ఘన్ శ్యామ్ తివారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘన్‌శ్యామ్‌ తివారీ
ఘన్ శ్యామ్ తివారీ


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
జులై 2022
నియోజకవర్గం రాజస్థాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-12-19) 1947 డిసెంబరు 19 (వయసు 76)
శిఖర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పుష్ప తివారి
నివాసం శ్యామ్ నగర్, జైపూర్

ఘనశ్యామ్ తివారీ (జననం 19 డిసెంబర్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజస్థాన్‌ శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 

రాజకీయ జీవితం[మార్చు]

తివారీ జనతా పార్టీ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు, కానీ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా, కొంతమంది సభ్యులు జనతా పార్టీ నుండి విడిపోయి ఏప్రిల్ 6, 1980న భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయగా, ఆయన రాజస్థాన్‌లో బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకడిగా ఉన్నాడు. ఘన్ శ్యామ్ తివారీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2013 ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించాడు. ఆయన రాజస్తాన్ ప్రభుత్వంలో విద్యుత్, పౌర సరఫరాల, న్యాయ, విద్యాశాఖల మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసి రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో విభేదాలు కారణంగా 2018లో ఆయన బీజేపీకి రాజీనామా చేసి[1] ఆ తర్వాత భారత్ వాహిని పార్టీని ఏర్పాటు చేసి సంగనెర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2020లో తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

ఘనశ్యామ్ తివారీ జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్‌ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

ఎమ్మెల్యేగా ఎన్నిక[మార్చు]

నియోజకవర్గం నుండి - వరకు
సికర్ - 1980-1985
సికర్ - 1985-1989
చోము - 1993-1998
సంగనేర్ - 2003-2008
సంగనేర్ - 2008-2013
సంగనేర్ - 2013-2018

మూలాలు[మార్చు]

  1. Sakshi (25 June 2018). "బీజేపీ సీనియర్‌ నేత రాజీనామా". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Andhra Jyothy (12 December 2020). "రెండేళ్ల తర్వాత తిరిగి బీజేపీ గూటికి చేరిన రాజస్థాన్ సీనియర్ నేత" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  3. Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  4. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా, ప్రమోద్ తివారీ గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.