అనంత్ కుమార్ హెగ్డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత్ కుమార్ హెగ్డే
అనంత్ కుమార్ హెగ్డే


నైపుణ్యాభివృద్ధి & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రాజీవ్ ప్రతాప్ రూడీ
నియోజకవర్గం ఉత్తర కన్నడ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు మార్గరెట్ అల్వా
నియోజకవర్గం ఉత్తర కన్నడ
పదవీ కాలం
1996–1999
ముందు జి. దేవరాయ నాయక్
తరువాత మార్గరెట్ అల్వా
నియోజకవర్గం ఉత్తర కన్నడ

వ్యక్తిగత వివరాలు

జననం (1968-05-20) 1968 మే 20 (వయసు 55)
సిర్సి, ఉత్తర కన్నడ, కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
సంతానం 2
మూలం [1]

అనంత్‌ కుమార్ హెగ్డే[1] (జననం 20 మే 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 3 సెప్టెంబర్ 2017 నుండి 24 మే 2019 వరకు నైపుణ్యాభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రిగా పని చేశాడు.[2] అనంత్ కుమార్ హెగ్డే భత్కల్ మసీదు ధ్వంసం గురించి, భారత రాజ్యాంగంలో మార్పులు చేయడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు బీజేపీ అధిష్టానం 2024లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ టికెట్ ను నిరాకరించింది.[3][4]

రాజకీయ జీవితం[మార్చు]

అనంతకుమార్ హెగ్డే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యాడు, ఆ తర్వాత 1998లోజరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన మార్గరెట్ అల్వా చేతిలో ఓడిపోయాడు. ఆయన 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎన్నికై సెప్టెంబరు 2017 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[5]

వివాదాలు[మార్చు]

ఆయన జనవరి 2017లో ఆసుపత్రిలో తన తల్లికి తగినంత శ్రద్ధ చూపడం లేదని భావించినందున డాక్టర్‌పై దాడి చేసి కొట్టడం కెమెరాకు చిక్కాడు.[6]

జాబ్ ఫెయిర్, స్కిల్ ఎగ్జిబిషన్‌లో 2018లో మాట్లాడుతూ భారతదేశంలోని యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి తన నిబద్ధతతో ముందుకు సాగుతానని, వీధికుక్కలు మొరిగే వాటి గురించి పట్టించుకోనని, తన మునుపటి “రాజ్యాంగాన్ని మార్చు” వ్యాఖ్యలను నిరసిస్తున్న సమూహాలను ప్రస్తావిస్తూ చెప్పాడు.[7][8]

2018లో సెక్యులర్ అనే పదాన్ని విమర్శిస్తూ, పీఠికలోని పదాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం "రాజ్యాంగాన్ని సవరిస్తుంది" అని అన్నాడు.[9]

తాజ్ మహల్ నిజానికి తేజో మహాలయ అని పిలువబడే శివ మందిరం అని అతను పేర్కొన్నాడు. కేంద్ర మంత్రిగా ఆయన సాధించిన విజయాలపై కెపిసిసి అధ్యక్షుడు దినేష్ గుండూరావు ప్రశ్నించిన తర్వాత హెగ్డే రావును "ఒక ముస్లిం మహిళ వెనుక నడిచిన వ్యక్తి" అని పేర్కొన్నాడు.[10]

2019 జనవరిలో శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని "హిందువులపై పగటిపూట అత్యాచారం"గా ఆయన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్య చేశాడు.[11]

2019 మార్చిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని "కాంగ్రెస్ ప్రయోగశాలలో మాత్రమే కనుగొనగలిగే హైబ్రిడ్ ఉత్పత్తి" అని పిలిచి వివాదాన్ని రేకెత్తించాడు. " ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టినప్పటికీ" గాంధీ తాను బ్రాహ్మణుడినని చెప్పుకుంటున్నారని ఆయన అన్నాడు.[12][13]

2019 సెప్టెంబరులో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. శశికాంత్ సెంథిల్‌ను దేశద్రోహి అని పిలిచి పాకిస్తాన్‌కు వెళ్లమని చెప్పి మరోసారి వివాదాన్ని సృష్టించాడు.[14][15]

