జ్యోతి అరోరా
స్వరూపం
జ్యోతి అరోరా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1977 |
వృత్తి | నవలా రచయిత; బ్లాగర్ |
రచనా రంగం | ఫిక్షన్; మోటివేషినల్ |
గుర్తింపునిచ్చిన రచనలు | యు కేమ్ లైక్ హోప్ (2017); లెమన్ గర్ల్ (2014) |
జ్యోతి అరోరా భారతీయ రచయిత్రి, టెక్ బ్లాగర్.[1] డ్రీమ్స్ సేక్ (2011), లెమన్ గర్ల్ (2014), యు కేమ్ లైక్ హోప్ (2017)తో సహా అనేక పుస్తకాలు రాసింది. ఘజియాబాద్‌లో నివసిస్తోంది.[2]
జీవిత చరిత్ర
[మార్చు]అరోరాకు మూడు నెలల వయస్సులో తలసేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యం కారణంగా ఏడవ తరగతిలో పాఠశాల చదువును విడిచిపెట్టింది.[3][4] కరస్పాండెన్స్ పాఠశాల విద్య ద్వారా తన విద్యను కొనసాగించింది.[4] ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ (ఆనర్స్) లో బిఏ పూర్తి చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం, అప్లైడ్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసింది.[2][4][5] ఇంగ్లీష్ ట్యూటర్, ఫ్రీలాన్స్ రైటర్‌గా, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఒక ఐటీ రిక్రూట్‌మెంట్ సంస్థలో పనిచేసింది.[2][4]
రచనలు
[మార్చు]- డ్రీమ్స్ సేక్ (2011), వి&ఎస్ పబ్లిషర్స్[4][6][7]
- లెమన్ గర్ల్ (2014), స్వీయ-ప్రచురణ[1][4][5]
- యు కేమ్ లైక్ హోప్ (2017), స్వీయ-ప్రచురణ[1][5]
- #జస్ట్ రొమాన్స్: 7 చిన్న రొమాన్స్‌ల కథల సంకలనం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Rajpal, Seema (December 12, 2017). "How author Jyoti Arora hasn't let thalassemia or Twitter trolls get in her way". The New Indian Express. Retrieved 15 April 2021.
- ↑ 2.0 2.1 2.2 Narkhede, Nikhil. "Jyoti Arora Interview – Lemon Girl Book". WriterStory. Retrieved 15 April 2021.
- ↑ Arora, Jyoti (May 8, 2019). "World Thalassemia Day: Here's Why It's Important To Donate Blood". The Quint. Retrieved 15 April 2021.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Dua, Neha (September 2, 2015). "Thalassemia Could Not Stop Her from Achieving Her Dream of Becoming a Novelist. Meet This Dynamo". The Better India. Retrieved 15 April 2021.
- ↑ 5.0 5.1 5.2 Gupta, Soumyabrata (January 31, 2018). "Women do file fake cases against men and their families, says author Jyoti Arora". Deccan Chronicle. Retrieved 15 April 2021.
- ↑ Chakraborty, Bastab (August 25, 2011). "Book Review: 'Dream's Sake' by Jyoti Arora". Between The Lines. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.
- ↑ "Interview: Jyoti Arora, author of 'Dream's Sake'". Between the Lines. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 31 December 2017.