ఘాజియాబాద్
ఘాజియాబాద్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
మెట్రో నగరం | ||||||||
Nickname: ఉత్తర ప్రదేశ్ ముఖద్వారం | ||||||||
Coordinates: 28°40′N 77°25′E / 28.67°N 77.42°E | ||||||||
దేశం | భారతదేశం | |||||||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | |||||||
జిల్లా | ఘాజియాబాద్ | |||||||
Founded by | ఘాజీయుద్దీన్ | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 210 కి.మీ2 (80 చ. మై) | |||||||
Elevation | 214 మీ (702 అ.) | |||||||
జనాభా (2011 census provisional data)[1] | ||||||||
• Total | 17,29,000 | |||||||
• జనసాంద్రత | 8,200/కి.మీ2 (21,000/చ. మై.) | |||||||
Demonym | ఘాజియాబాదీ | |||||||
భాషలు | ||||||||
• అధికారిక | హిందీ | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 201 XXX | |||||||
టెలిఫోన్ కోడ్ | 91-120 |
ఘాజియాబాద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎగువ గంగా మైదానంలో ఉన్న నగరం. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. [2] ఇది ఘాజియాబాద్ జిల్లా ముఖ్యపట్టణం, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో అతిపెద్ద నగరం. దీని జనాభా 17,29,000. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషను నిర్వహిస్తుంది. ఘాజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను 5 జోన్‌లుగా విభజించారు - సిటీ జోన్, కవి నగర్ జోన్, విజయ్ నగర్ జోన్, మోహన్ నగర్ జోన్, వసుంధర జోన్. [3] మున్సిపల్ కార్పొరేషనులో 100 వార్డులున్నాయి. రోడ్లు, రైల్వేల ద్వారా నగరానికి చక్కటి రవాణా సౌకర్యం ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రైలు జంక్షన్. [4] [5] దీనిని కొన్నిసార్లు "ఉత్తర ప్రదేశ్ ముఖద్వారం" అని పిలుస్తారు.[6] సిటీ మేయర్స్ ఫౌండేషన్ సర్వేలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండవదిగా నగరాన్ని పేర్కొంది. [7] [8] ఈ నగరాన్ని హిండన్ నది రెండుగా విభజిస్తోంది. అవి పశ్చిమాన ఉన్న ట్రాన్స్-హిండన్, తూర్పున ఉన్న సిస్-హిండన్. [9]
చరిత్ర
[మార్చు]ఘాజియాబాద్ నగరాన్ని సా.శ 1740 లో ఘాజీ-ఉద్-దీన్ స్థాపించాడు. అతను మొగలు చక్రవర్తి ముహమ్మద్ షా ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. అతని పేరు మీద "ఘాజీయుద్దీన్ నగర్" అని దీనికి పేరు పెట్టాడు. [10] 1864 లో రైల్వేలు మొదలైనపుడు అది ప్రస్తుత పేరుకు మారింది. [11] [12] [13] మొగలుల కాలంలో ఘాజియాబాద్, ముఖ్యంగా ఘాజియాబాద్ లోని హిండన్ ఒడ్డు, మొగలు రాజ కుటుంబానికి పిక్నిక్ స్థలంగా ఉండేది. [14]
సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన సైంటిఫిక్ సొసైటీ, ఇక్కడి విద్యా ఉద్యమానికి ఒక మైలురాయిగా పరిగణిస్తారు. [15] ఢిల్లీ, లాహోర్ లను కలిపే సింధ్, పంజాబ్, ఢిల్లీ రైల్వే ఘాజియాబాద్ ద్వారా వెళ్తుంది. దాన్ని కూడా అదే సంవత్సరంలో ప్రారంభించారు. [16] 1870 లో అమృత్సర్ - షహరాన్పూర్ మార్గం పూర్తికావడంతో ఘాజియాబాద్ కూడలిగా మారింది [17]
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం ఘాజియాబాద్ నగర సముదాయంలో జనాభా 23,58,525. అందులో పురుషులు 12,56,783, ఆడవారు 11,01,742. అక్షరాస్యత 93.81%. [18] కాన్పూర్ తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ఇది రెండవ అతిపెద్ద పారిశ్రామిక నగరం. [19]
మతం
[మార్చు]72.93% మందితో హిందూ మతం అత్యంత ప్రాచుర్యం పొందింది. తరువాత 25.35% ముస్లింలు, 0.41% మంది క్రైస్తవులు, 0.49% సిక్కులూ ఉన్నారు. సుమారు 0.07% మంది బౌద్ధులు, 0.35% జైనులు కూడా ఉన్నారు.. ఘాజియాబాద్‌లో హిందువుల కోసం ఇస్కాన్ ఆలయం, ముస్లింలకు జామా మసీదు, క్రైస్తవులకు హోలీ ట్రినిటీ చర్చి, సిక్కులకు శ్రీ గురు సింగ్ సభ గురుద్వారా వంటి అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి.