2020ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటం ఒక డ్రామా అని పేర్కొంటూ హెగ్డే మరో వివాదాన్ని రెక్కేతించి అలాంటి వ్యక్తిని 'మహాత్మా' అని ఎలా పిలుస్తారని ప్రశ్నిస్తూ గాంధీపై దాడి చేశాడు.[16][17][18][19][20]

ఉత్తర కన్నడలోని కుంటలో జరిగిన సభలో 11 ఆగష్టు 2020లో 'బీఎస్‌ఎన్‌ఎల్‌లో దేశద్రోహులతో నిండిన వ్యవస్థ ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[21]

మూలాలు[మార్చు]

  1. "Anantkumar Hegde - Profile". anantkumarhegde.com. Archived from the original on 11 June 2021. Retrieved 11 June 2021.
  2. The Economic Times (3 September 2017). "Ananth Kumar Hegde - five-time MP, Taekwondo enthusiast, Skill Development Minister". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  3. Eenadu (25 March 2024). "LS polls: 'నోరు' జారి.. 'అవకాశం' కోల్పోయి". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  4. News18 (25 March 2024). "Karnataka BJP Lok Sabha List: Ananth Kumar Hegde Dropped, Setback for Sadananda Gowda Too" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Who is Anant Kumar Hegde?". The Indian Express. 3 September 2017. Archived from the original on 9 December 2017. Retrieved 17 December 2017.
  6. "New Minister Slapped Doctor On Camera. He Knows Tae Kwon Do". NDTV.com. 3 September 2017. Archived from the original on 5 April 2018. Retrieved 4 April 2018.
  7. "Anantkumar Hegde's 'barking dogs' remark angers Dalits". The Hindu. 20 January 2018. Archived from the original on 9 November 2020. Retrieved 2 April 2018.
  8. "Prakash Raj calls Anantkumar Hegde 'barking dog' remark attack on Dalits, minister denies". The Indian Express. 22 January 2018. Archived from the original on 1 April 2018. Retrieved 2 April 2018.
  9. "List of BJP leaders who made controversial remarks - Anant Kumar Hegde's controversial comments on secularism". The Economic Times. 2 January 2018. Archived from the original on 12 March 2020. Retrieved 18 December 2019.
  10. "Guy who ran behind Muslim lady: Modi mantri Anant Kumar Hegde on Karnataka Congress chief". Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.
  11. Chauhan, Chanchal (2 January 2019). "India Today". Archived from the original on 9 November 2020. Retrieved 12 July 2020.
  12. Pereira, Stacy (30 January 2019). "Anant Kumar Hegde's New Shocker Has 'Hybrid Specimen' Slight Aimed at Rahul Gandhi". News18. Archived from the original on 7 February 2019. Retrieved 11 June 2019.
  13. Express News Service (30 January 2019). "After 'Hindu girl' row, Ananth Kumar Hegde's 'hybrid breed' attack on Rahul Gandhi". The New Indian Express. Archived from the original on 10 June 2019. Retrieved 11 June 2019.
  14. "'Traitor' tag on dejected IAS officer". The Telegraph (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2022. Retrieved 11 September 2019.
  15. "Go to Pakistan and fight Indian govt, former union minister Ananthkumar Hegde slams former IAS officer Sasikanth Senthi". The New Indian Express. Archived from the original on 13 September 2019. Retrieved 11 September 2019.
  16. ANI (3 February 2020). "BJP's Anantkumar Hegde calls Mahatma Gandhi's freedom struggle a 'drama'". India Today. Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  17. "BJP MP Ananth Kumar Hegde calls Mahatma Gandhi's freedom struggle a 'drama'". National Herald (in ఇంగ్లీష్). 3 February 2020. Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  18. D P Satish (3 February 2020). "Waiting for PM Modi's Comment, Says Congress After BJP MP Terms Gandhi's Freedom Struggle a 'Drama'". News18. Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  19. "Karnataka/ BJP leader Anant Kumar Hegde calls Gandhi's freedom struggle a drama, says: 'How such people are called Mahatma'". DBPOST. 3 February 2020. Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  20. Sakshi (5 February 2020). "అనంత్‌ 'చరిత్ర' పాఠాలు". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  21. ThePrint (11 August 2020). "'BSNL staff traitors, don't want to work' — BJP MP Anantkumar Hegde stirs up another row". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.