ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ उत्तर प्रदेश اتر پردیش | |
---|---|
![]() | |
![]() Location of Uttar Pradesh in India | |
![]() Map of Uttar Pradesh | |
దేశం | భారత్ |
ప్రాంతం | అవద్ , m:en:Baghelkhand, m:en:Braj, m:en:Doab m:en:Bundelkhand, m:en:Purvanchal, m:en:Rohilkhand, m:en:Indo-Gangetic Plain |
Established | Modern: 1805 (as Ceded and Conquered Provinces) |
History | Summary
|
Capital | లక్నో |
Districts | 75 total[1] |
ప్రభుత్వం | |
• నిర్వహణ | భారత ప్రభుత్వము, m:en:Government of Uttar Pradesh |
• గవర్నరు | m:en:Anadi Ben Patel |
• Chief Minister | Aditya yogi nadh ([Bharat Janata party [BJP]]) |
• Legislature | m:en:Bicameral (404 + 108 seats) |
• Parliamentary constituency | 80 |
• High Court | అలహాబాద్ హైకోర్టు |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,43,286 km2 (93,933 sq mi) |
విస్తీర్ణపు ర్యాంకు | 5th |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 199,581,477 |
• ర్యాంకు | 1st |
• సాంద్రత | 820/km2 (2,100/sq mi) |
పిలువబడువిధం (ఏక) | Uttarpradeshi, UPite, Uttar Bharatiya, North Indian |
కాలమానం | UTC+05:30 (IST) |
m:en:UN/LOCODE | IN-UP |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | UP 01—XX |
HDI | ![]() |
HDI rank | 32nd (2005) |
Literacy | 69.72% 79.24% (male) 59.26% (female) |
Official language | హిందీ ఇంగ్లీష్ ఉర్దూ |
జాలస్థలి | upgov.nic.in |
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)
ప్రాచీన చరిత్ర[మార్చు]
గంగా యమునా పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.
ఇటీవలి చరిత్ర[మార్చు]
అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.
ప్రాంతాలు[మార్చు]
- వాయువ్య ప్రాంతం - రోహిల్ ఖండ్
- నైఋతి ప్రాంతం - డోఅబ్, బ్రిజ్ (వ్రజభూమి)
- మధ్య ప్రాంతం - అవధ్ (ఓధ్)
- ఉత్తర భాగం - బాగల్ ఖండ్, బుందేల్ ఖండ్
- తూర్పు భాగం - పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం)
ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి ఆగ్రా, అజంగడ్, అలహాబాదు, కాన్పూర్, గోరఖ్‌పూర్ , చిత్రకూట్, ఝాన్సీ, దేవీపటణ్, ఫైజాబాద్, బాహ్రూచ్, బరేలీ, బస్తీ, మీర్జాపూర్, మొరాదాబాద్, మీరట్, లక్నో, వారాణసి, సహరాన్పూర్.
భాషలు[మార్చు]
హిందీ, ఉర్దూ - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "ఖరీబోలీ" (కడీబోలీ) భాష హిందీ, ఉర్దూ భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. లక్నోలో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, భోజపురి భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్ లలో విస్తరించి ఉన్నారు.
రాజకీయాలు[మార్చు]
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాద్ .
