2022 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో పదవీ విరమణ చేసిన సభ్యులను ఎన్నుకోవడానికి 2022 సంవత్సరంలో ఖాళీ అయిన స్థానాలకు 2022లో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించారు.[1] రాజ్యసభకు 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు జూన్‌ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. జూన్‌ 10 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కిస్తారు.[2]

ప్రస్తుతానికి రాజ్యాంగం ఎగువ సభలో గరిష్టంగా 250 మంది సభ్యులకు చోటు కల్పిస్తున్నారు. వారిలో 238 మంది సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓట్‌ల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. అయితే 12 మంది సభ్యులను సంగీతం, క్రీడలు, ఆర్థిక శాస్త్రం, ఇతర వివిధ రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.

రాష్ట్రాల వారీగా ఎన్నికల జాబితా[మార్చు]

రాష్ట్రం సభ్యులు పదవీ విరమణ పదవీ విరమణ తేదీ
అస్సాం 2 2022 ఏప్రిల్ 2
హిమాచల్ ప్రదేశ్ 1 2022 ఏప్రిల్ 2
కేరళ 3 2022 ఏప్రిల్ 2
నాగాలాండ్ 1 2022 ఏప్రిల్ 2
త్రిపుర 1 2022 ఏప్రిల్ 2
పంజాబ్ 5 2022 ఏప్రిల్ 9
ఆంధ్రప్రదేశ్ 4 2022 జూన్ 21
తెలంగాణ 2 2022 జూన్ 21
ఛత్తీస్‌గఢ్ 2 2022 జూన్ 29
మధ్యప్రదేశ్ 3 2022 జూన్ 29
తమిళనాడు 6 2022 జూన్ 29
కర్ణాటక 4 2022 జూన్ 30
ఒడిశా 3 2022 జూలై 1
మహారాష్ట్ర 6 2022 జూలై 4
పంజాబ్ 2 2022 జూలై 4
రాజస్థాన్ 4 2022 జూలై 4
ఉత్తర ప్రదేశ్ 11 2022 జూలై 4
ఉత్తరాఖండ్ 1 2022 జూలై 4
బీహార్ 5 2022 జూలై 7
జార్ఖండ్ 2 2022 జూలై 7
హర్యానా 2 2022 ఆగస్టు 1
మొత్తం 70

తెలంగాణ[మార్చు]

సంఖ్య ముందు పార్టీ పదవికాలం పూర్తి ఎన్నికైన ఎంపీ పార్టీ
1 వి.లక్ష్మీకాంత రావు టీఆర్ఎస్ పార్టీ 2022 జూన్ 21 బండి పార్థసారథి రెడ్డి[3] టీఆర్ఎస్ పార్టీ
2 డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ 2022 జూన్ 21 దీవకొండ దామోదర్ రావు [3] టీఆర్ఎస్ పార్టీ

ఉప ఎన్నిక[మార్చు]

  • 2021 డిసెంబరు 4, బండాప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ
సంఖ్య మాజీ ఎంపీ పార్టీ ఖాళీ అయిన తేదీ ఎన్నుకున్న ఎంపీ పార్టీ ఎన్నికైన తేదీ పదవీ విరమణ తేదీ
1 బండ ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీ 2021 డిసెంబరు 4 వద్దిరాజు రవిచంద్ర[4] టీఆర్ఎస్ పార్టీ 2022 మే 30 2024 ఏప్రిల్‌ 2

ఆంధ్రప్రదేశ్[మార్చు]

సంఖ్య మాజీ ఎంపీ పార్టీ ఖాళీ అయిన తేదీ ఎన్నుకున్న ఎంపీ పార్టీ ఎన్నికైన తేదీ పదవీ విరమణ తేదీ
1 విజయసాయి రెడ్డి[5] వైసీపీ 2022 జూన్ 21 విజయసాయి రెడ్డి[3] వైసీపీ
2 సురేష్ ప్రభు బీజేపీ 2022 జూన్ 21 ఆర్.కృష్ణయ్య[3] వైసీపీ
3 సుజనా చౌదరి బీజేపీ 2022 జూన్ 21 నిరంజన్ రెడ్డి[3] వైసీపీ
4 టి.జి.వెంకటేష్ బీజేపీ 2022 జూన్ 21 బీద మస్తాన్‌రావు[3] వైసీపీ

కర్ణాటక[మార్చు]

సంఖ్య ముందు పార్టీ పదవికాలం పూర్తి ఎన్నికైన ఎంపీ పార్టీ పదవికాలం
1 నిర్మలా సీతారామన్[6] బీజేపీ 2022 జూన్ 30 నిర్మలా సీతారామన్ బీజేపీ 2022 జూన్ 1 - 2028 మే 31
2 కే. సి. రామమూర్తి బీజేపీ 2022 జూన్ 30 జగ్గేష్ బీజేపీ 2022 జూన్ 1 - 2028 మే 31
3 ఆస్కార్ ఫెర్నాండేజ్ కాంగ్రెస్ పార్టీ 2022 జూన్ 30 లెహర్ సింగ్ సిరోయా బీజేపీ 2022 జూన్ 1 - 2028 మే 31
4 జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ 2022 జూన్ 30 జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ 2022 జూన్ 1 - 2028 మే 31

రాజస్థాన్‌[మార్చు]

సంఖ్య ముందు పార్టీ పదవికాలం పూర్తి ఎన్నికైన ఎంపీ పార్టీ పదవికాలం
1 ఓం ప్రకాష్ మాథుర్ బీజేపీ 04 జూలై 2022 రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ 5 జూలై 2022 - 04 జూలై 2028
2 రామ్ కుమార్ వర్మ బీజేపీ 04 జూలై 2022 ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ పార్టీ 5 జూలై 2022 - 04 జూలై 2028
3 హర్షవర్ధన్ సింగ్ దుంగార్పూర్ బీజేపీ 04 జూలై 2022 ప్రమోద్ తివారీ కాంగ్రెస్ పార్టీ 5 జూలై 2022 - 04 జూలై 2028
4 అల్ఫోన్స్ కన్నంతనమ్ బీజేపీ 04 జూలై 2022 ఘన్‌శ్యామ్‌ తివారీ కాంగ్రెస్ పార్టీ 5 జూలై 2022 - 04 జూలై 2028

మూలాలు[మార్చు]

  1. ThePrint (2 March 2020). "BJP's Rajya Sabha tally will marginally drop after March, but real worry will be after 2022". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. Eenadu (13 May 2022). "రాజ్యసభ ఎన్నికలు జూన్‌ 10న". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 TV9 Telugu (3 June 2022). "రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవం.. ఏపీలో నాలుగు.. తెలంగాణలో రెండు." Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (30 May 2022). "రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  5. Hindustantimes Telugu (11 June 2022). "వైసీపీ ఖాతాలోకే 4 రాజ్యసభ స్థానాలు.. ఏకగ్రీవంగా ఎన్నిక". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  6. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.

వెలుపలి లంకెలు[మార్చు]