మాయావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు

భారతదేశంలోని రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ మాయావతి[1]. ఈమె బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన జాతవ్ అనే కులానికి చెందిన మహిళ. 2007 వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక ఒక సంచికలో ఈ విషయాన్ని ప్రకటించింది [2].

  • మాయావతి ఢిల్లీ నగరంలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించారు.ఆమె తండ్రి టెలికాం డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. మాయావతి చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిఇడితో పాటు న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఢిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1977 సమయంలో ఐఎఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. ఆయన 1984లో బహుజన సమాజ్‌ పార్టీ’ని స్థాపించారు. బిఎస్‌పిలో చేరిన మాయావతి మొదటి సారి ముజఫర్‌నగర్‌ జిల్లా కైరానా నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి అపజయం పాలయ్యారు. ఆ తర్వాత 1985లో బిజ్‌ నూర్‌, 1989లో హరిద్వార్‌ నుండి కూడా పోటీ చేసి ఓడిపోయారు.
  • ఈమె నిర్వహించిన పదవులు: లోక్‌సభ సభ్యు రాలు (1989, 1998, 1999, 2004)
  • రాజ్యసభ సభ్యురాలు: ------1994, 2004 (జులై).
  • ముఖ్యమంత్రి (ఉత్తరప్రదేశ్‌) :------1995, 1997, 2002 లలో కొంతకాలం,

2007 నుండి 2009 వరకు.

  • రాసిన పుస్తకాలు:--------------బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (హిందీ). బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు) మేరా సంఘర్ష్‌ మే జీవన్‌ అవమ్‌ బహుజన్‌ మూమెంట్‌ కా సఫర్‌నామా (హిందీ)

మూలములు[మార్చు]

  1. "Untouchable politics and politicians since 1956: Mayawati". Archived from the original on 2007-03-02. Retrieved 2007-03-30.
  2. "వెబ్‌దునియా తీసుకొన్నతేదీ 10-జనవరి-2008". Archived from the original on 2007-11-16. Retrieved 2008-01-10.
"https://te.wikipedia.org/w/index.php?title=మాయావతి&oldid=2961619" నుండి వెలికితీశారు