Jump to content

రాయ్‌బరేలీ

అక్షాంశ రేఖాంశాలు: 26°22′N 81°24′E / 26.367°N 81.400°E / 26.367; 81.400
వికీపీడియా నుండి
రాయ్‌బరేలీ
పట్టణం
Raebareli
Raebareli
రాయ్‌బరేలీ
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°22′N 81°24′E / 26.367°N 81.400°E / 26.367; 81.400
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజన్లక్నో
జిల్లారాయ్‌బరేలీ
విస్తీర్ణం
 • Total43 కి.మీ2 (17 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,91,056
 • జనసాంద్రత739/కి.మీ2 (1,910/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
229001
టెలిఫోన్ కోడ్0535
Vehicle registrationUP-33
లింగనిష్పత్తి941/1000

రాయ్‌బరేలీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది రాయ్‌బరేలీ జిల్లా ముఖ్య పట్టణం. ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం సాయి నది ఒడ్డున, లక్నోకు ఆగ్నేయంగా 82 కి.మీ. దూరంలో ఉంది.

భౌగోళికం, వాతావరణం

[మార్చు]

రాయ్‌బరేలీలో వెచ్చని ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. డిసెంబరు నుండి ఫిబ్రవరి మధ్య వరకూ ఉండే శీతాకాలం చాలా చల్లగా, పొడిగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య వరకు ఉండే వేసవి పొడిగా, వేడిగా ఉంటుంది. వర్షాకాలం జూన్ మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు ఉంటుంది. సగటున 1200 మి.మీ. వర్షపాతం ఉంటుంది. శీతాకాలంలో, గరిష్ఠ ఉష్ణోగ్రత 12 °C, కనిష్ఠం 3-4 °C ఉంటుంది . పొగమంచు డిసెంబరు చివరి నుండి జనవరి చివరి వరకు ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 40-45 °C వరకు పెరుగుతాయి [2]

రవాణా

[మార్చు]

రోడ్డు

[మార్చు]

రాయ్‌బరేలీ లక్నో - అలహాబాద్ మధ్య జాతీయ రహదారి 30 మార్గంలో ఉంది.

రైలు

[మార్చు]
రాయ్‌బరేలీ జంక్షన్ రైల్వే స్టేషన్

రాయ్‌బరేలీ జంక్షన్, ఉత్తర రైల్వేకు చెందిన వారణాసి-రాయ్‌బరేలీ-లక్నో, రాయ్‌బరేలీ-అలహాబాద్ రైలు మార్గాల్లో ఉంది.ఉత్తర రైల్వే నెట్‌వర్క్‌లో రాయ్‌బరేలీ నుండి ఫైజాబాద్ వరకు అక్బర్గంజ్ మీదుగా రైలు మార్గం నిర్మిస్తున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Raebareli City" (PDF).
  2. "Typography of city". రాయ్‌బరేలీ. Government of Uttar Pradesh. Retrieved 31 March 2015.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Sonia launches radio channel, roads, rail line in Rae Bareli". The Hindu. 2 December 2013. Retrieved 31 January 2015.