వాతావరణం
[మార్చు]హిమాలయాలు, కుమావున్ గర్హ్వాల్ కొండలలో కురిసే మంచు, రాజస్థాన్ ఎడారిలో రేగే దుమ్ము తుఫానులు నగర శీతోష్ణస్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. రుతుపవనాలు జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో వస్తాయి. సాధారణంగా అక్టోబరు వరకు వర్షం పడుతుంది.
రవాణా
[మార్చు]రోడ్డు
[మార్చు]జాతీయ రహదారి 24 ఘాజియాబాద్ గుండా పోతుంది.. [20]
రైలు
[మార్చు]ఘాజియాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ద్వారా దేశం లోని పలు ప్రాంతాలకు చక్కటి రైలు సౌఉకర్యం ఉంది.
విమానాలు
[మార్చు]హిండాన్ దేశీయ విమానాశ్రయం ఘాజియాబాద్‌కు సేవలు అందించే విమానాశ్రయం, ఇది 2019 అక్టోబరులో కార్యకలాపాలు ప్రారంభించింది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. [21]
ప్రముఖులు
[మార్చు]- జ్యోతి అరోరా, భారతీయ రచయిత్రి, టెక్ బ్లాగర్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ghaziabad Information". Archived from the original on 2020-11-24. Retrieved 2020-11-25.
- ↑ "National Capital Region- Constituent Areas". NCRPB. Archived from the original on 7 May 2015. Retrieved 1 June 2015.
- ↑ "Zone-division of Ghaziabad Nagar Nigam". Archived from the original on 2020-11-24. Retrieved 2020-11-25.
- ↑ Athique and Hill, Adrian and Douglas (17 December 2009). The Multiplex in India: A Cultural Economy of Urban Leisure (2010 ed.). New York. pp. 110–114. ISBN 9781135181888.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ "District and Sessions Court Ghaziabad- History". NIC. Archived from the original on 4 June 2013. Retrieved 27 July 2013.
- ↑ "Ghaziabad-Gateway of U.P". Ghaziabad.nic.in. Archived from the original on 28 July 2015. Retrieved 29 July 2015.
- ↑ "Business". 17 November 2011. Archived from the original on 20 November 2011.
- ↑ Ghaziabad was first listed in early 2010 as # 420 by size. "The largest cities in the world and their mayors: Cities ranked 301 to 450". City Mayors. Archived from the original on 9 March 2010., current listings: "World's fastest growing urban areas (1)". City Mayors. Archived from the original on 25 November 2010. Retrieved 1 November 2010.
- ↑ "Ghaziabad Nagar Nigam: About Us". Archived from the original on 1 February 2013.
- ↑ Anu Kapur, p. 83-85, Mapping Place Names of India
- ↑ "history1". nagarnigamghaziabad.com. Archived from the original on 2 October 2015. Retrieved 14 September 2015.
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 1". Irfca.org. Archived from the original on 7 March 2005. Retrieved 17 June 2014.
- ↑ "History". ghaziabad.nic.in. District Administration, Ghaziabad. Archived from the original on 8 December 2008. Retrieved 5 November 2008.
- ↑ Roy, Debashish (14 August 2011). "Ghaziabad has a long way to go to become a part of NCR backbone". The Hindu. Archived from the original on 20 July 2014. Retrieved 12 June 2014.
- ↑ Azimabadi, Badr (2007). Great Personalities in Islam. Daryaganj, Delhi: Adam Publishers. p. 218. ISBN 9788174351227.
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 1". Irfca.org. Archived from the original on 22 September 2014. Retrieved 17 June 2014.
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 2". Irfca.org. Archived from the original on 11 June 2014. Retrieved 17 June 2014.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 2 April 2013. Retrieved 7 July 2012.
- ↑ "district and session court-ghaziabad". Ghaziabad.nic.in. Archived from the original on 14 February 2014. Retrieved 17 June 2014.
- ↑ "Make NH-24 eight-lane to ease mess: Akhilesh Yadav". Hindustan Times. Archived from the original on 4 June 2013. Retrieved 20 June 2013.
- ↑ UDAN flights from Hindon airport, Ghaziabad, will connect to Hubli, Jamnagar, Shimla, Kalburgi, Kannur, Nashik, Faizabad, Pithoragarh Livemint