రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ
రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ | |
---|---|
నాయకుడు | హనుమాన్ బెనివాల్ |
సెక్రటరీ జనరల్ | నారాయణ్ బెనివాల్ |
స్థాపన తేదీ | 2018 అక్టోబరు 29 |
ప్రధాన కార్యాలయం | జైపూర్ |
రాజకీయ విధానం | ప్రాంతీయత |
రంగు(లు) | గ్రీన్, యెల్లో |
ECI Status | రాష్ట్ర పార్టీ |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) (2019–2020) |
లోక్‌సభ స్థానాలు | 1 / 545 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 3 / 200 |
Election symbol | |
రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (సంక్షిప్తంగా ఆర్‌ఎల్పీ) రాజస్థాన్ రాష్ట్రంలోని భారతీయ రాజకీయ పార్టీ. 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల సందర్భంగా హనుమాన్ బెనివాల్ ఈ పార్టీని స్థాపించాడు. ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడుగా వ్యవహరించాడు.[1][2]
2019 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పార్టీ పొత్తు పెట్టుకుంది.[3] ఇది 2020 భారత్ బంద్, భారతీయ రైతుల నిరసనకు తన మద్దతును అందించింది.[4]
అక్టోబరు 27న, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల కోసం చంద్రశేఖర్ ఆజాద్ రావణ్కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)తో పొత్తును ప్రకటించింది.[5]
చరిత్ర
[మార్చు]పార్టీ సీనియర్ నాయకత్వంపై విభేదాలు, అవినీతి ఆరోపణల కారణంగా హనుమాన్ బెనివాల్‌ను భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది, అతను రాజస్థాన్ శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా మారాడు.[1] 2018లో, శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన "హుంకార్ ర్యాలీ" నిర్వహించాడు. ఘనశ్యామ్ తివారీ, జయంత్ చౌదరి, సంజయ్ లాథర్‌ల మద్దతుతో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీని స్థాపించాడు.[2]
జాట్ కమ్యూనిటీ సభ్యుల నుండి మద్దతు పొందిన ఆ పార్టీ మూడు శాసనసభ స్థానాల్లో పాగావేసింది.[4][6] 2019లో, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇది నాగౌర్ స్థానంలో పోటీ చేసింది.[3]
నాగౌర్ స్థానం నుంచి పోటీ చేసిన హనుమాన్ బెనివాల్ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 2020 భారత వ్యవసాయ సంస్కరణ ఆమోదం పొందిన తరువాత, ఆయన మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా చేసాడు.[7] భారతీయ రైతుల నిరసనకు పార్టీ తన మద్దతును అందించింది. అఖిల భారత సార్వత్రిక సమ్మెకు కూడా మద్దతు ఇచ్చింది.[4]
పార్టీ సభ్యులు
[మార్చు]- హనుమాన్ బెనివాల్, ఎంపీ, నాగౌర్ - వ్యవస్థాపకుడు
- మనీష్ చౌదరి - ప్రధాన కార్యదర్శి
- పుఖ్‌రాజ్ గార్గ్ - ఎమ్మెల్యే, భోపాల్‌గఢ్
- నారాయణ్ బెనివాల్ - ఎమ్మెల్యే, ఖిన్వ్సర్
- ఇందిరా దేవి బవారి - ఎమ్మెల్యే, మెర్టా
- రాజ్‌పాల్ చౌదరి - అధికార ప్రతినిధి, జైపూర్
- వివేక్ మచ్రా - ప్రతినిధి, బికనీర్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Hanuman Beniwal floats new political party in Rajasthan". The Hindu (in Indian English). 2018-10-29. ISSN 0971-751X. Retrieved 2020-12-25.
- ↑ 2.0 2.1 "Ahead Of Rajasthan Polls, Former BJP Leader Launches New Party". NDTV. 29 October 2018. Retrieved 30 October 2018.
- ↑ 3.0 3.1 Goyal, Yash (4 April 2019). "RLP joins NDA in R'sthan". Tribune India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-25.
- ↑ 4.0 4.1 4.2 Iqbal, Mohammed (2020-11-30). "NDA constituent RLP threatens to quit alliance over farm laws". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-25.
- ↑ Nair, Sobhana K. (2023-10-31). "Rashtriya Loktantrik Party makes another bid to lose its 'marginal player' tag in Rajasthan politics". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-08.
- ↑ Iqbal, Mohammad (2018-12-10). "Raje resigns, Congress two seats away from majority". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-25.
- ↑ Saini, Sachin (2020-12-21). "Call on NDA, RLP break-up on Dec 26, says Hanuman Beniwal". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2020-12-25.