మహోబా
మహోబా | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°16′48″N 79°52′22″E / 25.28°N 79.872885°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మహోబా |
Elevation | 214 మీ (702 అ.) |
జనాభా (2011) | |
• Total | 95,216 |
భాషలు | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 210 427 |
టెలిఫోన్ కోడ్ | 91-5281 |
మహోబా ఉత్తర ప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాంతం లోని పట్టణం. [2] 9 వ శతాబ్దంలో ప్రతీహార శైలిలో నిర్మించిన గ్రానైట్ సూర్య దేవాలయానికి ఇది ప్రసిద్ధి. గోఖర్ కొండపై ఉన్న రాతిలో చెక్కిన 24 జైన తీర్థంకరుల చిత్రాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. [3] ఇది మహోబా జిల్లా ముఖ్య పట్టణం. మహోబా ఖజురహో, లవకుశనగర్, కుల్‌పహార్, చర్ఖారీ, కాలింజర్, ఓర్చా, ఝాన్సీ వంటి చారిత్రిక పట్టణాలకు దగ్గరలో ఉంది. ఈ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి.
భౌగోళికం
[మార్చు]మహోబా 25°17′N 79°52′E / 25.28°N 79.87°E వద్ద [4] సముద్ర మట్తం నుండి 214 మీటర్ల ఎత్తున ఉంది
జనాభా
[మార్చు]2011 నాటి భారత జనాభా లెక్కల ప్రకారం, మహోబా జనాభా 95,216. మహోబా సగటు అక్షరాస్యత 74.91%. ఇది రాష్ట్ర సగటు 67.68% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 82.03%, మహిళా అక్షరాస్యత 66.88%, జనాభాలో 12.68% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
మహోబాలో మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాల జనాభా 14.93%, షెడ్యూల్ తెగల జనాభా 0.42% ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 75.21% హిందువులు, 23.64% ముస్లింలు. [5]
మూలాలు
[మార్చు]- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 26 నవంబరు 2020.
- ↑ "Mahoba Population Census 2011". Census 2011 - Census of India.
- ↑ UP Tourism, p. 193.
- ↑ Falling Rain Genomics, Inc - Mahoba
- ↑ "Mahoba Population Census 2011". Census 2011 - Census of India.