మౌ
మౌ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°56′30″N 83°33′40″E / 25.94167°N 83.56111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Uttar Pradesh |
జిల్లా | మౌ |
విస్తీర్ణం | |
• Total | 20 కి.మీ2 (8 చ. మై) |
• జనసాంద్రత | 13,937/కి.మీ2 (36,100/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 275101 |
టెలిఫోన్ కోడ్ | +0547 |
Vehicle registration | UP-54 |
లింగనిష్పత్తి | 978 (as of 2011) ♀/♂ |
మౌ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మౌ జిల్లా లోని పట్టణం. దీన్ని మౌనత్ భంజన్ అని కూడా అంటారు. ఇది ఒక పారిశ్రామిక పట్టణం. మౌ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఉంది. ఈ పట్టణం చీర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల నాటి సాంప్రదాయ వ్యాపారం, పట్టణ ప్రజల పురాతన కళ.[1]
1540- 1545 మధ్యకాలంలో, హుమాయున్‌ను ఓడించిన షేర్ షా సూరి, తన పాలనలో ఉన్న గొప్ప సూఫీ సాధువు సయ్యద్ అహ్మద్ వాద్వాను కలవడానికి కొల్హువాన్ (మధుబన్) సందర్శించాడు.[2] షేర్ షా కుమార్తెలలో ఒకరైన మహ్వానీ, వాద్వా దర్గాకు సమీపంలో శాశ్వతంగా స్థిరపడింది. మొగలు చక్రవర్తి అక్బర్ అలహాబాద్ వెళ్ళేటప్పుడు మౌ గుండా వెళ్ళాడని జియావుదీన్ బర్నీ రాసాడు. ఆ సమయంలో, మొగలు సైన్యంతో పాటు వచ్చిన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీలకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారూ ఇక్కడ శాశ్వతంగా స్థిరపడ్డారు. ఈ చేతివృత్తులవారు కొంతకాలానికి ఇక్కడి సమాజంలో కలిసిపోయారు. వారు తమ కళను సజీవంగానే ఉంచుకున్నారు. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో చేనేత పరిశ్రమ క్రమంగా మరణించినప్పటికీ, మౌ లోని చీర పరిశ్రమ ఇప్పటికీ ఈ ప్రాంతంలో హస్తకళకు చిట్టచివరి స్థావరంగా మిగిలిపోయింది. అక్బర్ కుమార్తెలలో ఒకరైన జహానారా బేగం కూడా ఆ ప్రాంతంలోనే స్థిరపడిందని భావిస్తారు. ఆమె ఇక్కడ ఒక మసీదు నిర్మించింది. ఆ అసలు మసీదు ప్రస్తుతం ఉనికిలో లేదు గానీ, షాహి ఖత్రా అనే ఈ స్థలంలో ఉన్న షాహి మసీదు దాని గత వైభవాన్ని గుర్తు చేస్తుంది.[3]
మౌ ప్రజలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. 1939 లో మహాత్మా గాంధీ, జిల్లా లోని దోహారీఘాట్ ప్రాంతాన్ని సందర్శించాడు.[4]
1932 లో ఆజంగఢ్ జిల్లా ఏర్పాటయింది. 1988 వరకు మౌ ప్రాంతం ఆ జిల్లాలో భాగంగా ఉండేది. 1988 నవంబరు 19 న ఆజంగఢ్ జిల్లా నుండి విడదీసి, మౌ జిల్లాను ఏర్పరచారు.[5]
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Mau | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23 (73) |
26 (79) |
33 (91) |
39 (102) |
42 (108) |
40 (104) |
34 (93) |
33 (91) |
33 (91) |
33 (91) |
29 (84) |
25 (77) |
33 (90) |
సగటు అల్ప °C (°F) | 9 (48) |
11 (52) |
16 (61) |
22 (72) |
26 (79) |
28 (82) |
26 (79) |
26 (79) |
24 (75) |
20 (68) |
14 (57) |
10 (50) |
19 (67) |
సగటు అవపాతం mm (inches) | 12 (0.5) |
18 (0.7) |
9 (0.4) |
0 (0) |
0 (0) |
96 (3.8) |
144 (5.7) |
162 (6.4) |
201 (7.9) |
24 (0.9) |
3 (0.1) |
6 (0.2) |
675 (26.6) |
Source: [Mau Weather] |
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం, మౌ పట్టణ జనాభా 2,78,745. అందులో 1,42,967 మంది పురుషులు, 1,35,778 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 42,216. ఇది మౌ జనాభాలో 15.15%. రాష్ట్ర జనాభాలో లింగనిష్పత్తి 912 కాగా మౌలో ఇది 950. పిల్లల్లో లింగనిష్పత్తి 952. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొత్తమ్మీద పిల్లల్లో లింగనిష్పత్తి 902. మౌలో అక్షరాస్యత 77.13%, ఇది రాష్ట్ర సగటు 67.68% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 82.37% కాగా, స్త్రీలలో అక్షరాస్యత రేటు 71.60%.
మూలాలు
[మార్చు]- ↑ https://www.business-standard.com/article/markets/up-s-silk-saree-sector-gets-a-raw-deal-105062901045_1.html
- ↑ "Sufi saint's abode now Uttar Pradesh don's den". Articles.timesofindia.indiatimes.com. 2012-02-10. Archived from the original on 2013-09-13. Retrieved 2015-10-05.
- ↑ https://timesofindia.indiatimes.com/city/lucknow/Sufi-saints-abode-now-dons-den/articleshow/11830609.cms
- ↑ https://mau.nic.in/about-district/history/
- ↑ https://www.thehindu.com/news/national/other-states/in-mau-a-complex-tapestry-of-caste-and-religion/article2879547.ece
- ↑ "Maunath Bhanjan Town Population Census 2011 - 2023". Census 2011. Retrieved 1 June 2017.