ఉత్తర ప్రదేశ్ జిల్లాలు[మార్చు]
సంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AG | ఆగ్రా | ఆగ్రా | 43,80,793 | 4,027 | 1,084 |
2 | AL | అలీగఢ్ | అలీగఢ్ | 36,73,849 | 3,747 | 1,007 |
3 | AH | అలహాబాద్ | అలహాబాద్ | 59,59,798 | 5,481 | 1,087 |
4 | AN | అంబేద్కర్ నగర్ | అక్బర్‌పూర్ | 23,98,709 | 2,372 | 1,021 |
5 | AM | అమేఠీ | గౌరీగంజ్ | 25,49,935 | 3,063 | 830 |
6 | JP | అమ్రోహా | అమ్రోహా | 18,38,771 | 2,321 | 818 |
7 | AU | ఔరైయా | ఔరైయా | 13,72,287 | 2,051 | 681 |
8 | AZ | ఆజంగఢ్ | ఆజంగఢ్ | 46,16,509 | 4,053 | 1,139 |
9 | BG | బాగ్‌పత్ | బాగ్‌పత్ | 13,02,156 | 1,345 | 986 |
10 | BH | బహ్‌రైచ్ | బహ్‌రైచ్ | 23,84,239 | 4,926 | 415 |
11 | BL | బలియా | బలియా | 32,23,642 | 2,981 | 1,081 |
12 | BP | బల్‌రాంపూర్ | బల్‌రాంపూర్ | 21,49,066 | 3,349 | 642 |
13 | BN | బాందా | బాందా | 17,99,541 | 4,413 | 404 |
14 | BB | బారాబంకీ | బారాబంకీ | 32,57,983 | 3,825 | 739 |
15 | BR | బరేలీ | బరేలీ | 44,65,344 | 4,120 | 1,084 |
16 | BS | బస్తీ | బస్తీ | 24,61,056 | 2,687 | 916 |
17 | BH | భదోహీ | గ్యాన్‌పూర్ | 15,54,203 | 960 | 1,531 |
18 | BI | బిజ్నౌర్ | బిజ్నౌర్ | 36,83,896 | 4,561 | 808 |
19 | BD | బదాయూన్ | బదాయూన్ | 37,12,738 | 5,168 | 718 |
20 | BU | బులంద్‌షహర్ | బులంద్‌షహర్ | 34,98,507 | 3,719 | 788 |
21 | CD | చందౌలీ | చందౌలీ | 19,52,713 | 2,554 | 768 |
22 | CT | చిత్రకూట్ | చిత్రకూట్ | 9,90,626 | 3,202 | 315 |
23 | DE | దేవరియా | దేవరియా | 30,98,637 | 2,535 | 1,220 |
24 | ET | ఎటా | ఎటా | 17,61,152 | 2,456 | 717 |
25 | EW | ఎటావా | ఎటావా | 15,79,160 | 2,287 | 683 |
26 | FZ | ఫైజాబాద్ | ఫైజాబాద్ | 24,68,371 | 2,765 | 1,054 |
27 | FR | ఫరూఖాబాద్ | ఫతేగఢ్ | 18,87,577 | 2,279 | 865 |
28 | FT | ఫతేపూర్ | ఫతేపూర్ | 26,32,684 | 4,152 | 634 |
29 | FI | ఫిరోజాబాద్ | ఫిరోజాబాద్ | 24,96,761 | 2,361 | 1,044 |
30 | GB | గౌతమ బుద్ద నగర్ | నోయిడా | 16,74,714 | 1,269 | 1,252 |
31 | GZ | ఘాజియాబాద్ | ఘాజియాబాద్ | 46,61,452 | 1,175 | 3,967 |
32 | GP | ఘాజీపూర్ | ఘాజీపూర్ | 36,22,727 | 3,377 | 1,072 |
33 | GN | గోండా | గోండా | 34,31,386 | 4,425 | 857 |
34 | GR | గోరఖ్‌పూర్ | గోరఖ్‌పూర్ | 44,36,275 | 3,325 | 1,336 |
35 | HM | హమీర్‌పూర్ | హమీర్‌పూర్ | 11,04,021 | 4,325 | 268 |
36 | PN | హాపూర్ | హాపూర్ | 13,38,211 | 660 | 2,028 |
37 | HR | హర్దోయీ | హర్దోయీ | 40,91,380 | 5,986 | 683 |
38 | HT | హాత్‌రస్ | హాత్‌రస్ | 15,65,678 | 1,752 | 851 |
39 | JL | జలౌన్ | ఒరాయీ | 16,70,718 | 4,565 | 366 |
40 | JU | జౌన్‌పూర్ | జౌన్‌పూర్ | 44,76,072 | 4,038 | 1,108 |
41 | JH | ఝాన్సీ | ఝాన్సీ | 20,00,755 | 5,024 | 398 |
42 | KJ | కన్నౌజ్ | కన్నౌజ్ | 16,58,005 | 1,993 | 792 |
43 | KD | కాన్పూర్ దేహత్ | అక్బర్‌పూర్ | 17,95,092 | 3,021 | 594 |
44 | KN | కాన్పూర్ | కాన్పూర్ | 45,72,951 | 3,156 | 1,415 |
45 | KR | కాస్‌గంజ్ | కాస్‌గంజ్ | 14,38,156 | 1,955 | 736 |
46 | KS | కౌశాంబి | మంఝన్‌పూర్ | 15,96,909 | 1,837 | 897 |
47 | KU | కుశినగర్ | పద్రౌనా | 35,60,830 | 2,909 | 1,226 |
48 | LK | లఖింపూర్ ఖేరి | లఖింపూర్ | 40,13,634 | 7,674 | 523 |
