Jump to content

బరేలీ

అక్షాంశ రేఖాంశాలు: 28°21′50″N 79°24′54″E / 28.364°N 79.415°E / 28.364; 79.415
వికీపీడియా నుండి
బరేలీ
మెట్రో
పైనుండి సవ్య దిశలో: అహిచ్ఛ్త్ర అవశేషాలు, బరేలోఈ జంక్షన్ స్టేషను, రామగంగ బ్యారేజీ, బరేలీ నగర దృశ్యం, బియబానీ కోఠీ, దర్గా ఇ అలా హజరత్, ఫ్రీవిల్ బాప్టిస్టు చర్చి
పైనుండి సవ్య దిశలో: అహిచ్ఛ్త్ర అవశేషాలు, బరేలోఈ జంక్షన్ స్టేషను, రామగంగ బ్యారేజీ, బరేలీ నగర దృశ్యం, బియబానీ కోఠీ, దర్గా ఇ అలా హజరత్, ఫ్రీవిల్ బాప్టిస్టు చర్చి
పటం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నగర స్థానం
బరేలీ is located in Uttar Pradesh
బరేలీ
బరేలీ
Coordinates: 28°21′50″N 79°24′54″E / 28.364°N 79.415°E / 28.364; 79.415
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబరేలీ
విస్తీర్ణం
 • Total300 కి.మీ2 (100 చ. మై)
Elevation
268 మీ (879 అ.)
జనాభా
 (2011)[1]
 • Total9,03,668
 • జనసాంద్రత3,000/కి.మీ2 (7,800/చ. మై.)
 • లింగ నిష్పత్తి
895 /1,000
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneIST
PIN codes
243001
243122
Websitebareilly.nic.in

బరేలీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, రోహిల్‌ఖండ్ ప్రాంతం లోని నగరం, బరేలీ జిల్లాకు ముఖ్య పట్టణం. బరేలీ రెవెన్యూ డివిజను ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. నగరం రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 252 కి.మీ. దూరంలో, జాతీయ రాజధాని ఢిల్లీకి తూర్పున 250 కి.మీ. దూరంలో ఉంది.. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని ఎనిమిదవ అతిపెద్ద నగరం, భారతదేశంలో 50 వ అతిపెద్ద నగరం.[3] భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 100 స్మార్ట్ సిటీల జాబితాలో బరేలీ కూడా ఉంది.[4] ఇది రామ్‌గంగ నది ఒడ్డున ఉంది. ఈ నగరం వద్దనే ఈ నదిపై రామ్‌గంగా బ్యారేజీని నిర్మించారు.

బరేలీ ప్రాంతంలో ఉన్న ఏడు శివాలయాలు - ధోపేశ్వర్ నాథ్, మాదీ నాథ్, అలక నాథ్, తాపేశ్వర్ నాథ్, బనఖండి నాథ్, పశుపతి నాథ్, త్రివతి నాథుల దేవాలయాల కారణంగా ఈ నగరాన్ని నాథ్ నగరి అని కూడా పిలుస్తారు [5] బుద్ధుడు తుషిత నుండి భూమికి వచ్చిన ప్రదేశంగా బరేలీని సంజస్య అని కూడా అంటారు.[6]

ఈ నగరం ఫర్నిచర్ తయారీకి కేంద్రం. పత్తి, తృణధాన్యాలు, చక్కెరలకు వ్యాపారానికి కేంద్రం కూడా. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) యొక్క " కౌంటర్ మాగ్నెట్ నగరాల " జాబితాలో చేర్చడంతో దాని స్థితి పెరిగింది. ఈ జాబితాలో హిస్సార్, పాటియాలా, కోటా, గ్వాలియర్ కూడా ఉన్నాయి .[7]

చరిత్ర

[మార్చు]
Multi-coloured political map
అహిచ్చాత్రం ఉత్తర పాంచాల రాజ్యానికి పురాతన రాజధాని. ఈ నగరం అవశేషాలను బరేలీలో కనుగొన్నారు

మహాభారతం ప్రకారం, బరేలీ ప్రాంతం ( పంచల ) ద్రౌపది జన్మస్థలం అని అంటారు. ఆమెను 'పాంచాలి' (పాంచాల రాజ్యానికి చెందిన) అని కూడా పిలుస్తారు. గౌతమ బుద్ధుడు ఒకప్పుడు బరేలీలోని పురాతన కోట నగరమైన అహిచ్చాత్రాన్ని సందర్శించాడని జానపద కథలు చెబుతున్నాయి.[8] జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడు అహిచ్ఛత్రం వద్ద కైవల్యం పొందినట్లు చెబుతారు.[9]

12 వ శతాబ్దంలో, క్షత్రియ రాజ్‌పుత్రు‌ల వివిధ వంశాలు ఈ రాజ్యాన్ని పాలించాయి. మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయే ముందు ఈ ప్రాంతం 325 సంవత్సరాల పాటు ఢిల్లీ సుల్తానేట్‌లో భాగంగా ఉంది.

