ప్రదీప్ టామ్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రదీప్ టామ్టా

పదవీ కాలం
5 జులై 2016 – 5 జులై 2022
ముందు తరుణ్ విజయ్
నియోజకవర్గం ఉత్తరాఖండ్

పదవీ కాలం
2009 – 2014
ముందు బాచి సింగ్ రావత్
తరువాత అజయ్ తమ్తా
నియోజకవర్గం అల్మోరా

వ్యక్తిగత వివరాలు

జననం (1958-06-16) 1958 జూన్ 16 (వయసు 66)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రదీప్ టామ్టా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఉత్తరాఖండ్ శాసనసభకు నుండి ఎమ్మెల్యేగా, 2009లో లోక్‌సభ సభ్యుడిగా, 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అల్మోరా లోక్‌సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ప్రదీప్ టామ్టా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బగేశ్వర్ జిల్లాలోని లోబ్ గ్రామంలో గుసైన్ రామ్, పార్వతీ దేవి దంపతులకు 16 జూన్ 1958న జన్మించాడు. ఆయన నైనిటాల్‌లోని కుమావోన్ యూనివర్సిటీలో ఎంఏ, బీఈడీ ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు భార్య రేణు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రదీప్ టామ్టా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ప్రాక్టీస్‌ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి 1993లో ఉత్తరప్రదేశ్‌లోని బాగేశ్వర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సోమేశ్వర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం వివరణ
2002 - 2007 1వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1వసారి)
  • వైస్ చైర్మన్ - ఉత్తరాఖండ్ ఉద్యోగ్ పరిషత్ (2002–03)
  • సభ్యుడు - SCలు, STలు మరియు OBCలపై అసెంబ్లీ కమిటీ (2002–04)
  • సభ్యుడు - PSE మరియు కార్పొరేట్‌పై కమిటీ (2004–07)
2009 - 2014 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (1వ పర్యాయం)
  • సభ్యుడు - సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై కమిటీ (2009 - 14)
  • సభ్యుడు - అధికారిక భాషపై కమిటీ (2009 - 14)
  • సభ్యుడు - గ్రామీణాభివృద్ధి , పంచాయితీ రాజ్ మరియు త్రాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కోసం సంప్రదింపుల కమిటీ (2009 - 14)
2016 - ఇప్పటి వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు (మొదటిసారి)
  • సభ్యుడు - షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ (2016–19) & (2020 - ఇప్పటి వరకు)
  • సభ్యుడు - నీటి వనరులపై కమిటీ (2016 - ఇప్పటి వరకు)
  • సభ్యుడు - గ్రామీణాభివృద్ధి , పంచాయితీ రాజ్, గనుల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ (2016–19)
  • సభ్యుడు - అధికారిక భాషపై కమిటీ (2018 - ఇప్పటి వరకు)
  • సభ్యుడు - ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , రాయ్ బరేలి (2019 - ఇప్పటి వరకు)
  • సభ్యుడు - సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ (2019 - ఇప్పటి వరకు)
  • సభ్యుడు - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ

పోటీ చేసిన ఎన్నికలు

[మార్చు]

లోక్‌సభ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం మూ
2009 అల్మోరా గెలుపు   41.70% అజయ్ తమ్తా బీజేపీ 40.36% [3]
2014 అల్మోరా ఓటమి 38.44% అజయ్ తమ్తా బీజేపీ 53.00% [4]
2019 అల్మోరా ఓటమి 30.48% అజయ్ తమ్తా బీజేపీ 64.03% [5]
2024 అల్మోరా

ఉత్తరాఖండ్ శాసనసభ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఫలితం
1993[6] బాగేశ్వర్ ఓటమి
2002[7] సోమేశ్వర్ గెలుపు  
2007[8] ఓటమి

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (12 June 2016). "Uttarakhand: Cong nominee Pradeep Tamta wins RS seat with PDF support, BJP 'not disappointed'" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  2. TV9 Bharatvarsh, TV9 (2024). "Pradeep Tamta Cong Candidate Profile: उत्तराखंड Pradeep Tamta लोकसभा चुनाव 2024 उम्‍मीदवार" (in హిందీ). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  4. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. "State Election, 1993 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 16 January 2021.
  7. "State Election, 2002 to the Legislative Assembly Of Uttarakhand". eci.gov.in. Election Commission of India. Retrieved 16 January 2021.
  8. "State Election, 2017 to the Legislative Assembly Of Uttarakhand". eci.gov.in. Election Commission of India. Retrieved 16 January 2021.