ఇర్ఫాన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇర్ఫాన్ ఖాన్
2012 లో ఇర్ఫాన్ ఖాన్
జననం
సహబ్జదే ఇర్ఫాన్ అలీ ఖాన్[1]

(1967-01-07)1967 జనవరి 7 [2]
మరణంఏప్రిల్ 29, 2020 (53 ఏళ్ళు)
మరణ కారణంపెద్దప్రేగు ఇన్ఫెక్షన్, క్యాన్సర్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇర్ఫాన్
విద్యాసంస్థనేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
వృత్తిసినీ నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1988–2020
జీవిత భాగస్వామి
సుతాపా సిక్దర్
(m. 1995)
పిల్లలు2
పురస్కారాలు పద్మశ్రీ పురస్కారం (2011)
పద్మశ్రీపురస్కారం

ఇర్ఫాన్ ఖాన్ (జనవరి 7, 1967 - ఏప్రిల్ 29, 2020) భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. ఇంకా హాలీవుడ్ సినిమాల్లో కాక ఇతర భారతీయ భాషల్లో నటించాడు.[3][4] సినీ విమర్శకులు, సమకాలికులు అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేర్కొంటారు.[5][6] కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం అతనికి 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.[7]

జననం[మార్చు]

ఇర్ఫాన్ ఖాన్ 1967, జనవరి 7న రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించాడు.[8][9]

కుటుంబం[మార్చు]

ఇర్ఫాన్‌కు 1995లో సుతాపా సిక్దార్‌ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.[10]

సినిమారంగం[మార్చు]

సలామ్ బాంబే సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో కూడా నటించాడు. బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించాడు. పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్ చివ‌రిగా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో నటించాడు.[11]

నటించిన సినిమాల పాక్షిక జాబితా[మార్చు]

మరణం[మార్చు]

పెద్దప్రేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ 2020, ఏప్రిల్ 29మహారాష్ట్ర, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. అతనికి క్యాన్సర్ కూడా ఉంది.[12][13]

మూలాలు[మార్చు]

  1. "Irrfan Khan". Irrfan.com. Archived from the original on 2013-12-08.
  2. "Irrfan turns 47". Bollywood Hungama. 13 January 2013.
  3. "Irrfan drops Khan". News.avstv.com. Archived from the original on 2013-09-27. Retrieved 2012-07-21.
  4. Jha, Subhash K (7 March 2012). "Irrfan drops his surname Khan". Mid-day.com. Retrieved 2012-07-21.
  5. Anderson, Ariston (10 December 2014). "'Jurassic World' Actor Irrfan Khan on Upcoming Film: "It Will Be Like a Scary Adventure"". The Hollywood Reporter. Retrieved 28 October 2015.
  6. Iqbal, Nosheen (25 July 2013). "Irrfan Khan: 'I object to the term Bollywood'". the Guardian. Retrieved 28 October 2015.
  7. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
  8. Saran, Sathya (7 March 2020). "'Irrfan Khan The Man, The Dreamer, The Star' review: Kite runner to actor". The Hindu. Retrieved 29 April 2020. We read with some surprise about the boy who preferred to fly kites than go hunting with his father, prompting his father to tell him he was a Brahmin born in the family of Pathans.
  9. Vasdev, Prakriti (29 April 2020). "The Life Journey Of Bollywood's Most Versatile Actor, Irrfan Khan". Daily Addaa. Retrieved 29 April 2020. Born as Sahabzade Irfan Ali Khan on 7 January 1967 in Rajasthan's Tonk, Irrfan belonged to a Muslim Pathan family who retained a tire business.[permanent dead link]
  10. ఈనాడు, సినిమా (29 April 2020). "బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 29 ఏప్రిల్ 2020. Retrieved 29 April 2020.
  11. నమస్తే తెలంగాణ, సినిమా (29 April 2020). "ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూత‌.. బాలీవుడ్ దిగ్భ్రాంతి". ntnews. Archived from the original on 29 ఏప్రిల్ 2020. Retrieved 29 April 2020.
  12. "Irrfan Khan, actor extraordinaire and India's face in the West, dies at 54". Hindustan Times (in ఇంగ్లీష్). 29 April 2020. Retrieved 29 April 2020.
  13. సాక్షి, సినిమా (29 April 2020). "ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత". Sakshi. Archived from the original on 29 ఏప్రిల్ 2020. Retrieved 29 April 2020.