆయేషా టాకియా
for టార్జాన్:ది వండర్ కార్ & దిల్ మాంగే మోర్
అంతకు ముందువారు
ఇర్ఫాన్ ఖాన్
for హాసిల్
ఉత్తమ ప్రతినాయకుడు
for ఐత్రాజ్

2005
తరువాత వారు
నానా పటేకర్
for అపహరణ్
అంతకు ముందువారు
కరీనా కపూర్
for జబ్ వి మెట్
ఉత్తమ నటి
for ఫ్యాషన్

2009
తరువాత వారు
TBD
అంతకు ముందువారు
యుక్తా ముఖీ
మిస్ ఇండియా
2000
తరువాత వారు
సారా కార్నర్
అంతకు ముందువారు
యుక్తా ముఖీ
మిస్ వరల్డ్
2000
తరువాత వారు
అగ్బనీ డరేగో

మూస:FilmfareBestActressAward