అక్షాంశ రేఖాంశాలు: 27°26′N 82°11′E / 27.43°N 82.18°E / 27.43; 82.18

బల్‌రాంపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్‌రాంపూర్
పట్టణం
బల్‌రాంపూర్ is located in Uttar Pradesh
బల్‌రాంపూర్
బల్‌రాంపూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°26′N 82°11′E / 27.43°N 82.18°E / 27.43; 82.18
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబల్‌రాంపూర్
Elevation
106 మీ (348 అ.)
జనాభా
 (2011)[1]
 • Total81,054
 • జనసాంద్రత692/కి.మీ2 (1,790/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-47
లింగనిష్పత్తి912/1000/

బల్‌రాంపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రప్తీ నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది బలరాంపూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.[3]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బల్‌రాంపూర్ మొత్తం జనాభా 81,054, అందులో 42,237 మంది పురుషులు, 38,817 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారి జనాభా 10,492. బల్‌రాంపూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 47,964, ఇది జనాభాలో 59.2%. పురుషుల్లో అక్షరాస్యత 63.2% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 54.8%. బల్‌రాంపూర్ లో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 68.0%. వారిలో పురుషుల్లో అక్షరాస్యత 72.3% స్త్రీలలో అక్షరాస్యత 63.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 5,318, షెడ్యూల్డ్ తెగల జనాభా 96. 2011 లో బల్‌రాంపూర్‌లో 12,405 గృహాలు ఉన్నాయి.[1]

భౌగోళికం

[మార్చు]

బలరాంపూర్ 27°26′N 82°11′E / 27.43°N 82.18°E / 27.43; 82.18 వద్ద, సముద్ర మట్టం నుండి105 మీటర్ల ఎత్తున ఉంది.[4]

చారిత్రక ప్రాముఖ్యత

[మార్చు]

బల్‌రాంపూర్ నగరం శ్రావస్తికి సమీపంలో ఉంది, గౌతమ బుద్ధుడు తన అతీంద్రియ శక్తులను ఉపయోగించి అంగుళీమాలునిలో పరివర్తన తెప్పించినది ఇక్కడేనని భావిస్తారు. పరివర్తనకు ముందు అంగుళీమాలుడు పెద్ద బందిపోటు. తాను వధించినవారి చేతివేళ్ళతో ఒక గొలుసు తయారు చేయించి మెడలో వేసుకున్నాడు.[5][6]

మొఘల్ శకంలో ఔధ్ తాలూకాలో బలరాంపూర్ ఒక ఎస్టేటుగా ఉండేది.[7]

రెండు ప్రముఖ బౌద్ధ పురావస్తు ప్రదేశాలైన, జేతవనం, సావతి, బల్‌రాంపూర్ పట్టణానికి సమీపంలో ఉన్నాయి. స్థానికంగా వీటిని సాహేత్, మహేత్, అవి అంటారు. పురాతన (6 వ శతాబ్దం) చైనీస్ యాత్రికుల-సన్యాసుల కథనాలను ఉపయోగించి అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, సాహేత్-మహేత్‌లే ఆనాటి జేతవనం, సావత్తి అని తేల్చాడు.[8]

32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాహెత్లో, జేతవన ఆశ్రమం ఉంది. ఇది అనేక పుణ్యక్షేత్రాలు, స్థూపాలు విహారాలతో ఒక ముఖ్యమైన యాత్రాస్థలంగా మారింది. స్థూపాలు ఎక్కువగా కుషాణు కాలానికి చెందినవి కాగా, దేవాలయాలు గుప్తుల శైలిలో ఉన్నాయి . ఈ అవశేషాలు మౌర్యుల కాలం (క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం) నుండి 12 వ శతాబ్దం వరకు చెందినవి. తొలి స్థూపాలలో ఒకదానిలో, బుద్ధుని అవశేషాలున్నాయి. బుద్ధుని భారీ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. దీన్ని కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరచారు.

