ఉన్నావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉన్నావ్
పట్టణం
పట్టణం లోని కాంపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్
పట్టణం లోని కాంపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్
ఉన్నావ్ is located in Uttar Pradesh
ఉన్నావ్
ఉన్నావ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 26°33′N 80°29′E / 26.55°N 80.49°E / 26.55; 80.49Coordinates: 26°33′N 80°29′E / 26.55°N 80.49°E / 26.55; 80.49
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఉన్నావ్
విస్తీర్ణం
 • మొత్తం4,558 km2 (1,760 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
123 మీ (404 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,77,658
 • సాంద్రత39/km2 (100/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
పిన్‌కోడ్
209801
టెలిఫోన్ కోడ్91-515
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుUP-35
జాలస్థలిunnao.nic.in

ఉన్నావ్ ఉత్తర ప్రదేశ్, ఉన్నావ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. కాన్పూర్, లక్నోల మధ్య ఉన్నావ్ ఒక పెద్ద పారిశ్రామిక పట్టణం. పట్టణం శివార్లలో చుట్టూ మూడు పారిశ్రామిక శివారు ప్రాంతాలు ఉన్నాయి. ఈ పట్టణం తోలు, దోమతెరలు, జర్డోజీ, రసాయన పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఉన్నావ్, అనేక చారిత్రక భవనాలు, నిర్మాణాలతో కూడిన చారిత్రక పట్టణం. ఈ ప్రాంతం కాన్పూర్-లక్నో కౌంటర్ మాగ్నెట్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఉన్నావ్‌ను ఒక ప్రధాన పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ట్రాన్స్ గంగా సిటీ అనే కొత్త ఉపగ్రహ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పట్టణం కాన్పూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం లోని మునిసిపాలిటీ. ఈ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇది రెండవ అతిపెద్ద పట్టణం.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

తోలు పరిశ్రమ ఉన్నావ్‌లో అతిపెద్ద పరిశ్రమ. ఉన్నావ్ తోలు వస్తువుల తయారీ సంస్థలకు ప్రసిద్ధి చెందింది. సూపర్ హౌస్ గ్రూప్, మీర్జా టానర్స్, రెహ్మాన్ ఎక్స్‌పోర్ట్స్, జామ్జామ్ టానర్స్, మహావీర్ స్పిన్‌ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్, పరాష్ నాథెక్ గార్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎంటర్ప్రైజెస్ వంటివి ఉన్నావ్‌లోని పెద్ద సంస్థల్లో కొన్ని. బంథర్ లెదర్ టెక్నాలజీ పార్కు, మాగర్వారా ఇండస్ట్రియల్ ఏరియా, యుపిఎస్ఐడిసి అభివృద్ధి చేసిన ఉన్నావ్ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నావ్ లోని ముఖ్యమైన పారిశ్రామిక శివారు ప్రాంతాలు. రగ్గులకు, అద్దకం పరిశ్రమకూ ఉన్నావ్ పట్టణం ప్రసిద్ధి చెందింది. దోమతెరలకు కూడా ఇది ప్రసిద్ధి గాంచింది.

రవాణా[మార్చు]

ఉన్నావ్‌కు రైలుమార్గం ద్వారా ఇతర ప్రదేశాలతో చక్కటి రవాణా సౌకర్యం ఉంది. ఉన్నావ్ రైల్వే స్టేషన్ లక్నో-కాన్పూర్ మార్గంలో ఉంది. రాయ్‌బరేలీ, ప్రయాగ, అలహాబాద్, హర్దోయీ లకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి. ఆగ్రా, అహ్మదాబాద్, బెంగుళూర్, భూపాల్, నాగ్పూర్, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, పాలక్కాడ్, భువనేశ్వర్, చెన్నై, చండీగఢ్, చిత్రకూట్, కొచ్చిన్, ఢిల్లీ, గోరఖ్పూర్, ఎర్నాకులం, హైదరాబాద్, జైపూర్, జమ్ము, ఝాన్సీ, జలంధర్, అమృత్సర్, పానిపట్, గోరఖ్పూర్, గ్వాలియర్, దర్భాంగా, కోటా, ముంబై, నాగ్పూర్, పాట్నా, పూరి, సూరత్, త్రివేండ్రం, వడోదర, ఉజ్జయిని, వారణాసి, వడోదర వంటి అనేక నగరాలకు కూడా ఇక్కడి నుండి వెళ్ళవచ్చు.

కాన్పూర్, లక్నో మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలుమార్గంలోని ఏకైక రైల్వే స్టేషన్ ఉన్నావ్ అవుతుంది. [2]

ప్రధాన జాతీయ రహదారి 25 ఉన్నావ్ గుండా వెళుతుంది. భారతదేశం లోకెల్లా పొడవైన నియంత్రిత ఎక్స్‌ప్రెస్ వే, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ఉన్నావ్ జిల్లా గుండా వెళుతుంది. ఇది ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వే. గంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉన్నావ్ గుండా వెళుతుంది, ఇది జాతీయ రాజధానితో రవాణా సౌకర్యాన్ని పెంపొందిస్తుంది. [3]

శీతోష్ణస్థితి[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Unnao
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28
(82)
32
(90)
40
(104)
44
(111)
46
(115)
48
(118)
41
(106)
38
(100)
38
(100)
36
(97)
32
(90)
28
(82)
48
(118)
సగటు అధిక °C (°F) 18
(64)
24
(75)
29
(84)
35
(95)
40
(104)
41
(106)
35
(95)
34
(93)
32
(90)
30
(86)
25
(77)
20
(68)
33
(91)
సగటు అల్ప °C (°F) 6
(43)
12
(54)
14
(57)
20
(68)
22
(72)
25
(77)
26
(79)
23
(73)
22
(72)
16
(61)
12
(54)
7
(45)
15
(59)
అత్యల్ప రికార్డు °C (°F) −3
(27)
6
(43)
7
(45)
15
(59)
17
(63)
20
(68)
21
(70)
18
(64)
19
(66)
15
(59)
9
(48)
0
(32)
−3
(27)
సగటు అవపాతం mm (inches) 23
(0.9)
16
(0.6)
9
(0.4)
5
(0.2)
6
(0.2)
68
(2.7)
208
(8.2)
286
(11.3)
202
(8.0)
43
(1.7)
7
(0.3)
8
(0.3)
881
(34.7)
Source: [4]

మూలాలు[మార్చు]

  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=158066
  2. Joshi, Sandeep (23 January 2015). "UP govt. planning high-speed metro rail project between Lucknow, Kanpur". The Hindu. Retrieved 19 November 2018.
  3. "Akhilesh Yadav government signs pact for India's longest six lane access controlled expressway". 29 October 2014. Retrieved 26 August 2015.
  4. "Unnao". Retrieved 25 March 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్నావ్&oldid=3121953" నుండి వెలికితీశారు