49 | LA | లలిత్‌పూర్ | లలిత్‌పూర్ | 12,18,002 | 5,039 | 242 |
50 | LU | లక్నో | లక్నో | 45,88,455 | 2,528 | 1,815 |
51 | MG | మహారాజ్‌గంజ్ | మహారాజ్‌గంజ్ | 26,65,292 | 2,953 | 903 |
52 | MH | మహోబా | మహోబా | 8,76,055 | 2,847 | 288 |
53 | MP | మైన్‌పురి | మైన్‌పురి | 18,47,194 | 2,760 | 670 |
54 | MT | మథుర | మథుర | 25,41,894 | 3,333 | 761 |
55 | MB | మౌ | మౌ | 22,05,170 | 1,713 | 1,287 |
56 | ME | మీరట్ | మీరట్ | 34,47,405 | 2,522 | 1,342 |
57 | MI | మీర్జాపూర్ | మీర్జాపూర్ | 24,94,533 | 4,522 | 561 |
58 | MO | మొరాదాబాద్ | మొరాదాబాద్ | 47,73,138 | 3,718 | 1,284 |
59 | MU | ముజఫర్ నగర్ | ముజఫర్ నగర్ | 41,38,605 | 4,008 | 1,033 |
60 | PI | ఫిలిభిత్ | ఫిలిభిత్ | 20,37,225 | 3,499 | 567 |
61 | PR | ప్రతాప్‌గఢ్ | ప్రతాప్‌గఢ్ | 31,73,752 | 3,717 | 854 |
62 | RB | రాయ్‌బరేలి | రాయ్‌బరేలి | 34,04,004 | 4,609 | 739 |
63 | RA | రాంపూర్ | రాంపూర్ | 23,35,398 | 2,367 | 987 |
64 | SA | సహారన్‌పూర్ | సహారన్‌పూర్ | 34,64,228 | 3,689 | 939 |
65 | SM | సంభల్ | సంభల్ | 22,17,020 | 2453 | 890 |
66 | SK | సంత్ కబీర్ నగర్ | ఖలీలాబాద్ | 17,14,300 | 1,442 | 1,014 |
67 | SJ | షాజహాన్‌పూర్ | షాజహాన్‌పూర్ | 30,02,376 | 4,575 | 673 |
68 | SH | షామ్లీ [2] | షామ్లీ | 12,74,815 | 1,063 | 1,200 |
69 | SV | శ్రావస్తి | భింగా | 11,14,615 | 1,948 | 572 |
70 | SN | సిద్దార్థనగర్ | సిద్ధార్థనగర్ | 25,53,526 | 2,751 | 882 |
71 | SI | సీతాపూర్ | సీతాపూర్ | 44,74,446 | 5,743 | 779 |
72 | SO | సోన్‌భద్ర | రాబర్ట్స్‌గంజ్ | 18,62,612 | 6,788 | 274 |
73 | SU | సుల్తాన్‌పూర్ | సుల్తాన్‌పూర్ | 37,90,922 | 4,436 | 855 |
74 | UN | ఉన్నావ్ | ఉన్నావ్ | 31,10,595 | 4,561 | 682 |
75 | VA | వారణాసి | వారణాసి | 36,82,194 | 1,535 | 2,399 |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. 1 March 2011. Archived from the original on 26 ఏప్రిల్ 2012. Retrieved 31 July 2012.
- ↑ Shamli district of Uttar Pradesh was formerly named Prabudh Nagar district, which did not exist during census 2011.
విద్యా వ్యవస్థ[మార్చు]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు.
అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలు[మార్చు]
తాజ్ మహల్ ( "తాజ్") మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది.ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.[1][2] 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది."
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు[మార్చు]
- ములాయం సింగ్ యాదవ్
- మాయావతి
- రాజ్‌నాథ్ సింగ్
- కళ్యాణ్ సింగ్
- అఖిలేష్ యాదవ్
- ధరం సింగ్ సైనీ
- రాజశ్రీ రాణి - నటి
- శ్వేతా తివారీ - నటి
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Hasan, Parween (November 1994), "Review of Mughal Architecture: Its outline and its history", The Journal of Asian Studies, 53 (4): 1301
- ↑ లెస్లీ A. డ్యుటెంపుల్, "ది తాజ్ మహల్", లెర్నర్ పబ్లిషింగ్ గ్రూప్ (మార్చ్ 2003). pg 26: "ది తాజ్ మహల్, ఎ స్పెక్టాక్యులర్ ఎగ్జాంల్ అఫ్ మొఘుల్ నిర్మాణశాస్త్రం, బ్లెండ్స్ ఇస్లామిక్, హిందూ అండ్ పర్షియన్ స్టైల్స్"