షామ్లీ
షామ్లీ | |
---|---|
పట్టణం | |
Coordinates: 29°27′N 77°19′E / 29.45°N 77.32°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | షామ్లీ |
• Rank | 11 |
Elevation | 254 మీ (833 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,07,233 [1] |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 247776 |
టెలిఫోన్ కోడ్ | 1398 |
షామ్లీ ఉత్తరప్రదేశ్ లోని పట్టణం, షామ్లి జిల్లాకు ముఖ్యపట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. ఈ జిల్లా సహారాన్‌పూర్ డివిజన్ పరిధిలోని పరిపాలనా ఉపవిభాగం.
2011 సెప్టెంబరులో షామ్లీ ముఖ్యపట్టణంగా షామ్లీ జిల్లాను ఏర్పాటు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి మాయావతి దీనికి ప్రబోధ్ నగర్ అని పేరు పెట్టింది. 2012 లో ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ 2012 జూలైలో జిల్లా పేరును షామ్లీ జిల్లాగా మార్చాడు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ నగరం జాతియ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) లో భాగం. క్రింది రహదారులు పట్టణం గుండా పోతున్నాయి
- ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ [2] [3]
- ఢిల్లీ - షహరాన్పూర్ ( జాతీయ రహదారి 709B )
- మీరట్ - కర్నాల్ ( జాతీయ రహదారి 709 ఎ )
- పానిపట్ - ఖాతిమా ( జాతీయ రహదారి 709AD )
ఇది ఢిల్లీ నుండి 100 కి.మీ., మీరట్, సహారన్పూర్ ల నుండి 65 కి.మీ., ముజఫర్ నగర్, కర్నాల్, పానిపట్ ల నుండి 40 కి.మీ. దూరంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]షామిలి 29°27′N 77°19′E / 29.45°N 77.32°E వద్ద [4] సముద్ర మట్టం నుండి 254 మీటర్ల ఎత్తున ఉంది .
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం షామ్లీ జనాభా 1,07,233. వీరిలో 57,236 మంది పురుషులు, 49,997 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 82.97 %. షామ్లీ జిల్లాను ఉత్తర ప్రదేశ్‌లోని మొదటి బహురంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. [5]
మూలాలు
[మార్చు]- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF), Provisional Population Totals, Census of India 2011, Office of the Register General and Census Commissioner, India, retrieved 7 July 2012
- ↑ "Central govt plans expressway between Delhi and Dehradun". Hindustan Times. February 25, 2020.
- ↑ "Good News: सहारनपुर में वन्य जीवों को बचाने के लिए बनेगा एलिवेटेड हाईवे, मिली मंजूरी". Dainik Jagran. August 31, 2020.
- ↑ "Shamli". Falling Rain Genomics Inc. Retrieved 15 October 2012.
- ↑ "IAS Posting Detail". Government of Uttar Pradesh. Archived from the original on 2020-08-08. Retrieved 2020-12-02.