తరువాత ఇది రోహిల్‌ఖండ్ ప్రాంతానికి రాజధానిగా మారింది. ఆ తరువాత ఈ ప్రాంతం అవధ్ నవాబుకు, ఆ పై బ్రిటిషు వారికీ హస్తగతమైంది.

జగత్ సింగ్ కాతేరియా అనే రాజపుత్రుడు 1537 లో బరేలీ పట్టణాన్ని స్థాపించాడు. తన కుమారులైన బన్సల్‌దేవ్, బరాల్‌దేవ్ ల పేరిట నగరానికి బరేలీ అని పేరుపెట్టాడు [10]

ఈ నగరాన్ని చరిత్రకారుడు బదాయూనీ తన రచనలో ప్రస్తావించాడు. 1568 లో హుస్సేన్ కులీ ఖాన్‌ను "బరేలీ, సంభల్" లకు గవర్నర్‌గా నియమించారు. జిల్లా విభాగాలను, ఆదాయాన్ని "తోడర్ మల్ నిర్ణయించాడు" అని 1596 లో అబుల్ ఫజల్ రాసాడు. ఆధునిక నగరమైన బరేలీకి 1657 లో మొఘల్ ప్రతినిధి మక్రంద్ రాయ్ పునాది వేశాడు. 1658 లో, బరేలీ బదౌన్ ప్రావిన్సుకు ముఖ్య పట్టణంగా మారింది.[11]

తిరుగుబాటు చేసిన కాటేరియా రాజపుత్రు‌లను నియంత్రించడానికి మొగలులు తమకు విశ్వాసపాత్రులైన ఆఫ్ఘన్లను (పఠాన్లు) బరేలీ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకునేందుకు ప్రోత్సహించారు. ఔరంగజేబు మరణం తరువాత, ఆఫ్ఘన్లు గ్రామాల్లో స్థిరపడటం ప్రారంభించి, స్థానిక ముస్లింలతో కలిసిపోయారు . ఇలా కలిసిపోయిన ఆఫ్ఘన్ల వారసులనే పఠాన్లని అంటారు

Multi-coloured political map
రోహిల్‌ఖండ్ (రాజధాని బరేలీ) తో సహా ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలు

మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, అరాచకం ఏర్పడింది. చాలామంది పఠాన్లు, రోహిల్‌ఖండ్ ప్రాంతం (బరేలీ ఈ ప్రాంతం లోని భాగమే) నుండి వలస పోయారు. వాణిజ్యం, భద్రత విచ్ఛిన్నం కారణంగా బరేలీలో (ఉత్తర ప్రదేశ్ లోని ఇతర నగరాల మాదిరిగా) ఆర్థిక స్తబ్దత ఏర్పడి, పేదరికం విస్తరించింది. రోహిల్లా ముస్లిం పఠాన్లు సూరినామ్, గయానా దేశాలకు ఒప్పంద కార్మికులుగా వెళ్ళారు.[12][13]

భౌగోళికం

[మార్చు]

బరేలీ ఉత్తర భారతదేశంలో, 28°10′N 78°23′E / 28.167°N 78.383°E / 28.167; 78.383 వద్ద ఉంది. నగరం సమతలంగా ఉండి, చక్కటి నీటి సౌకర్యం కలిగి ఉంది.నగరంలో వాలు దక్షిణం వైపుగా ఉంటుంది.

శీతోష్ణస్థితి

[మార్చు]

బరేలీలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ : సిఎఫ్ఎ ) ఉంటుంది. ఇక్కడ వేడి వేసవి, చల్లని శీతాకాలాలతో ఉంటుంది.[14] సంవత్సర సగటు ఉష్ణోగ్రత 25 °C. జూన్ నెలలో సగటు ఉష్ణోగ్రత 32.8 °C ఉంటుంది. ఇది అత్యంత వేడిగా ఉండే నెల. ఆహ్లాదంగా ఉండే జనవరిలో సగటు ఉష్ణోగ్రత 15 °C.ఉంటుంది. బరేలీ సగటు వార్షిక వర్షపాతం 1038.9 మి.మీ. అత్యధిక సగటు వర్షపాతం ఉండే నెల జూలై (307.3 మి.మీ.). నవంబరులో సగటున 5.1 మి.మీ.తో అతి తక్కువ అవపాతం ఉండే నెల. సంవత్సరంలో సగటున 37.7 రోజుల్లో వర్షం పడుతుంది. ఆగస్టులో అత్యధిక వర్షపాతం 10.3 రోజులతో సంభవిస్తుంది. నవంబరులో సగం రోజే వర్షం పడుతుంది. ఏడాది పొడవునా వర్షం కురిసినప్పటికీ, వేసవి శీతాకాలం కంటే తేమగా ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Bareilly (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.4
(84.9)
34.0
(93.2)
41.6
(106.9)
45.5
(113.9)
46.7
(116.1)
47.3
(117.1)
46.0
(114.8)
40.6
(105.1)
38.7
(101.7)
38.3
(100.9)
36.1
(97.0)
30.0
(86.0)
47.3
(117.1)
సగటు అధిక °C (°F) 20.6
(69.1)
24.7
(76.5)
30.5
(86.9)
37.2
(99.0)
39.1
(102.4)
38.2
(100.8)
34.2
(93.6)
33.3
(91.9)
33.0
(91.4)
32.2
(90.0)
28.1
(82.6)
23.0
(73.4)
31.2
(88.1)
సగటు అల్ప °C (°F) 8.6
(47.5)
11.4
(52.5)
15.7
(60.3)
21.3
(70.3)
25.1
(77.2)
26.7
(80.1)
26.4
(79.5)
26.0
(78.8)
24.5
(76.1)
19.9
(67.8)
14.3
(57.7)
9.9
(49.8)
19.2
(66.5)
అత్యల్ప రికార్డు °C (°F) 0.6
(33.1)
0.0
(32.0)
5.0
(41.0)
11.1
(52.0)
16.1
(61.0)
18.9
(66.0)
17.4
(63.3)
20.9
(69.6)
16.7
(62.1)
8.9
(48.0)
5.1
(41.2)
1.7
(35.1)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 18.7
(0.74)
29.0
(1.14)
13.5
(0.53)
12.0
(0.47)
32.3
(1.27)
119.4
(4.70)
335.9
(13.22)
310.0
(12.20)
214.4
(8.44)
35.0
(1.38)
4.6
(0.18)
12.2
(0.48)
1,137
(44.75)
సగటు వర్షపాతపు రోజులు 1.4 2.1 1.8 1.0 2.3 5.6 11.9 11.9 7.4 1.3 0.4 0.9 48
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 65 52 40 27 33 47 70 75 71 60 62 66 56
Source: India Meteorological Department[15][16]

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
184792,208—    
18531,01,507+10.1%
18651,05,649+4.1%
18721,02,982−2.5%
18811,13,417+10.1%
18911,21,039+6.7%
19011,33,167+10.0%
19111,29,462−2.8%
19211,29,459−0.0%
19311,44,031+11.3%
19411,92,688+33.8%
19512,08,083+8.0%
19612,72,828+31.1%
19713,26,106+19.5%
19814,49,425+37.8%
19915,90,661+31.4%
20017,20,315+22.0%
20119,03,668+25.5%

2011 భారతీయ జనాభా లెక్కల ప్రకారం, బరేలీ జనాభా 9,03,668, అందులో 4,76,927 మంది పురుషులు, 4,26,741 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 895. అరేళ్ళ లోపు పిల్లలు 1,07,323 మంది. బరేలీలో అక్షరాస్యుల సంఖ్య 5,43,515, ఇది జనాభాలో 60.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత 66.5%, స్త్రీల అక్షరాస్యత 55.7%. ఏడేళ్లకు పైబడిన వారిలో అక్షరాస్యత 68.3%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 72.7%, స్త్రీల అక్షరాస్యత రేటు 63.2%. షెడ్యూల్డ్ కులాలజనాభా 71,215, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,771. 2011 లో, బరేలీలో మొత్తం 1,66,222 గృహాలు ఉన్నాయి.[1]

బరేలీలో మతం (2011)[17]
మతం శాతం
హిందూ మతం
  
58.58%
ఇస్లాం
  
38.80%
సిక్కు మతం
  
0.90%
క్రైస్తవం
  
0.78%
ఇతరాలు
  
0.93%

రవాణా

[మార్చు]

రోడ్లు

[మార్చు]

కింది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు నగరం గుండా వెళుతున్నాయి లేదా బరేలీతో అనుసంధానించబడి ఉన్నాయి:

  • జాతీయ రహదారి 30 - బరేలీ జాతీయ రహదారి 30పై ఉంది.
  • జాతీయ రహదారి 530 - మీర్గంజ్, మిలక్ ల ద్వారా బరేలీని రాంపూర్కు కలుపుతుంది.
  • జాతీయ రహదారి 21 - బదాయూన్, ఆగ్రా, భరత్పూర్ మీదుగా జైపూర్కు కలుపుతుంది.
  • జాతీయ రహదారి 730B - బరేలీని బిసాల్‌పూర్‌కు కలుపుతుంది.
  • రాష్ట్ర రహదారి 37 - బహేరి, కిచా, హల్ద్వానీ మీదుగా బరేలీని నైనితల్‌కు కలుపుతుంది.
  • MDR29 W - షాహి, శిష్‌గఢ్ ద్వారా బరేలీని బిలాస్‌పూర్‌కు కలుపుతుంది.

19 వ శతాబ్దం నుండి బరేలీ నుండి ఇతర నగరాలకు రైలు సౌకర్యం ఉంది. నగరంలో ఆరు రైలు మార్గాలు కలుస్తాయి.

నగరంలో ఏడు రైల్వే స్టేషన్లున్నాయి:

  • బరేలీ జంక్షన్ (బ్రాడ్ గేజ్)
  • సిబి గంజ్ స్టేషన్ (బ్రాడ్ గేజ్)
  • బరేలీ కాంట్ (బ్రాడ్ గేజ్)
  • బరేలీ సిటీ స్టేషన్ (బ్రాడ్ గేజ్)
  • ఇజ్జత్‌నగర్ స్టేషన్ (బ్రాడ్ గేజ్)
  • భోజిపురా స్టేషన్ (బ్రాడ్ గేజ్)
  • దోహ్నా రైల్వే స్టేషన్ (బ్రాడ్ గేజ్)

బరేలీ ఉత్తర-దక్షిణాలుగా వెళ్ళే మొరాదాబాద్- లక్నో మార్గంలో ఉంది. ఢిల్లీ నుండి తూర్పుకు (గోరఖ్పూర్, బరౌని, హౌరా, గువహాతి, దిబ్రుగర్లకు) వెళ్ళే మార్గం కూడా బరేలీ గుండా వెళ్తుంది. ఉత్తరాఖండ్ నుండి బదౌన్ ద్వారా ఆగ్రా, మథుర వెళ్ళే రైళ్ళు కూడా నగరం గుండా వెళ్తాయి.

వైమానిక

[మార్చు]

నగరం శివార్లలోని ఇజ్జత్ నగర్ వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి స్థావరం ఉంది. ఇక్కడ పౌర విమాన సేవలకు కూడా సౌకర్యం కల్పించారు.

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Bareilly". Retrieved 11 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 20 December 2018.
  3. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 14 November 2015. Retrieved 21 April 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Jeelani, Mehboob (27 August 2015). "Centre unveils list of 98 smart cities; UP, TN strike it rich". The Hindu. Archived from the original on 26 November 2016. Retrieved 21 April 2017.
  5. "City to have 1.25 quintal silver Shivling | Bareilly News - Times of India". Archived from the original on 24 September 2016. Retrieved 9 May 2016.
  6. Shailvee Sharda (21 November 2012). "Maitreya project: UP's loss is advantage Bihar". The Times of India. Archived from the original on 28 September 2013. Retrieved 6 January 2013.
  7. "Bulandshahr roads lead to Delhi". The Times of India. 7 February 2010. Archived from the original on 28 September 2013. Retrieved 29 June 2013.
  8. "Archived copy". Archived from the original on 14 July 2007. Retrieved 8 November 2010.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  9. "history". Archived from the original on 26 August 2010.
  10. "Action Plan For The Control of Air Pollution in Bareilly City - IIT Delhi" (PDF).
  11. "Introduction". Library.upenn.edu. Archived from the original on 8 June 2011. Retrieved 9 January 2011.
  12. "HISTORY OF MY PEOPLE: The Afghan Muslims of Guyana". Archived from the original on 12 March 2013.
  13. "The Afghan Muslims of Guyana and Suriname". Guyana.org. Archived from the original on 6 December 2010. Retrieved 9 January 2011.
  14. "Bareilly, India Köppen Climate Classification (Weatherbase)". Weatherbase. Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
  15. "Station: Bareilly Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 103–104. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
  16. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M213. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
  17. "Population By Religious Community - 2011". Retrieved 17 February 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=బరేలీ&oldid=4107525" నుండి వెలికితీశారు