రామ్ ప్రకాష్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంప్రకాష్ గుప్తా
మధ్యప్రదేశ్ గవర్నర్
In office
2003 మే 7 – 2004 మే 1
తరువాత వారుకేఎంసెథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
1999 నవంబర్ 12 – 2000 అక్టోబర్ 28
అంతకు ముందు వారుకళ్యాణ్ సింగ్
తరువాత వారురాజ్ నాథ్ సింగ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
1967 ఏప్రిల్ 3 – 1968 ఫిబ్రవరి 25
ముఖ్యమంత్రిచరణ్ సింగ్
అంతకు ముందు వారుప్రారంభమైంది
వ్యక్తిగత వివరాలు
జననం1923 అక్టోబర్ 26
ఝాన్సీ, ఉత్తరప్రదేశ్, భారతదేశం
మరణం2004 మే 1
న్యూఢిల్లీ , భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానం5
కళాశాలఅలహాబాద్ విశ్వవిద్యాలయం

రామ్ ప్రకాష్ గుప్తా ( 1923 అక్టోబరు 26 – 2004 మే 1) ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు . రాంప్రకాష్ గుప్తా భారతీయ జనతా పార్టీ, నాయకుడు.

రాంప్రకాష్ గుప్తా విధాన్ పరిషత్‌లో భారతీయ జనసంఘ్‌కు ప్రాతినిధ్యం వహించాడు చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చరణ్ సింగ్ ప్రభుత్వంలో రాంప్రకాష్ గుప్తా ఉపముఖ్యమంత్రిగా పనిచేశాడు.[ వివరణ అవసరం ]

1977లో రాంప్రకాష్ గుప్తా రామ్ నరేష్ యాదవ్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు.[ వివరణ అవసరం ]

జనతా పార్టీ పతనం తరువాత, అతను ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పరిని పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించాడు 1991లో రాష్ట్ర ఎన్నికలలో పార్టీ విజయానికి దోహదపడ్డాడు.[ వివరణ అవసరం ]

అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు . దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కళ్యాణ్ సింగ్ ను ముఖ్యమంత్రిగా తప్పించి రాంప్రకాష్ గుప్తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.[ వివరణ అవసరం ]

2003 మే 7 న, రాంప్రకాష్ గుప్తా మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించబడ్డాడు.

మరణం

[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ ప్రకాష్ గుప్తా 2004 మే 1న మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉండగానే మరణించాడు.[1] రాంప్రకాష్ గుప్తాకు భార్య ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు లక్నోలో అంత్యక్రియలు నిర్వహించారు.

మూలాలు

[మార్చు]
  1. "MP governor Ram Prakash Gupta dead".