మహేత్ సుమారు 400 ఎకరాల్లో, ఒక నగరపు అవశేషాలుగా గుర్తించారు. ఇది సాహేత్‌కు ఈశాన్యంగా అర కిలోమీటరు దూరంలో ఉంది. త్రవ్వకాల్లో నగరపు భారీ ద్వారాలు, ప్రాకారాలు, ఇతర నిర్మాణాల శిథిలాలు కనిపించాయి. ఇవి పురాతన శ్రావస్తి నగరపు సంపదకు నిదర్శనం. ఇక్కడ శోభనాథ ఆలయం ఉంది. మహేత్ శిథిలాలలో రెండు స్థూపాలు ఉన్నాయి. పక్కీ కుటీ అనే ఒక స్థూపం అంగుళీమాలుడి దని, మరొకటి కచ్చీ కుటీ అనేది బుద్ధుని శిష్యుడైన సుదత్తుడిదనీ భావిస్తారు.[9] పక్కీ కుటీ, కచ్చీ కుటీ లను తరువాత హిందూ దేవాలయాలుగా మార్చారు.

అశోక చక్రవర్తి, జేతవనాన్ని సందర్శించాడు. చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ (జువాన్జాంగ్) శ్రావస్తిలో రెండు అశోక స్తంభాలున్నట్లు పేర్కొన్నాడు. గౌతమ బుద్ధుడు నివసించిన స్వర్ణగంధ కుటి మరో ముఖ్యమైన ప్రదేశం. బౌద్ధంలో రెండవ అతి పవిత్రమైన చెట్టు ఆనందబోధి వృక్షం జేతవనంలో ఉంది.[10]

రవాణా సౌకర్యాలు

[మార్చు]
  • రహదారి: రాష్ట్ర రాజధాని లక్నో నుండి 160 కిలోమీటర్ల దూరంలో బల్‌రాంపూర్ ఉంది. లక్నో వెళ్ళే రాష్ట్ర రహదారి 1ఎ నగరం గుండా పోతుంది. కైసర్‌బాగ్ బస్ స్టేషన్ ( లక్నో ) నుండి నగరానికి ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు నడుస్తాయి
  • రైల్వే: బలరాంపూర్ రైల్వే స్టేషన్ (blp) ఈశాన్య రైల్వే పరిధిలోకి వస్తుంది.

ఆర్థికం

[మార్చు]

భారతదేశంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి యూనిట్ అయిన బల్‌రాంపూర్ చీనీ మిల్స్ లిమిటెడ్ వారి చక్కెర కర్మాగారం బల్‌రాంపూర్‌లో ఉంది. బ్రిటీష్ పాలనలో ఇది BIC (బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్) యాజమాన్యంలో ఉండేది. బజాజ్ హిందుస్తాన్ సంస్థకు జిల్లాలోని ఉట్రౌలా వద్ద చక్కెర కర్మాగారం ఉంది.

మీడియా

[మార్చు]

బల్‌రాంపూర్‌లో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషన్ ఉంది, దీనిని ఆకాశవాణి బల్‌రాంపూర్ అని పిలుస్తారు. ఇది FM ప్రసారాలు చేస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Balrampur". censusindia.gov.in. Retrieved 23 November 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. "Rapti river is wreaking havoc in Balrampur » Ampinity News". Ampinity News (in అమెరికన్ ఇంగ్లీష్). 3 August 2020. Retrieved 2 October 2020.[permanent dead link]
  4. "Balrampur, India Page". Global Gazetteer Version 2.2. Falling Rain Genomics, Inc. Retrieved 9 June 2013.
  5. Murthy, K. Krishna (1 January 1987). Glimpses Of Art, Architecture And Buddhist Literature in Ancient India. Abhinav Publications. pp. 121–122. ISBN 978-81-7017-226-0. Retrieved 9 June 2013.
  6. Dhammika, Shravasti (2005). The Buddha and His Disciples. Buddhist Publication Society. pp. 59–63. ISBN 978-955-24-0280-7. Retrieved 9 June 2013.
  7. "BALRAMPUR". members.iinet.net.au. Archived from the original on 4 March 2016. Retrieved 4 October 2015.
  8. Arch. Survey of India, 1907-8, pp.81-131
  9. Rai, Supriya (1 January 2010). Spiritual Master The Buddha. Indus Source. p. 127. ISBN 978-81-88569-05-2. Retrieved 9 June 2013.
  10. Jetavana