కల్యాణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్యాణ్ సింగ్
21వ రాజస్థాన్ గవర్నర్
In office
4 సెప్టెంబర్ 2014 – 8 సెప్టెంబర్ 2019
అంతకు ముందు వారుమార్గరెట్ అల్వా
తరువాత వారుకల్రాజ్ మిశ్రా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
(Additional charge)
In office
28 జనవరి 2015 – 12 ఆగస్టు 2015
అంతకు ముందు వారుఊర్మిళా సింగ్
తరువాత వారుఆచార్య దేవవ్రత్
పార్లమెంటు సభ్యుడు for లోక్ సభ
In office
2009–2014
అంతకు ముందు వారుదేవేంద్ర సింగ్ యాదవ్
తరువాత వారురాజ్‌వీర్ సింగ్
నియోజకవర్గంEtah, Uttar Pradesh
16th Chief Minister of Uttar Pradesh
In office
24 June 1991 – 6 December 1992
అంతకు ముందు వారుMulayam Singh Yadav
తరువాత వారుPresident's rule
In office
21 September 1997 – 12 November 1999
అంతకు ముందు వారుMayawati
తరువాత వారుRam Prakash Gupta
వ్యక్తిగత వివరాలు
మరణంలక్నో, ఉత్తర ప్రదేశ్, ఇండియా
రాజకీయ పార్టీBharatiya Janata Party
ఇతర రాజకీయ
పదవులు
జీవిత భాగస్వామిRamwati Devi (1952–2021) (his death)
సంతానం2 (including Rajveer Singh)
పురస్కారాలుపద్మ విభూషణ్ (2022) (posthumously)

కళ్యాణ్ సింగ్, భారతీయ రాజకీయ నాయకుడు.  భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా , పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు పనిచేశాడు.2014లో రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన మరణానంతరం  భారత ప్రభుత్వం  2022 వ సంవత్సరానికి గాను   పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.[1][2]

జననం[మార్చు]

జనవరి 5 1932 వ సంవత్సరంలో అలిగర్ జిల్లా లో యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్) లో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

భారతీయ జనసంఘ్ (BJS) అభ్యర్థిగా మొదటిసారిగా 1967 లో అత్రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలలో పోటీ చేసి 4351 ఓట్లతో   గెలిచారు. ఆ తరువాత  1969, 1974, 1977, 1980, 1985, 1989, 1991, 1993, 1996, 2002  సంవత్సరాల  శాసనసభ ఎన్నికలలో ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసి 9 సార్లు విజయం సాధించాడు. 1980లో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా, 1984లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1991,1997 లలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[3]

ముఖ్యమంత్రిగా మొదటి పర్యాయం[మార్చు]

1990 చివరలో BJP దాని హిందూ-జాతీయవాద అనుబంధ సంస్థలు అయోధ్య నగరంలోని బాబ్రీ మసీదుపై హిందూ దేవాలయాన్ని నిర్మించాలనే ఆందోళనకు మద్దతుగా రామరథ యాత్ర అనే మతపరమైన ర్యాలీని నిర్వహించాయి. యాత్ర ఒక ముఖ్యమైన ప్రజా ఉద్యమంగా మారింది హిందువులలో మతపరమైన మిలిటెంట్ భావాలను బలపరిచింది. దాని తర్వాత గణనీయమైన మత హింస సంభవించింది. 1991లో జరిగిన పార్లమెంటరీ శాసనసభ ఎన్నికలలో BJP భారీ విజయాలు సాధించింది. దీంతో  జూన్ 1991లో కళ్యాణ్ సింగ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

ముఖ్యమంత్రిగా రెండవ పర్యాయం[మార్చు]

రాష్ట్రపతి పాలన కాలం తరువాత 1993 నవంబరులో మళ్లీ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. సింగ్ అత్రౌలి ,కాస్ గంజ్ అనే రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేసి రెండింటినీ గెలుచుకున్నాడు. బిజెపి ఓటు వాటా గత ఎన్నికలలో మాదిరిగానే ఉంది, కానీ గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్య 221 నుండి 177 కు తగ్గింది, సమాజ్ వాదీ పార్టీ ,బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. బిఎస్ పి నాయకుడు యాదవ్ , మాయావతి మధ్య పొత్తు 1995 లో విచ్ఛిన్నమైంది, మాయావతి బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  తదనంతరం కళ్యాణ్ సింగ్ 1997 సెప్టెంబరులో రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

మరణం[మార్చు]

89 సంవత్సరాల వయస్సులో 21 ఆగస్టు 2021న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. telugu, 10tv (2022-01-25). "Padma Awards 2022 : పద్మ అవార్డుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికంటే..? | Padma Awards 2022 : Padma Awards 2022: Full List Of Recipients". 10TV (in telugu). Retrieved 2022-01-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. January 25, India Today Web Desk; January 25, 2022UPDATED:; Ist, 2022 22:22. "Late CDS Bipin Rawat, Kalyan Singh and Ghulam Nabi Azad among Padma awardees | Full list here". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-01-26. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "Kalyan_Singh".{{cite web}}: CS1 maint: url-status (link)