బహుజన్ సమాజ్ పార్టీ

వికీపీడియా నుండి
(Bahujan Samaj Party నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బహుజన్ సమాజ్ పార్టీ
లోకసభ నాయకుడుగిరీష్ చంద్ర
రాజ్యసభ నాయకుడురాంజీ గౌతమ్
స్థాపకులుకాన్షీరామ్
స్థాపన తేదీ14 ఏప్రిల్ 1984 (40 సంవత్సరాల క్రితం) (1984-04-14)
Preceded byదళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి
ప్రధాన కార్యాలయం12, గురుద్వారా రకబ్‌గంజ్ రోడ్డు, న్యూఢిల్లీ
రాజకీయ విధానంఆత్మ గౌరవం[1]
రంగు(లు)నీలం
ఈసిఐ హోదాజాతీయ పార్టీ
కూటమిశిరోమణి అకాలీ దళ్ (2021—present) (పంజాబ్)
లోక్‌సభలో సీట్లు10/543
రాజ్యసభలో సీట్లు1/245
Election symbol

బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఒక జాతీయ పార్టీ. సమాజంలో హెచ్చు సంఖ్యలో ఉన్నవారికి (వెనుకబడిన కులాలు, హరిజనులు, గిరిజనులు, మత పరంగా మైనారిటీ) ప్రాతినిథ్యం ఇవ్వడానికి ఏర్పడ్డ పార్టీ ఇది.[2] ఈ పార్టీని 1984 లో కాన్షీరామ్ స్థాపించాడు. ఆయన ఈ పార్టీ ఏర్పాటు చేసినపుడు భారతదేశంలో సుమారు 6000 కులాల్లో వర్గీకరించబడిన బహుజనులు మొత్తం జనాభాలో 85% ఉన్నారని అంచనా వేశాడు.[3][4] ఈ పార్టీ గౌతమ బుద్ధుడు, బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహరాజ్ మొదలైన వారి ఆదర్శాలతో ప్రారంభించినట్లు చెప్పారు.[5] కాన్షీరామ్ 2001 లో మాయావతిని తన వారసురాలిగా ప్రకటించాడు. ఈ పార్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. 2019 భారత సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 19.3 శాతం ఓట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఉన్నది.[6] 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 12.8 శాతం ఓట్లతో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది.[7] ఈ పార్టీ గుర్తు ఏనుగు. ఇదే గుర్తును అంబేద్కర్ గిరిజన తెగల సమాఖ్య గుర్తుగా వాడేవాడు.[8]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ms. Mayawati said she would devote her life for the self-respect movement". The Hindu.
  2. "Bahujan Samaj Party". The Times of India. Retrieved 2019-10-11.
  3. Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India (in ఇంగ్లీష్). Hurst. ISBN 9781850653981.
  4. "The Contradictory Bahujan of the BSP – Countercurrents". Countercurrents (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-28. Archived from the original on 28 October 2018. Retrieved 2018-03-09.
  5. "The ground flanked by giant-sized cut-outs of BSP's icons -- Babasaheb Ambedkar, Shahuji Maharaj, Jyotiba Phule, Narain Guru, Periyar, and Mayawati herself".
  6. "Indian politics has undergone a tremendous change. Uttar Pradesh results the proof". The Economic Times. 2019-05-26. Retrieved 2019-10-07.
  7. Bureau, Zee Media (2022-03-10). "UP Election Results: Landslide victory for BJP, SP distant 2nd; Congress, BSP decimated". Zee News. Retrieved 2022-03-11.
  8. Mishra, Anant Shekhar (2014-04-20). "A tale of election symbols". The Times of India. Retrieved 2022-03-11.