మార్గరెట్ అల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మార్గరెట్ అల్వా (జననం 1942 ఏప్రిల్ 14), ప్రముఖ కాంగ్రెస్ పార్టీకి  చెందిన రాజకీయ నాయకురాలు. ఆగస్టు 2014 వరకు రాజస్థాన్  గవర్నర్ గా పనిచేశారు. అంతకుముందు ఉత్తరాఖండ్ కు  గవర్నర్ గా  వ్యవహరించారు ఆమె. ఆ సమయంలో పంజాబ్రాజస్థాన్ లకు  సంయుక్త రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న శివరాజ్ పాటిల్ నుంచి ఆమె  చార్జ్ స్వీకరించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా  పనిచేశారు మార్గరెట్.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

1942 ఏప్రిల్ 14న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో క్రైస్తవ  కుటుంబంలో జన్మించారు మార్గరెట్. ఆమె అసలు పేరు మార్గరెట్  నజరెత్.[1]  బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో బిఎ, ప్రభుత్వ  న్యాయ కళాశాలలో లా చదువుకున్నారు మార్గరెట్.[2] ఆమె  కళాశాలలో చదువుకునేటప్పుడు కొన్ని విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా  పాల్గొన్నారు. అంతేకాక ఆమె మంచి వక్తగా కూడా పేరు  తెచ్చుకున్నారు.[3]

మార్గరెట్ ఒక పక్క లాయర్ గా తన కెరీర్ కొనసాగిస్తూనే, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అదే సమయంలో యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు ఆమె. కరుణా నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనే సంక్షేమ సంస్థను స్థాపించారు మార్గరెట్. ఈ సంస్థ ద్వారా మహిళల, బాలల సంక్షేమం కోసం కృషి  చేశారు ఆమె.[2][4]

1964 మే 24లో నిరంజన్ అల్వాను వివాహం చేసుకున్నారు మార్గరెట్. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కొడుకులు ఉన్నారు.[5] వీరిద్దరూ ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా చదివేటప్పుడు కలుసుకున్నారు.[3] ప్రస్తుతం నిరంజన్ ఎగుమతి వ్యాపారం నడుపుతున్నారు. ఆయన ఆర్థిక సహకారంతోనే మార్గరెట్ తన కెరీర్ ను రాజకీయాల్లోకి మార్చుకున్నారు.[2]

ఆమె కొడుకు నీరట్ ఆల్వా సోనీ టీవీలో ప్రముఖ టీవీ షోలకు నిర్మాతగా వ్యవహరించాడు. నీరట్ కోడలు అనుజ చౌహాన్ ప్రముఖ ప్రకటనకర్త, రచయిత్రి. అనుజ పెప్సికో కు అందించిన "దిల్ మాంగేమోర్" వంటి ప్రకటన స్లోగన్లు చాలా ప్రాచుర్యం పొందాయి.

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; mem అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 Commonwealth Secretariat (1999). Women in Politics: Voices from the Commonwealth. Commonwealth Secretariat. pp. 75–77. ISBN 9780850925692.
  3. 3.0 3.1 Vittal, Gita (2007). Reflections: Experiences of a Bureaucrat's Wife. Academic Foundation. pp. 68–69. ISBN 9788171884711.
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; rajgovt అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Miditech moves on". Business Standard. 29 September 2004.