కార్తికేయ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్తికేయ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఆగష్టు 2

వ్యక్తిగత వివరాలు

జననం (1981-05-14) 1981 మే 14 (వయసు 43)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
తల్లిదండ్రులు
జీవిత భాగస్వామి ఐశ్వర్య శర్మ
(m. 2011–ప్రస్తుతం)
బంధువులు మను శర్మ (సోదరుడు)
కుల్‌దీప్ శర్మ (మామ)
వృత్తి
  • ఐ టీవీ మీడియా నెట్‌వర్క్ (వ్యవస్థాపకుడు)

కార్తికేయ శర్మ (జననం 1981 మే 14) హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 రాజ్యసభ ఎన్నికలలో హర్యానా నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఆయన జాతీయ, ఇంగ్లీష్, హిందీ & 7 ప్రాంతీయ భాషలతో సహా పలు వార్తా ఛానెల్‌లను (ఛానెల్ న్యూస్‌ఎక్స్, ఇండియా న్యూస్ హర్యానా, ఇండియా న్యూస్ మధ్యప్రదేశ్, ఇండియా న్యూస్ ఛత్తీస్‌గఢ్, ఇండియా న్యూస్ పంజాబ్, ఇండియా న్యూస్ ఉత్తరప్రదేశ్) నిర్వహించే ఐటీవి (ఇన్ఫర్మేషన్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్) మీడియా నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు.[3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కార్తికేయ శర్మ 1981 మే 14 న కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ, శక్తి రాణి శర్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ (ఆనర్స్), లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.

కార్తికేయ శర్మ, హర్యానా మాజీ శాసనసభ స్పీకర్ కుల్‌దీప్ శర్మ కుమార్తె ఐశ్వర్య శర్మను వివాహం చేసుకున్నాడు. ఆయనకు గుర్గావ్, ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్‌లో ఫైవ్ స్టార్ హోటళ్లలో వాటాలు ఉన్నాయి.

రాజకీయ జీవితం

[మార్చు]

కార్తికేయ శర్మ 2022 రాజ్యసభ ఎన్నికలలో హర్యానా నుండి బిజెపి & జెజెపిల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ ప్రాధాన్యత ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ పై గెలిచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బీజేపీ అభ్యర్థి కృష్ణలాల్ పన్వార్‌కు 3600 ఓట్లు వచ్చాయి. కృష్ణ లాల్ పన్వార్ గెలుపునకు 2934 ఓట్లు అవసరం. అటువంటి పరిస్థితిలో 3600 ఓట్లలో కార్తికేయ శర్మ ఆ ఓట్లలో రెండవ ప్రాధాన్యతలో ఉన్నందున 666 ఓట్లు వచ్చాయి. కార్తికేయ శర్మకు వచ్చిన 2300 ఓట్లకు 666 ఓట్లు జోడించడంతో కార్తికేయ శర్మకు మొత్తం 2966 ఓట్లు వచ్చాయి. అటువంటి పరిస్థితిలో 2900 ఓట్లు పొందిన అజయ్ మాకెన్ ఎన్నికలలో కార్తికేయ శర్మ చేతిలో ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (11 June 2022). "Shocker for Congress in Haryana, Ajay Maken loses RS elections by 'narrow margin' to media baron Kartikeya Sharma". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  2. The Times of India (12 June 2022). "BJP 2nd preference votes did the trick for Kartikeya". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  3. The Indian Express (11 June 2022). "Newsmaker | Kartikeya Sharma: The media baron and son of a veteran politician who toppled Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  4. TV9 Bharatvarsh (10 June 2022). "Kartikeya Sharma: कौन हैं कार्तिकेय शर्मा, जो निर्दलीय उम्मीदवार होते हुए भी राज्यसभा चुनाव में बिगाड़ सकते हैं कांग्रेस का समीकरण?". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ETV Bharat News (11 June 2022). "Rajya Sabha Election: हरियाणा में बड़ा उलटफेर, अजय माकन चुनाव हारे... बीजेपी के कृष्ण पंवार और निर्दलीय कार्तिकेय शर्मा जीते". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  6. The Tribune (11 June 2022). "Rajya Sabha polls: BJPs Krishan Lal Panwar, Independent candidate Kartikeya Sharma elected from Haryana; Congs Ajay Makan loses" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.