కాన్షీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బహుజన సమాజ్ పార్టీ నిర్మాత. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్‌సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్‌పూర్ గ్రామంలోజన్మించాడు.జ్యోతిరావుఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, నారాయణగురు, అంబేద్కర్‌ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన 'కుల నిర్మూలన ' గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి ముప్ఫై పేజీల ఉత్తరం రాస్తూ 'ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు' అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. ఒక ఓటు-ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు. నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? నడువు పార్లమెంటు, అసెంబ్లీకి నడువు. నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అనేవాడు. కులాన్ని కులంతోనే జయించాలని కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నాడు. యూపిలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు. మాయావతిని ముఖ్యమంత్రిగా చేశాడు. 1984లో ప్రారంభమైన బిఎస్‌పి 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది. 2006 అక్టోబరు 9న కాన్షీరాం మరణించాడు.